పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంధనం, సముద్ర వాణిజ్య సామర్థ్యంతో ముడిపడిన భారత వృద్ధి: శ్రీ హర్దీప్ సింగ్ పూరి

Posted On: 29 OCT 2025 2:06PM by PIB Hyderabad

ఇండియా మారీటైమ్ వీక్ 2025లో భాగంగా ముంబయిలో నిర్వహించిన ‘రీవైటలైజింగ్ ఇండియాస్ మారీటైమ్ మ్యాన్యుఫాక్చరింగ్ కాన్ఫరెన్స్’’లో పెట్రోలియంసహజ వాయు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగించారుదేశాభివృద్ధికి ప్రధానాధారాలుగా ఉన్న ఇంధనషిప్పింగ్ రంగాల పురోగతితో భారతీయ ఆర్థిక వృద్ధి అనుసంధానమై ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతం సుమారుగా 4.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి అన్నారుదీనిలో దాదాపు సగం.. ఎగుమతులుదిగుమతులువిదేశీ చెల్లింపుల వంటి బాహ్యరంగాల నుంచే వస్తోందిఇది భారతీయ ఆర్థిక ప్రగతికి వాణిజ్యంనౌకా రవాణా ఎంత ముఖ్యమైనవో తెలియజేస్తుంది.

ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. భారత్‌లో నాలుగున్నరేళ్ల కిందట రోజుకి మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు వినియోగం ఉంటే.. ఇప్పుడు అది 5.6 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుందని శ్రీ పూరీ అన్నారుప్రస్తుత వృద్ది రేటు ప్రకారం.. త్వరలోనే ఇది రోజుకు మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందివచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయంగా పెరిగే విద్యుత్తు డిమాండ్‌లో 30 శాతాన్ని భారత్ తీరుస్తుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనా వేసిందని వెల్లడించారుఇది గతంలో 25 శాతంగా ఉండేదిఇలా పెరుగుతున్న ఇంధన డిమాండ్.. చమురుగ్యాస్ఇతర ఇంధన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడానికి నౌకల అవసరాన్ని భారత్‌కు సహజంగానే పెంచుతుందని వెల్లడించారు.

2024-25లో దాదాపు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురుపెట్రోలియం ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుందని, 65 మిలియన్ మెట్రిక్ టన్నుల మేర ఎగుమతి చేసిందని మంత్రి వెల్లడించారుపరిమాణం పరంగా దేశ వాణిజ్యంలో 28 శాతం వాటా ఉన్న చమురుగ్యాస్ రంగం.. ఓడరేవుల ద్వారా ఎగుమతిదిగుమతుల జరిగే అతి పెద్ద సరుకుగా నిలిచిందిప్రస్తుతం ముడి చమురు అవసరాల్లో 88 శాతాన్నిగ్యాస్ అవసరాల్లో 51 శాతాన్ని దిగుమతుల ద్వారానే భారత్ తీర్చుకుంటోందని.. ఇది దేశ ఇంధన భద్రతకు నౌకా రంగం ఎంత ప్రధానమైనదో వివరిస్తుందన్నారు.

మొత్తం దిగుమతి బిల్లుల్లో సరకు రవాణా ఖర్చులు గణనీయమైన వాటా కలిగి ఉన్నాయని మంత్రి వివరించారుఅమెరికా నుంచి ముడి చమురు రవాణా చేసేందుకు బ్యారెల్‌కు డాలర్ల చొప్పునమధ్యప్రాచ్యం నుంచి 1.2 డాలర్ల చొప్పున చమురు మార్కెటింగ్ కంపెనీలు చెల్లిస్తున్నాయిగడచిన ఐదేళ్లలో.. ఐఓసీఎల్బీపీసీఎల్హెచ్‌పీసీఎల్ లాంటి భారత ప్రభుత్వ రంగ సంస్థలు నౌకా రవాణాకు సుమారుగా బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయిఈ మొత్తాన్ని భారత్‌లోనే కొత్త ట్యాంకర్లను నిర్మించుకోవడానికి ఉపయోగించవచ్చు.

