ప్రధాన మంత్రి కార్యాలయం
గురు చరణ్ యాత్రతో అనుసంధానమై పవిత్ర ‘జోర్ సాహిబ్’ దర్శనం చేసుకోవాలని ప్రజలను కోరిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 OCT 2025 6:11PM by PIB Hyderabad
ఈ రోజు గురు చరణ్ యాత్ర సందర్భంగా శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీల అద్భుత బోధనలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యంగా యాత్రా మార్గంలో నివసించే పౌరులు ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని పవిత్రమైన 'జోర్ సాహిబ్' దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.
‘ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ చేసిన పోస్టులకు ప్రతిస్పందిస్తూ శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"గురు చరణ్ యాత్ర సందర్భంగా శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీల గొప్ప ఆదర్శాలతో మన అనుబంధాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యాత్ర సాగే ప్రాంతాల ప్రజలంతా యాత్రలో భాగస్వాములై పవిత్రమైన 'జోర్ సాహిబ్' దర్శనం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను."
(रिलीज़ आईडी: 2181827)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam