క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతిపై చర్చించారు.
భారత్ లో సెమీ కండర్టర్లు, ఏఐ మిషన్ల అభివృద్ధికి క్వాల్కమ్ కంపెనీ చూపిన చొరవను ప్రధానమంత్రి ప్రశంసించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త సాంకేతికతలను రూపొందించటానికి భారత్ లో ఉన్న ప్రత్రిభ, పెద్ద స్థాయిలో మార్కెట్ మరెక్కడా ఉండవని అన్నారు.
ఇండియా ఏఐ, ఇండియా సెమీ కండక్టర్ల మిషన్, 6జీ సాంకేతికతకు మార్పు కోసం క్వాల్కమ్, భారత్ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై జరిగిన చర్చల నేపథ్యంలో ప్రధానమంత్రికి క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ ధన్యవాదాలు తెలిపారు. ఏఐ స్మార్ట్ ఫోన్లు, పీసీలు, స్మార్ట్ గ్లాసెస్, ఆటోమోటివ్, పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ భారత పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికున్న అవకాశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో సమావేశం.. ఏఐ, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ పురోగతిపై చర్చించటం అద్భుతంగా ఉంది. భారత్ లో సెమీ కండక్టర్ల తయారీ, ఏఐ మిషన్లకు క్వాల్కమ్ ప్రాధాన్యతనివ్వటం చాలా సంతోషం. భవిష్యత్తును తీర్చిదిద్దే సాంకేతికతల నిర్మాణానికి ఎనలేని ప్రతిభ, మార్కెట్ ను భారత్ కలిగి ఉంది.
@క్రిస్టియానోఅమోన్
@క్వాల్కమ్”