సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత మహత్తర సంగీతోత్సవ పునరాగమనం: 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనం


దేశంలోని 24 నగరాల్లో నవంబరు 2 నుంచి 29 దాకా స్వర ఝరీ ప్రతిధ్వని

1954 నుంచి కొనసాగుతున్న భారత ఘన సంగీత వైభవాన్ని ముందుకు తీసుకెళ్లే జాతీయ స్థాయి వేడుకలో ఒకే వేదికపై ప్రసిద్ధ హిందుస్థానీ.. కర్ణాటక.. జానపద సంప్రదాయ కళాకారుల ప్రదర్శనలు

దేశవ్యాప్తంగా 2025 డిసెంబరు 26 నుంచి 2026 జనవరి 23 వరకు ఆల్‌ ఇండియా రేడియో దూరదర్శన్‌ భారతి.. వేవ్స్‌ ఓటీటీ.. తదితర డిజిటల్ వేదికల ద్వారా కార్యక్రమాల ప్రసారం

Posted On: 30 OCT 2025 6:56PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక వార్షిక సంగీతోత్సవం 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనాన్ని దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో నవంబరు నుంచి 29 వరకూ నిర్వహిస్తారుకేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రసార భారతి సంస్థ ఇవాళ సహర్షంగా ప్రకటించింది.

దేశంలో అత్యంత నిత్యనూతనగౌరవనీయ సాంస్కృతిక సంప్రదాయాల్లో ఒకటిగా నిలిచిన ఆకాశవాణి సంగీత సమ్మేళనం తొలుత 1954లో ప్రారంభమైందిఅప్పటినుంచీ ఈ కార్యక్రమం హిందూస్థానీకర్ణాటకలలితజానపద సంగీత అత్యుత్తమ స్రవంతిని జాతీయస్థాయిలో ప్రజానీకానికి చేరువ చేస్తోందిభారతీయ మహత్తర సంగీత వారసత్వ పరిరక్షణతోపాటు ప్రోత్సహించడంప్రాచుర్యం కల్పించడంలో ఈ ఉత్సవం కీలక పాత్ర పోషించిందిఅందుకే ఇది అటు కళాకారులుఇటు శ్రోతలు ఏటా ఉత్సుకతతో ఎదురుచూసే ప్రతిష్టాత్మక సంప్రదాయంగా రూపుదాల్చిందిఅలాగే ప్రసిద్ధవర్ధమాన సంగీత కళాకారులకు జాతీయ గుర్తింపుగౌరవం లభించే ప్రతిష్ఠాత్మక వేదికగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవోగౌరవ్ ద్వివేది సంగీత సమ్మేళనం వివరాలను వెల్లడించారుకోవిడ్‌-19 మహమ్మారి కారణంగా కొంత అంతరాయం ఏర్పడిందనిఈ మహత్తర సంగీతోత్సవం ఇప్పుడు 2025లో సరికొత్త ఉత్తేజంతో పునఃప్రారంభం అవుతున్నదని ఆయన తెలిపారుదేశంలోని 24 కేంద్రాల్లో ప్రతి వేదికపై రెండు కచేరీల వంతున నిర్వహిస్తామని చెప్పారువీటిలో ఒకటి శాస్త్రీయ సంగీతానికి (గాత్రవాద్య), మరొకటి లలితజానపద సంగీతానికి సంబంధించినవిగా ఉంటాయిఅయితేజిషిల్లాంగ్ నగరాల్లో ప్రత్యేకించి పాశ్చాత్య శాస్త్రీయ సంగీత ప్రదర్శనలుంటాయనిభారత ప్రాంతీయ సంగీత వైవిధ్యాన్ని ఇవన్నీ ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంగీత సమ్మేళనం తొలి రోజు కచేరీలను నవంబరు 2 ఢిల్లీముంబయిచెన్నై నగరాల్లో ఆహ్వానిత శ్రోతల సమక్షాన నిర్వహిస్తారుతదుపరి నవంబరు 8న ఉదయపూర్తిరువనంతపురంకటక్‌లలో ప్రారంభమై నవంబరు 29 వరకూ ధార్వాడ్హైదరాబాద్జలంధర్‌లలో కొనసాగుతాయి.