దేశ వాణిజ్యంలో భారత్‌లో నమోదైన లేదా భారతీయ సంస్థలకు చెందిన నౌకల ద్వారా 20 శాతం మాత్రమే సరకు రవాణా జరుగుతోందని శ్రీ పూరి అన్నారుఇది నౌకా యాజమాన్యాన్నితయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారత్‌కు సవాలునుఅవకాశాన్ని రెండింటినీ అందిస్తోందని తెలియజేశారుభారతీయ నౌకలకు.. దీర్ఘకాలిక రవాణా అవకాశాలను అందించేందుకు ప్రభుత్వ రంగం సంస్థల నుంచి కార్గో డిమాండును సమీకరించడంనౌకా యాజమాన్యంలీజు (ఎస్‌వోఎల్విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంనౌకల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు సముద్ర వాణిజ్యాభివృద్ధి నిధిని ఏర్పాటు చేయడంఎల్ఎన్‌జీఈథేన్ప్రొడక్టు ట్యాంకర్లకు మద్దతు అందేలా.. నౌకా నిర్మాణ ఆర్థిక సాయం విధానం 2.0ను అమలు చేయడం తదితర చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

గడచిన పదకొండేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సముద్ర వాణిజ్య రంగం ప్రధాన మార్పులకు గురయిందని మంత్రి అన్నారుఓడరేవు సామర్థ్యం 2014లో ఏడాదికి 872 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి ప్రస్తుతం 1,681 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుందిఅదే సమయంలో సరకు రవాణా పరిమాణం 581 మిలియన్ టన్నుల నుంచి 855 మిలియన్ టన్నులకు చేరుకుందిఅలాగే నౌక ఓడరేవుకు వచ్చినప్పటి నుంచి తిరిగి బయలు దేరే సమయం 48 శాతంఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిలిపి ఉంచే సమయం 29 శాతం మేర తగ్గాయని ఆయన వెల్లడించారుపోర్టులను ఆధునికీకరించడానికితీర ప్రాంతాలను అనుసంధానించడానికి రూ.5.5 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను సాగర్ మాల కార్యక్రమం ద్వారా చేపడుతున్నారు.

కొచ్చిన్ షిప్‌యార్డ్మజ్‌గావ్ డాక్జీఆర్ఎస్ఈ కోల్‌కతాహెచ్ఎస్ఎల్ విశాఖపట్నం లాంటి నౌకా నిర్మాణ కేంద్రాలుగోవాగుజరాత్‌లోని ప్రైవేటు యార్డులు అంతర్జాతీయ స్థాయి నౌకలను నిర్మిస్తున్నాయని ఆయన తెలిపారుఎల్ఎన్‌జీఈథేన్ క్యారియర్స్ నిర్మాణానికి అవసరమైన అంతర్జాతీయ సాంకేతికతను దేశీయ నౌకా నిర్మాణ కేంద్రాల్లోకి తీసుకొచ్చేందుకు ఎల్ అండ్ టీదేవూ సంస్థలతో కొచ్చిన్ షిప్‌యార్డు భాగస్వామ్యాలుమిత్సుయ్ ఓఎస్‌కే లైన్స్‌తో సహకారాలు తోడ్పడుతున్నాయి.

మౌలిక వసతులునైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని కొనసాగించడానికి నౌకా నిర్మాణ రంగంలో దీర్ఘకాల ప్రణాళికస్థిరమైన ఆర్డర్లు అవసరమని మంత్రి పేర్కొన్నారువచ్చే ఆరేళ్ల పాటు.. అనేక అంతర్జాతీయ షిప్‌యార్డులు బుక్ అయి ఉండటం వల్ల భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకునౌకలను నిర్మించేందుకు ప్రోత్సహించాలి.

భవిష్యత్తులో సముద్ర వాణిజ్య రంగంలో సుమారుగా రూ.8 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని, 2047 నాటికి 1.5 కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారుభారత పోర్టులను ఐరోపామధ్య ఆసియాఆఫ్రికాలతో అనుసంధానించి.. భారత్-మధ్య ప్రాచ్యం-తూర్పు ఐరోపా ఆర్థిక కారిడార్అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ లాంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను రూపొందించడంలో దేశం కీలకపాత్ర పోషిస్తోందని వివరించారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో మహాసముద్రాలను అడ్డంకులుగా కాకుండా.. వృద్ధిసంక్షేమానికి మార్గాలుగా భారత్ పరిగణిస్తోందని శ్రీ పూరి అన్నారుదేశం పోర్టులను ఆధునికీకరిస్తోందిఅనేక నౌకలను నిర్మిస్తోందిహరిత రవాణాను ప్రోత్సహిస్తోందియువతకు ఉద్యోగాలు కల్పిస్తోందిఅభివృద్ధి చెందినస్వావలంబన సాధించిన భారత్‌ను సాధించడంలో సముద్ర రవాణా రంగాన్ని కీలకంగా మార్చేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారు.

 

***


(Release ID: 2184256) Visitor Counter : 9