హోం మంత్రిత్వ శాఖ
కర్ణాటక, మహారాష్ట్రల ఎస్డీఆర్‌ఎఫ్‌కు కేంద్ర వాటాలో రెండో విడతగా రూ.1950.80 కోట్ల ముందస్తు విడుదలను ఆమోదించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తోన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్డీఆర్ఎఫ్ కింద 27 రాష్ట్రాలకు రూ. 13603.20 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కింద 15 రాష్ట్రాలకు రూ. 2189.28 కోట్లను అందించిన కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుత సంవత్సరం వర్షాకాలంలో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సహాయక, ఉపశమన చర్యల కోసం గతంలో కంటే ఎక్కువగా 199 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు
Posted On:
19 OCT 2025 4:34PM by PIB Hyderabad
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 2025-26 సంవత్సరానికిగాను ఎన్డీఆర్‌ఎఫ్ కేంద్ర వాటాలో రెండో విడతగా రూ. 1950.80 కోట్లను ముందస్తు విడుదలకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆమోదం తెలిపారు. ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభావితమైన వారికి తక్షణ సహాయాన్ని అందించే విషయంలో ఆయా ప్రభుత్వాలకు మద్దతునిచ్చేందుకు కర్ణాటకకు రూ. 384.40 కోట్లు, మహారాష్ట్రకు రూ.1566.40 కోట్లు మంజూరయ్యాయి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల వల్ల ప్రభావితమైన రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ పూర్తి నిబద్ధతతో ఉంది.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ కింద 27 రాష్ట్రాలకు రూ. 13603.20 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కింద 15 రాష్ట్రాలకు రూ. 2189.28 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్) నుంచి 21 రాష్ట్రాలకు రూ. 4571.30 కోట్లు, జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్) నుంచి 09 రాష్ట్రాలకు రూ.372.09 కోట్లు విడుదలయ్యాయి.
వరదలు, కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలతో ప్రభావితమైన రాష్ట్రాలన్నింటికీ అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, భారత సైన్యం, వైమానిక దళం మద్దతుతో సహా తరలింపు విషయంలో అన్ని రకాల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ సంవత్సరం ఋతుపవనాల సమయంలో సహాయక, ఉపశమన చర్యల కోసం 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మునుపటి కంటే ఎక్కువగా 199 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం మోహరించింది.
***
(Release ID: 2180888)
Visitor Counter : 4