సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఓడల’ను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ముంబయిలోని మఝగావ్ డాక్‌లో ఈ రోజు జాతికి అంకితమిచ్చిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

సహకార రంగంలో అవకాశాల్ని వినియోగించుకుంటూ ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణాన్ని సాకారం చేయడానికీ,
నీలి ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరచడానికీ కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం

పేద మత్స్యకారులకు సమృద్ధిని సమకూర్చే సాధనంగా మారనున్న మత్స్య రంగంలోని సహకార ఉద్యమం

ఈ రోజు అందజేసిన చేపల్ని పట్టే పడవలతో, భవిష్యత్తులో భారత మత్స్య సంపద శక్తిని సద్వినియోగపరుచుకొనే సామర్థ్యం ఇంతంతలు.. దీనితో సహకార ప్రాతిపదికన మన మత్స్యకారుల కుటుంబాలకు సమకూరనున్న ప్రయోజనాలెన్నో

మరిన్ని ట్రాలర్లను మత్స్యకారులకు త్వరలో సహకార సంఘాల ద్వారా అందించనున్న కేంద్రం, మత్స్య విభాగం, రాష్ట్ర ప్రభుత్వాలు

కష్టపడి పనిచేసే పేదలకే లాభాలు.. ఇదే సహకారం తాలూకు విజయవంతమైన నమూనా ధ్యేయం

పేదలకు ఆర్థిక సాధికారత సమకూరినప్పుడే, దేశం సిసలైన సమృద్ధి సాధించినట్లు

పాడి, పంచదార కర్మాగారాలు, మార్కెట్ కమిటీల మాదిరిగానే మత్స్యకారుల కోసం పనిచేసే ఒక వ్యవస్థను రూపొందించనున్న మోదీ ప్రభుత్వం.. దీంతో వారి ఆర్థిక అభ్యున్నతికి ఊతం

దేశవ్యాప్తంగా నౌకావాణిజ్య రంగంలో అవకాశాల్ని సద్వినియోగపరుచుకోవడంపై సహకారిత ప్రాతిపదికన సమకూరే లాభాలు మత్స్యకార సోదరీ సోదరుల చెంతకు చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిన సహకార మంత్రిత్వ శాఖ

చేపల శుద్ధి, శీతలీకరణ కేంద్రాలతో పాటు ఎగుమతి, సేకరణ నౌకలను సహకార సంఘాల ద్వారా అందుబాటులోకి తీసుకు రానున్న మోదీ ప్రభుత్వం

Posted On: 27 OCT 2025 7:00PM by PIB Hyderabad

సముద్రంలో బాగా లోపలి ప్రాంతాలకు చేరుకొని చేపలను పట్టే ఓడల (‘డీప్ సీ ఫిషింగ్ వెసల్స్)ను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ముంబయిలోని మఝగావ్ డాక్‌లో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిందే, శ్రీ అజీత్ పవార్‌లతో పాటు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ కూడా పాల్గొన్నారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ  అమిత్ షా ప్రసంగిస్తూ, ఇది ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశ సముద్ర మత్స్యపాలన రంగంలో ఆధునికీకరణ, తీర ప్రాంతాల్లో సహకారాధారిత అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా వేసిన ఒక ముందడుగు అన్నారు. సహకార రంగం సామర్థ్యాన్ని సద్వినియోగపరుచుకొంటూ  ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టికోణాన్ని సాకారం చేయాలనీ, నీలి ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచాలనీ మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
 


image.png


చేపలు పట్టే రెండు ఓడలను ఈ రోజు జాతికి అంకితం చేయడంతో, రాబోయే రోజుల్లో భారత మత్స్య రంగ అవకాశాలను సద్వినియోగపరుచుకొనే సామర్థ్యం పెరగడం ఒక్కటే కాకుండా సహకార రంగాన్నుంచి మత్స్య పరిశ్రమకు సమకూరే లాభాలు కష్టించి పనిచేసే మన పేద మత్స్యకారులకు కూడా చేరుతాయని శ్రీ  అమిత్ షా చెప్పారు.

