ఉప రాష్ట్రపతి సచివాలయం
రాజ్యసభ సచివాలయాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్
అధికారులతో సమావేశమై రాజ్యసభ సచివాలయ కార్యకలాపాలను సమీక్షించిన శ్రీ సీపీ రాధాకృష్ణన్
Posted On:
06 OCT 2025 3:02PM by PIB Hyderabad
రాజ్యసభ సచివాలయాన్ని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు సందర్శించారు.
పర్యటనలో భాగంగా.. అధికారులతో సమావేశమై.. సభకు, సభ్యులకు శాసనపరమైన, పరిపాలనాపరమైన, విధానపరమైన తోడ్పాటును అందించడంలో సచివాలయం పోషిస్తున్న పాత్రతో సహా దాని పనితీరును సమీక్షించారు.
సచివాలయానికి సంబంధించిన వివిధ విభాగాలు, కార్యకలాపాలను వివరాణాత్మక ప్రజెంటేషన్ ద్వారా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌కు వివరించారు.
(Release ID: 2175342)
Visitor Counter : 9