హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2025 సంవత్సరానికి గానూ వివిధ రాష్ట్రాలు, యూటీలు, సీఏపీఎఫ్‌లు, సీపీఓలకు చెందిన 1,466 మంది సిబ్బందికి


స్పెషల్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ రంగాల్లో అత్యుత్తమ పనితీరును గుర్తించటం, ఉన్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించటం, సంబంధిత అధికారులు ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచటానికి 'కేంద్ర గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులు దోహదపడతాయి

పోలీసు సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులు ప్రారంభం

2024 ఫిబ్రవరిలో 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులను ఏర్పాటు చేసిన కేంద్ర హోం శాఖ

ఏటా అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డుల ప్రకటన

Posted On: 31 OCT 2025 9:13AM by PIB Hyderabad

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (యూటీలు), కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌లు), కేంద్ర పోలీసు సంస్థల (సీపీఓలు)కు చెందిన 1,466 మంది సిబ్బందికి 2025 సంవత్సరానికి గానూ 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులను ప్రకటించారు.

అత్యుత్తమ పనితీరుని గుర్తించటం, ఉన్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించటం, సంబంధిత అధికారులు, ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచటానికి నాలుగు రంగాల్లోని సిబ్బందికి ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.

(i) స్పెషల్ ఆపరేషన్

(ii) ఇన్వెస్టిగేషన్

(iii) ఇంటెలిజెన్స్

(iv) ఫోరెన్సిక్ సైన్స్

పోలీసు సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులు ప్రారంభమయ్యాయి.

"కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్" అవార్డులను 2024 ఫిబ్రవరి 1న వెలువరించిన నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ బలగాలు, భద్రతా సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేంద్ర పోలీసు సంస్థలు (సీపీఓలు), కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్ లు), ఇంటెలిజెన్స్ వింగ్/బ్రాంచ్/స్పెషల్ బ్రాంచ్ సభ్యులు, ఫోరెన్సిక్ సైన్స్ (కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) విభాగాల వారికి 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులను ప్రదానం చేస్తారు. ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ, దర్యాప్తులో విశిష్ట సేవలు, అసాధారణ ప్రదర్శన, తిరుగులేని, సాహసోపేతమైన ఇంటెలిజెన్స్ సేవ, ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ శాస్త్రవేత్తలు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులను అందజేస్తారు.

ఏటా అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' అవార్డులను ప్రకటిస్తారు.

అవార్డులు పొందిన వారి జాబితా ఎంహెచ్ఏ వైబ్ సైట్ https://www.mha.gov.in లో అందుబాటులో ఉంటుంది.

Click for list of Awardees

 

***


(Release ID: 2184570) Visitor Counter : 14