ప్రస్తుతం చేపలు పట్టే ఓడల్లో పనిచేసే వ్యక్తులు జీతానికి పనిచేస్తున్నారనీ, అయితే ఇప్పుడు సహకార ప్రాతిపదికన ట్రాలర్‌తో చేపలు పట్టడం ద్వారా కలిగే లాభం పూర్తిగా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మత్స్యకారుని ఇంటికీ చేరుతుందని సహకార శాఖ కేంద్ర  మంత్రి వివరించారు. మొదట ఇలాంటి 14 ట్రాలర్లను అందజేస్తున్నప్పటికీ, రాబోయే కాలంలో  మరిన్ని ట్రాలర్లను చేపలు పట్టుకొనే సోదరీసోదరులకు సహకార పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం, సహకార మంత్రిత్వ శాఖ, మత్స్య విభాగం అందజేస్తాయని ఆయన తెలిపారు. ఈ చేపలు పట్టే ఓడలు 25 రోజుల వరకూ సముద్రంలో ఉండగలవనీ, 20 టన్నుల వరకూ చేపలను మోసుకురాగలవనీ చెప్పారు. దీనికి అదనంగా, కొన్ని పెద్ద నౌకలు కూడా సమన్వయ కార్యకలాపాల్లో పాల్గొని చేపలను సముద్రం లోపలి నుంచి ఒడ్డు వరకు చేరవేస్తాయన్నారు. ట్రాలర్ల లోపల ఉండటానికీ, అన్నపానాలకూ తగిన ఏర్పాట్లను కూడా చేశారని ఆయన వెల్లడించారు.  

 
 
image.png
 

పదకొండు వేల కిలోమీటర్ల పొడవైన విశాల సముద్రతీర ప్రాంతాల్లో చేపలు పట్టుకొనే వృత్తిని జీవనోపాధి మార్గంగా ఎంచుకున్న పేద సోదరీసోదరులను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఒక పెద్ద పథకాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. పాల ఉత్పత్తి గాని, వ్యవసాయ మార్కెట్లు, లేదా మత్స్య పాలన గాని.. వాటి లాభాలు చెమటోడ్చి పనిచేసే వ్యక్తులకు దక్కాలనేదే సహకారం తాలూకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. పల్లె ప్రాంతంలో నివసించే పేద ఆర్థికంగా సాధికారితకు నోచుకుంటేనే ఆ దేశం నిజమైన సమృద్ధిని సాధించినట్లు అని శ్రీ షా అన్నారు. దేశ సమృద్ధిని ఒక్క జీడీపీ కోణంలోనే గమనించే వారు, ఇంత పెద్ద దేశంలోని సామాజిక వ్యవస్థల్ని అర్థం చేసుకోలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. 130 కోట్ల కన్నా ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న దేశంలో జీడీపీ వృద్ధి మాత్రమే ఆ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చెందిందిగా రూపొందించజాలదు, మనం దీనిలో మానవీయ దృష్టికోణాన్ని కూడా తప్పక ఇముడ్చుకోవాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తినీ, ప్రతి ఒక్క కుటుంబాన్నీ సమృద్ధి దిశగా నడపాలనే లక్ష్యాన్ని పెట్టుకోనిదే ఏ దేశమూ సమృద్ధి చెందజాలదని ఆయన తేల్చి చెప్పారు.

