ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ అధినేతగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞ‌తలు తెలిపిన ప్రధానమంత్రి


గుజరాత్ ముఖ్యమంత్రిగా 2021లో చేసిన పదవీ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రధానమంత్రి

సదా పేదలకు సేవ చేయాలంటూ, ఎన్నడూ లంచం తీసుకోవద్దంటూ

తల్లి ఇచ్చిన ఉపదేశాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


కరవు బారిన పడ్డ రాష్ట్రంగా ఉన్న గుజరాత్ సుపరిపాలన కేంద్రంగా

మార్పు చెందిన తీరును గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి

వికసిత్ భారత్‌ కలను నెరవేర్చడానికి మరింతగా కష్టపడతానంటూ

తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2025 10:52AM by PIB Hyderabad

ప్రభుత్వ అధినేతగా సేవలను అందించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా... దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞ‌తలు తెలిపారు. 2001లో ఇదే  రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారుప్రజల జీవనాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ పురోగతికి తన వంతు పాటుపడాలన్నదే తన నిరంతర ప్రయత్నమని ఆయన అన్నారు.

ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతను తనకు అప్పగించారని ప్రధానమంత్రి తెలిపారుఆ సంవత్సరంలో భయంకర భూకంపం సంభవించడంతో రాష్ట్రం విలవిల్లాడుతోందిఅంతకు ముందు కాలంలో రాష్ట్రం ఒక పెను తుపాను బారిన పడిందిఆ తర్వాత వరుసగా దుర్భిక్షంరాజకీయ అస్థిరతలు ఎదురయ్యాయిఈ  సవాళ్లు ప్రజలకు సేవ చేయాలన్నకొత్త ఉత్సాహంతోనూఆశతోనూ గుజరాత్ ను పునర్నిర్మించాలన్న తన సంకల్పాన్ని మరింత బలపరిచాయని ఆయన అన్నారు.


గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ సమయంలో తల్లి చెప్పిన మాటలు తన మదిలో మెదిలాయని శ్రీ మోదీ అన్నారుపేదల కోసమే ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండాలి... ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం తీసుకోకూడదు.. అని తన మాతృమూర్తి తనతో చెప్పారని ఆయన అన్నారుతాను ఏది చేసినా సదుద్దేశంతోనే చేస్తాననీసమాజంలో చిట్టచివరి పంక్తిలో నిలబడ్డ వ్యక్తికి కూడా సేవ చేయాలనే భావనే తనకు స్ఫూర్తిని ఇస్తోందనీ చెబుతూ… తాను ఈ మేరకు ప్రజలకు భరోసా ఇచ్చానన్నారు.

గుజరాత్‌లో తాను అధికారంలో ఉన్న కాలాన్ని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ... గుజరాత్ కు పునర్వైభవం రాదని అప్పట్లో ప్రజలు భావించినట్లు తెలిపారుకరెంటు లేదనీనీళ్లు అందడం లేదనీ రైతులు బాధపడేవాళ్లువ్యవసాయం సంకటంలో పడిందనీపారిశ్రామిక అభివృద్ధి నిలిచిపోయిందనీ నాతో మొరపెట్టుకునేవాళ్లుఅయితేసమష్టి కృషితో గుజరాత్ సుపరిపాలనకు కేంద్రంగా మారిందని ఆయన అన్నారుఒకప్పుడు కరవు గుప్పిట్లో ఉన్న రాష్ట్రం కాస్తా వ్యవసాయ పరంగా అగ్రగామిగా మారిందనీవ్యాపారం విస్తరించి తయారీ రంగానికీపారిశ్రామికతకూ మార్పు జరిగిందన్నారుసామాజికభౌతిక మౌలిక సదుపాయాల ఊతం లభించిందన్నారు.

2013
వ సంవత్సరంలోపాలనాపరమైన సంక్షోభంతో దేశం సతమతం అవుతున్న కాలంలో... 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడే బాధ్యతను తనకు అప్పగించారని ప్రధానమంత్రి అన్నారుదేశ ప్రజలు తన సంకీర్ణానికీతన  పార్టీకి పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చారనీతద్వారా ప్రజలు సరికొత్త విశ్వాసానికీపాలనకూ అవకాశమిస్తూ...కొత్త యుగానికి నాందీ ప్రస్తావన చేశారని ఆయన వ్యాఖ్యానించారు.


గత 11 ఏళ్లలో భారత్ అనేక గొప్ప మార్పులను చూసిందని ప్రధానమంత్రి తెలిపారు. 25 కోట్ల కన్నా ఎక్కువ మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆకర్షణీయ కేంద్రంగా మారిందని చెప్పారుఅన్నదాతలూమహిళలూయువతసరికొత్త ప్రయత్నాలుసంస్కరణలతో సాధికారులయ్యారని అన్నారు.

భారత్‌ను అన్ని రంగాల్లో స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడమే ప్రజల బలబమైన కోరికగా ఉందని, ‘ఇది స్వదేశీ అని గర్వంగా ప్రకటిద్దాం’ అన్న నినాదంలో ఈ భావనను చూడొచ్చన్నారు.

దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకంచూపిస్తున్న ఆప్యాయతకు కృతజ్ఞతను తెలుపుతూదేశానికి సేవ చేయటం అత్యున్నత గౌరవమని ప్రధానమంత్రి అన్నారురాజ్యాంగ విలువల మార్గదర్శకత్వంలో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

2001లో ఈ రోజున నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానుఒక ప్రభుత్వాధినేతగా నేను 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నానుభారత ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఇన్నేళ్లలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకుదేశ పురోగతికి నిరంతరం కృషి చేశాను.”

"రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించిందిఆ ఏడాది భారీ భూకంపం సంభవించిందిఅంతకుముందు సంవత్సరాల్లో పెను తుపానుకరువురాజకీయ అస్థిరత ఏర్పడ్డాయిప్రజలకు సేవ చేయాలనే ఆశనుగుజరాత్ ను పునర్నిర్మించాలనే నా సంకల్పాన్ని ఆనాటి సవాళ్లు మరింత బలపరిచాయి.”

"ముఖ్యమంత్రిగా నేను ప్రమాణస్వీకారం చేసినప్పుడు మా తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నానునీ పని గురించి నాకు అంతగా అవగాహన లేదుకానీ రెండు విషయాలు గుర్తుంచుకోమొదటిదిమీరు ఎప్పుడూ పేద ప్రజల కోసం పనిచేయండిరెండోదిఎప్పుడూ అవినీతికి పాల్పడకండినేను చేసే ప్రతీ పని అత్యుత్తమ సంకల్పంతోప్రతి ఒక్కరికీ సేవ చేయాలనే లక్ష్యంతో ప్రేరణ పొందుతానని ప్రజలకు చెప్పాను.”

ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎన్నో అనుభవాలతో కూడినదిచెప్పుకోదగిన పురోగతిని సాధించాంనేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడుగుజరాత్ ఎప్పటికీ వృద్ధిలోకి రాదనుకున్నారుసాధారణ పౌరులురైతులు.. విద్యుత్నీటికొరతపై ఫిర్యాదు చేసేవారువ్యవసాయ రంగంలో పురోగతి లేదుపారిశ్రామిక వృద్ధి స్తంబించిందిమేమంతా సమిష్టిగా కృషి చేసి గుజరాత్ ను సుపరిపాలనకు కేంద్రంగా మార్చాం.”

కరువు ప్రాంతమైన గుజరాత్ వ్యవసాయంలో అగ్రస్థానంలో నిలిచిందివాణిజ్యం విస్తరించిపారిశ్రామికతయారీ సామర్థ్యాలు పెరిగాయితరచూ విధించే కర్ఫ్యూలు కనుమరుగయ్యాయిసామాజికభౌతిక మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం లభించిందిఇవన్నీ సాధించేందుకు ప్రజలతో కలిసి పనిచేయటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.”

2014 లోక్ సభ ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నన్ను 2013లో ప్రకటించారుఆ రోజుల్లో దేశం పాలనాపరమైన సంక్షోభంలో ఉందిఅప్పటి యూపీఏ ప్రభుత్వం అవినీతికుటుంబపాలనవిధాన పక్షపాతానికి ఉదాహరణగా మారిందిప్రపంచవ్యాప్తంగా భారత్ బలహీన దేశంగా ఉందిఆ సమయంలో దేశ ప్రజలు వివేకంతో ఆలోచించి మా కూటమికి అత్యుత్తమ మెజారిటీని అందించటమే కాకమూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మా పార్టీకి సంపూర్ణ మెజారిటీని అందించారు”.

గత 11 ఏళ్లుగా దేశ ప్రజలతో కలిసి అనేక మార్పులు తీసుకువచ్చాంమనం చేపట్టిన విప్లవాత్మక ప్రయత్నాలు దేశ ప్రజలను.. ముఖ్యంగా మహిళా శక్తినియువ శక్తినిరైతులను సాధికారత దిశగా నడిపించాయి. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారుప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ వెలుగొందుతోందిఆరోగ్య సంరక్షణసామాజిక భద్రతా పథకాలకు ప్రపంచంలోనే అతి పెద్ద నిలయంగా భారత్ అవతరించిందిరైతులు నూతన ఆవిష్కరణలు చేస్తూదేశం స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నారుఆత్మనిర్భర్ భారత్ గా నిలిపేందుకు అన్ని రంగాల్లో విస్తృతమైన సంస్కరణలు చేపట్టాంఈ సంస్కరణలు 'ఇది స్వదేశీ అని గర్వంగా ప్రకటిద్దాంఅనే పిలుపుని ప్రతిబింబిస్తాయి.”

మరోసారి దేశ ప్రజలకువారు నాపై పెట్టుకున్న నమ్మకంచూపిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన దేశానికి సేవ చేయడం నాకు అత్యున్నత గౌరవంఇది నాకు కృతజ్ఞతసంకల్పంతో కూడిన కర్తవ్యంరాజ్యాంగ విలువల ఆధారంగా రాబోయే కాలంలో వికసిత్ భారత్ కలను సాకారం చేసేందుకు నేను మరింతగా కృషి చేస్తాను.”

 

***


(రిలీజ్ ఐడి: 2176085) సందర్శకుల సూచీ సంఖ్య : : 34