రాష్ట్రపతి సచివాలయం
మై భారత్ - జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
Posted On:
06 OCT 2025 2:16PM by PIB Hyderabad
2022-23 సంవత్సరానికిగానూ మై భారత్ - జాతీయ సేవా పథకం అవార్డులను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (2025, అక్టోబర్ 6) రాష్ట్రపతి భవన్ లో ప్రదానం చేశారు.
మై భారత్ - జాతీయ సేవా పథకం.. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. స్వచ్ఛంద సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వం, నైతిక విలువలను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. దీనిని మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969లో ప్రారంభించారు. ఈ అవార్డులు యువతలో సేవా భావనను ప్రోత్సహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మై భారత్-ఎన్ఎస్ఎస్ అవార్డులను 1993-94 నుంచీ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అందిస్తోంది. ఇది సమాజ సేవ, సామూహిక అభివృద్ధి, జాతి నిర్మాణంలో యువత అందించిన అత్యుత్తమ సేవలను గౌరవిస్తూ ఇచ్చే అవార్డుల కార్యక్రమం.
***
(Release ID: 2175330)
Visitor Counter : 16