ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల నుంచి అపూర్వ స్పందన


అందిన రూ. 1,15,351 కోట్ల విలువైన పెట్టుబడి దరఖాస్తులు


రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమను

అభివృద్ధి చేసుకోవాలని కోరిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు

భారత స్వయం-సమృద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ దృక్పథం పట్ల

దేశీయ పరిశ్రమ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది

ప్రపంచవ్యాప్తంగా దేశం పట్ల పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం ఈ అనూహ్య స్పందన

Posted On: 02 OCT 2025 4:57PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ పథకానికి దేశీయఅంతర్జాతీయ పరిశ్రమల నుంచి అద్భుతమైన స్పందన లభించిందిఇది ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ స్థాయినీ.. ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వయం-సమృద్ధి సాధన పట్ల బలమైన ఆసక్తిని కనబరుస్తున్న ఎమ్ఎస్ఎమ్ఈలు సహా దేశీయ పరిశ్రమ వ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుంది.

ఈ పథకం లక్ష్యమైన 91,600కు మించి అత్యధికంగా 1,42,000 ప్రత్యక్ష ఉద్యోగాలుఅనేక రకాల పరోక్ష ఉద్యోగాలనూ సృష్టిస్తుందని అంచనా వేశారుఇది పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సామర్థ్యాన్నీ ప్రదర్శిస్తుంది.

ఈ ఉత్సాహకరమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్.. రాష్ట్రాలు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుంటూ వారి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన ప్రాథమిక ప్రణాళికను అభివృద్ధి చేయాలని కోరారున్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ యువతకు గణనీయమైన ప్రత్యక్ష-పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు.

రూ. 22,919 కోట్ల ఆర్థిక వ్యయంతో 2025 మే 1న మంత్రివర్గం ఆమోదించిన ఈ పథకానికి రూ. 1,15,351 కోట్ల పెట్టుబడి హామీతో 249 దరఖాస్తులు వచ్చాయిఈ పథకం లక్ష్యంగా ఉన్న రూ. 59,350 కోట్ల కంటే దాదాపు రెట్టింపు స్పందన ఈ పథకానికి లభించిందిరాబోయే ఆరు సంవత్సరాల్లో ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్ భాగాల ఉత్పత్తి విలువ రూ. 10,34,700 కోట్లు ఉంటుందని అంచనాఈ పథకం లక్ష్యంగా నిర్దేశించిన రూ. 4,56,000 కోట్ల ఉత్పత్తి విలువ కంటే ఇది 2.2 రెట్లు ఎక్కువ.

ఈ భారీ స్పందన దేశ ప్రజలకు ప్రత్యక్షంగాపరోక్షంగా మరిన్ని ఉద్యోగాలను కల్పించనుందిదరఖాస్తులకు మొదట 2025 మే నుంచి నెలల వరకు అవకాశం కల్పించగా.. తరువాత ఈ గడువును 2025 సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.

బలోపేతమైన భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం

ఈసీఎమ్ఎస్ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా 2030-31 నాటికి 500 బిలియన్ డాలర్ల దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను సాధించాలనే గౌరవనీయ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా దేశం ముందుకు సాగుతోందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారుమొబైల్ ఫోన్లుఐటీ హార్డ్‌వేర్ కోసం ఈఎమ్‌సీఎస్‌పీఈసీఎస్ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐపథకం వంటి పలు పథకాల ద్వారా ఉత్పన్నమయ్యే ఆసక్తిని మెరుగుపరుస్తూ ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యాల సహజ పురోగతిని ఈసీఎమ్ఎస్ సూచిస్తుంది.

ఈ వరుస పథకాలు భారత ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను బలోపేతం చేశాయనీభారతదేశాన్ని సమగ్ర ప్రపంచ తయారీ కేంద్రంగా నిలబెట్టే వాణిజ్య కార్యకలాపాల ఏకీకరణను పూర్తి చేయడానికి ఈసీఎమ్ఎస్ ఇప్పుడు సంసిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

దేశీయ వాణిజ్య కార్యకలాపాల విస్తరణ

దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ వాణిజ్య కార్యకలాపాలను మరింతగా విస్తరించడంమొత్తం మీద దేశీయ ఆర్థిక విలువ గణనీయంగా పెరిగేలా చూసుకోవడమన్నది ప్రాథమిక ఆలోచనగా ఉందని ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్కృష్ణన్ పేర్కొన్నారుఆ తర్వాత ప్రపంచ వాణిజ్య కార్యకలాపాల ఏకీకరణపై దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.

భారత ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థపై దేశీయప్రపంచ పరిశ్రమ భాగస్వాములందరూ చూపిన అపారమైన విశ్వాసాన్నీ ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రశంసించిందిభారత తయారీ నైపుణ్యంవిధాన స్థిరత్వంపోటీ ప్రయోజనాల పట్ల వ్యాపార వర్గాల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ అపూర్వమైన పెట్టుబడులు ప్రతిబింబిస్తున్నాయిదేశంలో బలమైనస్వయం-సమృద్ధమైనప్రపంచంతో పోటీపడే సమర్థమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన పునాదిని ఏర్పాటు చేయడంలో మన పరిశ్రమ భాగస్వాముల సమష్టి నిబద్ధతను ఈ విజయం ప్రతిబింబిస్తుందిఅర్హత కలిగిన దరఖాస్తులను మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదిస్తోంది.

 

****


(Release ID: 2174354) Visitor Counter : 2