సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలివిజన్ లోకి మళ్లీ మన ఇతిహాసం- మహాభారతం


ప్రసార భారతి, కలెక్టివ్ మీడియా నెట్ వర్క్ భాగస్వామ్యంతో నేటి తరం కోసం వినూత్నంగా మహాభారతం

Posted On: 10 OCT 2025 11:56AM by PIB Hyderabad

దేశంలో అత్యంత ఆదరణ పొందినప్రాచీన ఇతిహాసం మహాభారతం బుల్లి తెరపైకి మళ్లీ తిరిగి వస్తోందిఈ మహాకావ్యాన్ని ఆధునిక సాంకేతికతముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించి తిరిగి ప్రజలకు అందించేందుకు సిద్ధమైనట్లు కలెక్టివ్ మీడియా నెట్‌వర్క్ ప్రకటించిందిఈ మహాభారతం అక్టోబర్ 25, 2025న  ప్రసార భారతికి చెందిన ‘‘వేవ్స్’’ ఓటీటీ వేదికలో ముందుగా అందుబాటులోకి రానుందిఅనంతరం నవంబర్ 2, 2025 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు దూరదర్శన్ లో ప్రసారం కానుందిదీంతో ఇటు దేశంతోపాటు అటు ప్రపంచ వ్యాప్తంగా వేవ్స్ ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులకు ఏకకాలంలో అందుబాటులో ఉండనుంది.

ఈ వినూత్న ప్రాజెక్టు కోసం విశ్వసనీయతదేశవ్యాప్త పరిధి కలిగిన ప్రసా భారతీ, తదుపరితరం మీడియా సంస్థ కలిసి పనిచేన్నాయిఅత్యాధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి మహాభారతంలోని పాత్రనూయుద్ధాలనూభావోద్వేగాలనూనైతిక సందిగ్ధతలనూ ఈ రానికి తగినట్లుగా సినిమా స్థాయిలోఅత్యంత వాస్తవికతతో  పునర్నిర్మిస్తున్నారుఈ ప్రాజెక్టు మేక్ ఇన్ ఇండియాడిజిటల్ ఇండియా భావనలకు అనుగుణంగా..  దేశ సాంప్రదాయాలనువారసత్వాన్నిధునికతతో కలిపి ఎలా ప్రదర్శించవచ్చన్నదానికి ఈ వినూత్న ప్రాజెక్టు ఒక ఉదాహరణ.

ఈ భాగస్వామ్యంపై ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ "ప్రసార భారతి ఎల్లప్పుడూ జాతీయసాంస్కృతిక ప్రాధాన్యత గల కథలను ప్రతి ఇంటికీ చేర వేస్తుంది. లాక్‌డౌన్ సమయంలో మహాభారాన్ని పునః ప్రసారం చేసినప్పుడు.. ఈ ఇతిహాసం కుటుంబాలనుకొన్ని తరాలను ఎంత బలంగా కలిపి ఉంచిందీ మనకు తెలుసు. ఈసారి ఏఐ ఆధారిత రూపకల్పనతోమహాభారతాన్ని అందించడం ద్వారా దేశంలోనే గొప్ప ఇతిహాసాన్ని ప్రేక్షకులు కొత్తగా నుభూతి చెందేందుకు అవకాశం కలుగుతుందిసంప్రదాయాన్ని గౌరవిస్తూ.. ఆధునిక కథనశైలిలో సాంకేతికతను జోడించే ప్రయత్నంనేటి ఆధునిక ప్రసా పరంపరలో- వారసత్వంఅభివృద్ధిని కలిపే వ్యక్తీకరణేఈ మహాభారతం’’ అని వ్యాఖ్యానించారు.

ఈ భాగస్వామ్యంపై కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ వ్యవస్థాపకులుముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "లక్షలాది భారతీయుల్లాగే నేను కూడా ప్రతి ఆదివారం టెలివిజన్‌లో ప్రసారమైన మహాభారతాన్ని చూస్తూ పెరిగానుఅది మన సంస్కృతిపై నాకున్న ఆలోచననీఅనుబంధాన్నీ ఒకటి చేసిన అనుభవంఈ కొత్త మహాభారతం ప్రాజెక్ట్‌ ద్వారా మన తరానికి దక్కిన గొప్ప అనుభూతిని ఆధునిక సాంకేతికత ద్వారా నేటి తరానికి కూడా అందించాలన్నదే నా ఉద్దేశంభక్తిప్రగతి కలిసి సంప్రదాయంతోపాటు ధైర్యంగా భవిష్యత్తు వైపు సాగే ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది’’ అని అన్నారు.

ప్రసార భారతిఓటీటీ ‘‘వేవ్స్’’ దేశ సంస్కృతివార్తలువినోదం వంటి అనేక అంశాలను ఒకే డిజిటల్ వేదికపై అందిస్తుందివీడియో-ఆన్-డిమాండ్ప్రత్యక్ష కార్యక్రమాలుటీవీరేడియోఆడియో మ్యాగజైన్ సమాచారం వంటి విస్తృత సేవలను అందిస్తోందిఅనేక భాషాల్లో... కుటుంబాలకు అవసరమైననమ్మకమైన సమాచారం ద్వారా లక్షలాది మంది వినియోగదాలను ఆకర్షిస్తోందిఆవిష్కరణవారసత్వం అనే మూల స్తంభాలపై నిర్మితమైన ఈ ఆన్ లైన్ వేదిక..  దేశ వారసత్వాన్నిఆధునికత మధ్య వారధిగా నిలుస్తోంది.  సాంకేతికతసంప్రదాయం కలిసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా శక్తిమంతమైన కథనాలను ఎలా రూపొందించవచ్చో కలెక్టివ్ ఏఐ... మహాభారత్ తో కలిసి చేపట్టిన ఈ భాగస్వామ్యం వివరిస్తుందిఇది దేశంలోని అనేక భాషల ప్రజలతో పాటుప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

***


(Release ID: 2177478) Visitor Counter : 28