అన్ని కచేరీలకూ ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ప్రజలు హాజరు కావచ్చుననిసంబంధిత ఆకాశవాణి స్టేషన్లలో ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన ఆహ్వాన కార్డులు అందజేస్తామని ప్రకటించారు.

సమ్మేళనం ముఖ్యాంశాలు:

·         నిత్యనూతన సంప్రదాయ 67 వార్షికోత్సవం- 1954 నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక సంగీత నైపుణ్య వారసత్వం.

·         ద్వంద్వ కచేరీ రూపంప్రతి కేంద్రంలో శాస్త్రీయలలిత లేదా జానపద ప్రదర్శనలు

·         ప్రసిద్ధ కళాకారుల ప్రదర్శనలు

·         కచేరీలన్నీ ముగిశాక ఆకాశవాణి నెట్‌వర్క్‌ ద్వారా డిసెంబరు 26 నుంచి 2026 జనవరి 23 వరకు నిత్యం రాత్రి 10:00 నుంచి 11:00 గంటల వరకు ప్రసారమవుతాయి.

ఇవన్నీ కింది వేదికలలో అందుబాటులో ఉంటాయి:

o   రాగం ఛానల్ (డీటీహెచ్‌)

o   డీడీ భారతి

o   రాగం యూట్యూబ్‌ ఛానల్

o   వేవ్స్‌ ఓటీటీ వేదిక

o   న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌ యాప్‌

ఆకాశవాణి సంగీత సమ్మేళనం-2025

ప్రదర్శన ఇవ్వబోయే కళాకారులుతేదీల వారీగా కార్యక్రమాలు

2025 నవంబరు 2

·         ఢిల్లీ: పండిట్ రాకేష్ చౌరాసియా (వేణువు), శ్రీ నందీష్ ఉమాప్ (జానపద)

·         ముంబయి: పండిట్ వెంకటేష్ కుమార్ (గాత్రం), శ్రీ హమీద్ అమీన్‌భాయ్ సయ్యద్ అండ్‌ పార్టీ (భరూద్)

·         చెన్నై: పుష్పవనం శ్రీ కుప్పుస్వామి (జానపదం), ఉదయలూరు శ్రీ కె.కల్యాణరామన్ (భక్తి)

2025 నవంబరు 8

·         ఉదయ్‌పూర్‌: మొహమ్మద్‌అమన్ ఖాన్ (గాత్రం), డాక్టర్‌ విజయేంద్ర గౌతమ్ (లలిత సంగీతం)

·         తిరువనంతపురం: కుడమలూరు మురళీధర మారార్ (పంచవాద్యం), విదుషీ డాక్టర్‌ ఎన్.జె.నందిని (కర్ణాటక గాత్ర సంగీతం), అజిత్ జి.కృష్ణన్ అండ్‌ ఎస్.ఆర్.శ్రీకుట్టి (లలిత సంగీతం)

 

·         కటక్‌: ప్రదీప్తశేఖర్ మహాపాత్ర (వేణువు), డాక్టర్‌ నాజియా సయీద్ అండ్‌ సంతోషి ప్రసాద్ మిశ్రా (లలిత సంగీతం)

2025 నవంబరు 9

·         పుణెవిదుషీ జ్యోతి హెగ్డే (రుద్రవీణ), విజయ్‌కుమార్ గైక్వాడ్ అండ్‌ గ్రూప్ (జానపదం)

·         పణజి: దేబ్‌శంకర్ రాయ్ అండ్‌ జ్యోతిశంకర్ రాయ్ (పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం), ప్రాచీజాతర్  శ్రీమతి శకుంతలా భరణే (లలిత సంగీతం)

