హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నక్సల్ రహిత భారత్‌ను తయారుచేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం దిశగా భారీ సానుకూల పరిణామం.. నక్సలిజం ఎక్కువగా ఉన్న జిల్లాలు మూడే..


18 నుంచి కేవలం 11కి తగ్గిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో

గత రికార్డులను దాటుతూ ఈ సంవత్సరం 312 నక్సలైట్ల ఏరివేత

836 మంది నక్సలైట్ల అరెస్టు.. హింసామార్గాన్ని విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన 1639 మంది

బహుముఖ విధానంతో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక, విధానాన్ని కఠినంగా అమలు చేసిన మోదీ ప్రభుత్వం

నక్సల్ ముప్పును ఎదుర్కోవడంలో భారీ విజయం సాధించిన ప్రభుత్వం

2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ముప్పును పూర్తిగా తొలగించేందుకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం

Posted On: 15 OCT 2025 4:57PM by PIB Hyderabad

నక్సల్ రహిత భారత్‌ను తయారుచేయాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతను సాధించే దిశగా ఒక పెద్ద సానుకూల పరిణామం చోటుచేసుకుందినక్సలిజం ఎక్కువగా ఉన్న జిల్లాల సంఖ్య నుంచి 3కు తగ్గిందిఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్సుక్మానారాయణ్‌పూర్ మాత్రమే వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈఎక్కువగా ఉన్న జిల్లాలుగా ఉన్నాయి

నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా 18 నుంచి 11కు తగ్గిందిఇప్పుడు 11 జిల్లాలు మాత్రమే వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ ముప్పును పూర్తిగా తొలగించాలనే లక్ష్యానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోకేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ఈ ఏడాది తీసుకున్న చర్యల వల్ల ఫలితాలు గత రికార్డులను అధిగమించాయి. 312 మంది నక్సలైట్లను ఈ సంవత్సరం ఏరివేశారువీళ్లలో సీపీఐ (మావోయిస్టుప్రధాన కార్యదర్శి, 8 మంది ఇతర పొలిట్ బ్యూరో లేదా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. 836 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 1639 మంది లొంగిపోయారులొంగిపోయిన నక్సలైట్లలో ఒక పొలిట్ బ్యూరో సభ్యుడుఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నారు.

మోదీ ప్రభుత్వ హయాంలో నక్సల్ ముప్పును ఎదుర్కొనే విషయంలో భారీ విజయం నమోదైందిబహుముఖ విధానంతో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళికవిధానాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా ఇది సాధ్యమైందిజాతీయ కార్యాచరణ ప్రణాళిక విధానంలో వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విషయంలో ఖచ్చితమైన నిఘా ఆధారిత ప్రజానుకూల కార్యచరణ ఉందిభద్రత లేని ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించటంఅగ్ర నాయకులతో పాటు క్షేత్రస్థాయి నక్సలైట్లను లక్ష్యంగా చేసుకోవడంతిరోగామి భావజాలాన్ని ఎదుర్కోవడంమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయటంసంక్షేమ పథకాలను అందరికి అందించటంవామపక్ష తీవ్రవాదానికి ఆర్థిక సహాయాన్ని తగ్గించటంరాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచటంమావోయిస్టులకు సంబంధించిన కేసుల దర్యాప్తువిచారణను వేగవంతం చేయడం వంటి చర్యలను ఈ విధానంలో భాగంగా తీసుకున్నారు

2010లో అప్పటి ప్రధానమంత్రి భారతదేశానికి ‘అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య’గా అభివర్ణించిన నక్సలిజం ఇప్పుడు సుస్పష్టంగా తుడిచిపెట్టుకుపోయిందినేపాల్‌లోని పశుపతి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వరకు ఉన్న ప్రాంతాన్ని రెడ్ కారిడార్‌గా నక్సల్స్ తయారు చేశారు. 2013లో వివిధ రాష్ట్రాలకు చెందిన 126 జిల్లాల్లో మావోయిస్టు హింసాత్మక కేసులు నమోదయ్యాయిమార్చి 2025 నాటికి ఈ జిల్లాల సంఖ్య కేవలం 18కి తగ్గిందిఅంతేకాకుండా.. కేవలం 06 జిల్లాలు మాత్రమే 'అత్యంత ప్రభావిత జిల్లాలు'గా ఉన్నాయి

 

***


(Release ID: 2179663) Visitor Counter : 4