ప్రధాన మంత్రి కార్యాలయం
జీఎస్టీ కొత్త రేట్లు రైతులకూ, వ్యవసాయానికీ ఎంతటి మేలు చేయగలవో వివరించిన వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
25 SEP 2025 6:09PM by PIB Hyderabad
జీఎస్టీ కొత్త రేట్లు మన రైతులకూ, వ్యవసాయ కార్యకలాపాలకూ ఎంతో మేలు చేస్తాయంటూ కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘జీఎస్టీ కొత్త రేట్లు మన రైతు సోదరీసోదరులకు ఎంతో లాభసాటిగా ఉన్నాయి. ఈ రేట్లతో.. పొలం పనులకు ఉపయోగపడే, వ్యవసాయానికి పనికివచ్చే వస్తువులను కొనుగోలు చేసినప్పుడు రైతులకు డబ్బు పొదుపు కావడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త వేగాన్ని అందుకుంటుంది. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ చౌహాన్ గారు రాసిన ఈ వ్యాసాన్ని చదవండి..’’
***
(Release ID: 2171978)
Visitor Counter : 5