2025 నవంబరు 15-16

·         కోల్‌కతాపండిట్ అషిమ్ చౌదరి (సితార్), సబీనా ముంతాజ్ ఇస్లాం (ఖాయల్), అగ్నిభా బందోపాధ్యాయశ్రీరాధా బందోపాధ్యాయ (లలిత సంగీతంసోమ దాస్ మొండల్కార్తీక్ దాస్ (జానపదం)

·         తిరుచిరాపల్లి: శ్రీమతి విశాఖ హరి (కర్ణాటక గాత్ర సంగీతం), శ్రీ ఎన్.శివాజీ రావు అండ్‌ పార్టీ (కరగాట్టం)

·         భోపాల్: పండిట్‌ సంతోష్ నహర్ (వయొలిన్), డాక్టర్‌ దీపాలీవాటల్ (గజల్)

·         వారణాసి: శ్రీ శుభంకర్ డే (ఖాయల్), శ్రీ మన్నాలాల్ యాదవ్ అండ్‌ గ్రూప్ (జానపదం)

·         లక్నో: పి.ధర్మనాథ్ మిశ్రా (తుమ్రి/దాద్రా), డాక్టర్ మెంకా మిశ్రా (లలిత సంగీతం)

·         విజయవాడ: పండిట్‌ కొల్లూరు వందన (కర్ణాటక గాత్ర సంగీతం), మోదుమూడి సుధాకర్ (లలిత సంగీతం)

2025 నవంబరు 21

·         జైపూర్‌పండిట్‌ విశ్వమోహన్ భట్ (గిటార్), పండిట్సీతారామ్ సింగ్ (లలిత సంగీతం)

2025 నవంబరు 22

·         బెంగళూరు: బెంగళూరు బ్రదర్స్ (కర్ణాటక సంగీత యుగళం), లక్ష్మీనాగరాజు (లలిత సంగీతం)

·         గువహటి: శ్రీ మనోజ్ బారువా (వయొలిన్), శ్రీమతి జబా చక్రవర్తి దాస్ (జానపదం)

2025 నవంబరు 23

·         మైసూర్: డాక్టర్ సహానా ఎస్వీ (వీణ), శ్రీ హెచ్.ఎల్.శివశంకరస్వామి (మృదంగ తరంగం)

·         అహ్మదాబాద్: పండిట్‌ మహేంద్ర టోకే (గాత్రం), పండిట్ నకుల్ మిశ్రా (తబలా), రఫీక్ ఖాన్ (వయొలిన్), కల్యాణి కౌతాల్కర్హస్ముఖ్ పటాడియా (లలిత సంగీతం)

2025 నవంబరు 27

·         షిల్లాంగ్‌: నా రింపీ (బ్యాండ్), శ్రీమతి గ్వినేత్ మావ్లాంగ్కలర్స్ (బ్యాండ్), ఖోర్షా కోర్డోర్ మార్బానియాంగ్సిల్బిపాసా అండ్‌ పార్టీలౌవ్రే వి.మరాక్ అండ్‌ పార్టీ (జానపదం)

·         పాట్నా: స్మిత్ తివారి (సరోద్), మనోరంజన్ ఓఝా (జానపదం)

2025 నవంబరు 29

·         ధార్వాడ్: పండిట్‌ భీమన్నజాదవ్ (సుందరి), వెంకటేష్ ఆల్కోడ్ఆరాధనాహెగ్డే (లలిత సంగీతం), మహంతేష్ హుగర్ (జానపదం)

·         హైదరాబాద్: విద్వాన్ శ్రీ డి.వి.మోహన కృష్ణ (కర్ణాటక గాత్ర సంగీతం), శ్రీమతి అరుణా సుబ్బారావుశ్రీ పత్రి కుమార స్వామి (జానపదం)

·         జలంధర్: భాయ్ గుర్మీత్ సింగ్ శాంత్ (షాబాద్ కీర్తన్), శ్రీమతి గ్లోరీ బావా (జానపదం)

 

***


(Release ID: 2184446) Visitor Counter : 5