ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్యామ్ జీ కృష్ణ వర్మ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన ఆశయాల నుంచి యువత ప్రేరణ పొందాలన్న పీఎం

Posted On: 04 OCT 2025 11:11AM by PIB Hyderabad

స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ సుమారు రెండు దశాబ్దాల క్రితం చేసిన కృషి వల్ల దీర్ఘకాలిక ఆశయం నెరవేరిందనిఇది తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

శ్యామ్ జీ కృష్ణ వర్మ 1930లో మరణించగాభారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాతే ఆయన అస్థికలు దేశానికి చేరాలన్న చిరకాల కోరికదశాబ్దాల తర్వాత 2003లో నెరవేరిందిఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ చొరవ తీసుకునిశ్యామ్ జీ అస్థికలను స్విట్జర్లాండ్ లోని జెనీవా నుంచి భారత్ కు రప్పించారు.

ఈ చొరవ ద్వారా ధైర్యవంతుడైన భరతమాత పుత్రుడి జ్ఞాపకాలను గౌరవించామనిస్వాతంత్య్ర ఉద్యమ వారసత్వాన్ని పరిరక్షించాలనే దేశ నిబద్ధతను స్పష్టం చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

శ్యామ్ జీ కృష్ణ వర్మ జీవితంన్యాయం కోసం నిర్భయంగా ఆయన చేసిన పోరాటంభారతదేశ స్వాతంత్య్రం పట్ల ఆయన చూపిన అంకితభావం గురించి ఎక్కువ మంది యువ భారతీయులు తెలుసుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

ఎక్స్ లో శ్రీ నరేంద్ర మోదీ ఆర్కైవ్ హ్యాండిల్ పోస్టుకు ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

సుమారు రెండు దశాబ్దాల కిందట చేపట్టిన చారిత్రక కృషి వల్ల శ్యామ్ జీ కృష్ణ వర్మ కోరిక నెరవేరిందిభరతమాత సాహసపుత్రుడికి గౌరవం లభించింది.

ఆయన గొప్పతనంధైర్యం గురించి దేశ యువత తెలుసుకోవాలని ఆశిస్తున్నాను!”


(Release ID: 2175028) Visitor Counter : 3