మత్స్య పాలన రంగంలోనూ సహకారిత మన సోదరీసోదరులందరికీ జీవనాధారంగా మారే దిశగా ముందుకు సాగుతున్నామని శ్రీ అమిత్ షా తెలిపారు. భవిష్యత్తులో ప్రాసెసింగు, ఎగుమతులు, సేకరణ నిమిత్తం పెద్ద నౌకలను రంగంలోకి దింపాలన్న ప్రణాళికలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రాసెసింగును కూడా వాళ్లే పూర్తి చేస్తారు, శీతలీకరణ కేంద్రాలనూ నిర్వహిస్తారు, ఎగుమతుల భాధ్యతనూ మన బహుళ రాష్ట్ర ఎగుమతి ప్రధాన సహకార సంఘాలు తీసుకుంటాయని ఆయన వివరించారు.

మత్స్యపాలన కోసం అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొదలుపెట్టారనీ, అవి సానుకూల ఫలితాలను అందించాయనీ కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. 2014-15లో, భారత మొత్తం మత్స్య సంపద ఉత్పత్తి 102 లక్షల టన్నులుగా ఉండగా, ప్రస్తుతం వృద్ధి చెంది 195 లక్షల టన్నులకు చేరుకొందన్నారు. దేశీయ ఉత్పత్తి 67 లక్షల టన్నుల స్థాయి నుంచి 147 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. మారిటైం ఉత్పత్తి 35 లక్షల టన్నుల నుంచి పెరిగి 48 లక్షల టన్నులైందన్నారు. తీయనైన జలాల్లో చేపల పెంపకం 119 శాతం వృద్ధితో 67 లక్షల టన్నుల నుంచి 147 లక్షల టన్నులకు చేరుకొందన్నారు. ఇక మారిటైం ఉత్పత్తి 35  లక్షల టన్నుల నుంచి 48 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. మన దేశంలో దాదాపు 11,000 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉత్పత్తిని పెంచుకొనేందుకు భారీ అవకాశాల్ని అందిస్తోందని మంత్రి అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకొనేందుకూ, తద్వారా సమకూరే లాభాలను సహకార ప్రాతిపదికన మన మత్స్యకార సోదరీసోదరుల చెంతకు చేర్చేందుకూ సహకార శాఖ ఒక లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు.
 

 

image.png


ప్రతి కుటుంబమూ సంతానానికి మంచి విద్యను అందించే స్థితిలో ఉండి, వారికి  సమతౌల్య  ఆహారాన్ని ఇవ్వగలిగి, వృద్ధులకూ, పిల్లలకూ ఆరోగ్య సంరక్షణ చర్యల్ని తీసుకొంటూ, స్వయంసమృద్ధమైనప్పుడు మాత్రమే దేశం సంపన్న దేశం కాగలుగుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ విధమైన మానవీయ దృష్టికోణాన్ని కలిగిన జీడీపీని సాధించడానికి సహకార సంఘాలకు మించిన మరే ఇతర సాధనమూ లేదని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో పల్లెలను సమృద్ధి బాటలో నడపడంలో ఇక్కడి పంచదార కర్మాగారాలు అతి ప్రధాన పాత్రను పోషించాయని ఆయన తెలిపారు. పంచదార కర్మాగారాల పూర్తి లాభం రైతు బ్యాంకు ఖాతాలోకి నేరుగా వెళ్తోందన్నారు. ఇదే మాదిరిగా గుజరాత్‌లో ఇవాళ అనేక లక్షల మంది మహిళలు అమూల్ ద్వారా 80,000 కోట్ల వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ 80,000 కోట్ల పూర్తి లాభం చదువుకోని, పశుపాలనలో నిమగ్నమైన మహిళల ఇళ్లకు చేరుతోందన్నారు. ఇప్పుడు పట్టభద్రులు, బాగా చదువుకున్న మహిళలు కూడా  వృత్తినైపుణ్యాన్ని సంపాదించి మరీ పశు సంవర్ధక వాణిజ్య రంగంలో అడుగుపెడుతున్నారని మంత్రి అన్నారు. మన పూర్వికుల ఆలోచనా ఇదేననీ, భారత్ మూల తాత్వికతా ఇదేననీ ఆయన చెప్పారు.
 
***

(Release ID: 2183443) Visitor Counter : 2