ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం.. ఎన్ఎస్‌జీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 16 OCT 2025 9:09PM by PIB Hyderabad

ఎన్ఎస్‌జీ స్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఎస్‌జీ సిబ్బంది సాటి లేని పరాక్రమాన్నీ, అంకిత భావాన్నీ ప్రశంసించారు. ‘‘ఉగ్రవాద భూతం బారి నుంచి మన దేశ ప్రజలను కాపాడుతుండటంలో ఎన్ఎస్‌జీ కీలకపాత్రను పోషించింది. ఈ దళం మన దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు దేశ ముఖ్య సంస్థలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ-

‘‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ స్థాపక దినోత్సవం సందర్భంగా, నేను ఎన్ఎస్‌జీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అద్వితీయ పరాక్రమానికీ, అంకితభావానికీ ఈ దళం తనదైన పేరు తెచ్చుకుంది. మన దేశ ప్రజలను ఉగ్రవాద భూతం బారి నుంచి కాపాడడంలో కీలక పాత్రను పోషించింది.. మన  దేశ పౌరుల భద్రతకు పూచీపడటంతో పాటు ముఖ్య సంస్థలనుకంటికి రెప్పలా కాచుకుంటోంది’’ అని పేర్కొన్నారు.

@nsgblackcats

 

 

***

MJPS/VJ


(Release ID: 2180410) Visitor Counter : 6