ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి వేడుకలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 21 OCT 2025 9:30AM by PIB Hyderabad

ఐఎన్ఎస్ విక్రాంత్‌లో భారతీయ నౌకాసేనతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించినప్పటి చిత్రాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ఈ రోజు ఒక అద్భుతమైన రోజు... అద్భుతమైన క్షణం.. అంతేకాకుండా అద్భుత సన్నివేశమని అన్నారుఒక వైపు విశాల మహాసముద్రం ఉంటేమరో వైపు భరత మాత వీర సైనికుల అపార శక్తి కొలువుదీరిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఒక వైపు దిగంతంఆనంతాకాశం ఉంటేమరో వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మాండ శక్తి ఉందనీఇది అనంత శక్తికి ప్రతీక అనీ ఆయన చెప్పారుసముద్రంపై ప్రసరిస్తున్న సూర్యకాంతి  మెరుపులు దీపావళి వేళ వీర సైనికులు వెలిగించిన దీపాలా అన్నట్లుగా ఓ అపురూప దివ్య కాంతి మాలిక కనిపిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఈ సారి దీపావళిని భారతీయ నావికా దళ యోధుల నడుమ నిర్వహించుకోవడం తనకు లభించిన సౌభాగ్యమని ఆయన అన్నారు

‘ఎక్స్’లో వివిధ సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

“‘‘ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మన నావికా సేనతో కలిసి దీపావళి వేడుకలో పాలుపంచుకొంటున్నా.“

 

 

“‘‘కుటుంబ సభ్యులంతా కలిసి దీపావళి పండుగ చేసుకోవడమంటే ప్రజలకెంతో ఇష్టం. నాకూ అంతే... ఈ కారణంగానే నేను.. మన దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైన్యాన్నీ, భద్రతాదళ సిబ్బందినీ ఏటా కలుసుకుంటూ ఉంటా. గోవా, కార్వార్ ల సమీపంలో పశ్చిమ సాగర సరిహద్దులో, ప్రధాన యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సారథ్యంలో.. భారతీయ నౌకా దళానికి చెందిన ఇతర నౌకల్లోని మన సాహసిక నావికుల మధ్యకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా.’’.”

 

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో వైమానిక ప్రదర్శన, ఉత్సాహపూరిత సాంస్కృతిక కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాల ముఖ్య ఆకర్షణలివిగో, చూడండి.;”

 

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఎంఐజీ-29 ఫైటర్లతో పాటు ఫ్లయిట్‌డెక్ మీది దృశ్యాలివి.”

 

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాల్ని చూశాను.. అవి కచ్చితత్వాన్నీ, సత్తానూ కళ్లకు కట్టాయి. ఎంఐజీ-29 ఫైటర్లు పగటిపూటా, చీకట్లోనూ.. ఓ చిన్న రన్‌వే మీది నుంచి నింగికెగరడం, మళ్లీ నేల మీదకు రావడం చూస్తే ఆ ప్రావీణ్యం, ఆ క్రమశిక్షణా, ఆ సాంకేతికత చూడ చక్కగా ఉన్నాయి.”

 

 

“బడా ఖానా సాయుధ దళాల సంప్రదాయాల్లో ఓ అంతర్భాగం. నిన్న సాయంత్రం ఐఎన్ఎస్ విక్రాంత్‌లో, నావికా దళ సిబ్బందితో పాటు బడా ఖానాలో పాలుపంచుకున్నా.”

 

 

“‘‘ఐఎన్ఎస్ విక్రాంత్‌ భారతదేశానికే గౌరవం.

ఇది స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అతి పెద్ద యుద్ధ నౌక. దీనిని కోచిలో నౌకాదళంలో చేర్చిన కార్యక్రమం నాకు గుర్తుంది. ఇవాళ, దీపావళి శుభసందర్భంలో ఇక్కడకు వచ్చే అవకాశం నాకు దక్కింది.”

 

 

“ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో నిన్న సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాన్ని నేను నా మదిలో ఎప్పటికీ పదిలంగా అట్టిపెట్టుకుంటా. నౌకాదళ సిబ్బంది నిజంగానే ఎంతో సృజనశీలురూ, బహుముఖ ప్రజ్ఞావంతులు కూడాను. ‘కసమ్ సిందూర్ ‌కీ..’’ అంటూ వారు రాసిన ఒక గేయం నాకు ఎప్పటికీ జ్ఞాపకముంటుంది.”

 

 

“‘‘ఇదేమో ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో ఎయిర్ పవర్ డెమో అప్పటి చిత్రం!”

 

 

“‘‘ఇవి ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో యోగా కార్యక్రమం దృశ్యాలు.!

భారత్ ఎంతో సంతోషించే ఐఎన్ఎస్ విక్రాంత్‌‌లో నౌకాదళ యోధులు యోగాను అభ్యసించడం చూస్తే పులకిస్తాం. .

 యోగా మనను శారీరకంగాను, మానసికంగాను దృఢంగా ఉంచుతూ, మనను ఏకతాటిమీదకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా.”

 

 

“आप सभी की तरह मुझे भी अपने परिवारवालों के साथ दिवाली मनाना बहुत पसंद है। यही वजह है कि इस पावन अवसर पर मैं देश की रक्षा में जुटे अपने सैनिकों और सुरक्षा बलों के जवानों से हर साल मिलता हूं। इस बार यह सौभाग्य मुझे गोवा और कारवार के पास पश्चिमी समुद्री सीमा पर अपने फ्लैगशिप INS विक्रांत पर मिला। अपने जांबाज नौसैनिकों के साथ यह अवसर मुझे नई ऊर्जा और नए उत्साह से भर गया है।“

 

 

“INS विक्रांत भारतवर्ष का गौरव है!

यह स्वदेशी टेक्नोलॉजी से बना हुआ भारत का सबसे बड़ा युद्धपोत है। मुझे वह कार्यक्रम याद है, जब इसे कोच्चि में नौसेना के बेड़े में शामिल किया गया था। आज दीपावली के पावन अवसर पर यहां आकर गौरवान्वित हूं।“

 

 

“पिछली शाम INS विक्रांत पर हुआ सांस्कृतिक कार्यक्रम अविस्मरणीय रहेगा। हमारे नौसैनिक प्रतिभाशाली और पराक्रमी होने के साथ-साथ बहुत क्रिएटिव भी हैं। उनका गीत 'कसम सिंदूर की' मेरी स्मृतियों में सदा बसा रहेगा।“

 

 

“The warships which took part in today’s Steampast included INS Vikrant (the review platform), INS Vikramaditya (where I had been ten years ago for the Combined Commanders' Conference), INS Surat (which was commissioned earlier this year in Mumbai), INS Mormugao, INS Chennai (which was a part of the Bastille Day celebrations 2023 in France), INS Imphal (which took part in this year’s Mauritius National Day celebrations), INS Kolkata, INS Tushil, INS Tabar, INS Teg, INS Betwa, INS Deepak and INS Aditya.”

 

 

“The Flypast at INS Vikrant included the Chetak with flag and navy ensign, MH 60 R, Seaking, Kamov 31, Dornier, P8I and MiG 29K.”

 

 

***

MJPS/VJ


(Release ID: 2181403) Visitor Counter : 6