ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి శుభాకాంక్షలు చెప్పిన యూఎస్ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు
ప్రజాస్వామ్య ఉమ్మడి విలువలతో పాటు ప్రపంచ శాంతికి కట్టుబడి ఉందామంటూ పునరుద్ఘాటన
Posted On:
22 OCT 2025 8:25AM by PIB Hyderabad
దీపావళికి స్వయంగా ఫోన్ చేసి హృదయపూర్వక శుభాకాంక్షలను చెప్పినందుకు అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం చాలాకాలంగా బలోపేతం అవుతోందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఉగ్రవాదంతో పోరాటంలోనూ, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ భారత్ నిబద్ధత తిరుగులేనిదని కూడా పునరుద్ఘాటించారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘అధ్యక్షుడు శ్రీ ట్రంప్ గారూ... ఫోన్ చేసినందుకూ, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ దీపాల పండగ సందర్భంగా.. మన రెండు ప్రజాస్వామ్యదేశాలూ ప్రపంచంలో ఆశాజ్యోతిని వెలిగించేందుకూ, ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో ఇరువురూ ఏకతాటిపై నిలబడాలనీ నేను కోరుకుంటున్నాను.’’
***
(Release ID: 2181631)
Visitor Counter : 8
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam