సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


· జనరంజకంగా ఉండడంతోపాటు.. విస్తృత ప్రజా ప్రయోజనాలకూ సినిమా దోహదపడాలన్న రాష్ట్రపతి

· సినిమాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడంపై అభినందన.. ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్‌లో సమాన అవకాశాలుండాలన్న శ్రీమతి ద్రౌపది ముర్ము

· నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశిష్ట సేవలందించిన

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

· దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ‘ఉన్నతమైనదిగా, పవిత్రమైనదిగా’ అభివర్ణించిన శ్రీ మోహన్‌లాల్

· సినిమా నా గుండె చప్పుడు: శ్రీ మోహన్‌లాల్... మలయాళ సినీ దిగ్గజాలకు ఈ పురస్కారం అంకితం

· దేశీయ సినీ పరికరాలకు ప్రోత్సాహం, లైవ్ కన్సర్ట్ ఆర్థిక వ్యవస్థల బలోపేతం, రాష్ట్ర చలనచిత్ర నియంత్రణ ముసాయిదా నియమాల రూపకల్పనతో ప్రభుత్వం వికసిత భారత్‌- 2047ను ప్రభుత్వం సాకారం చేయాలి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On: 23 SEP 2025 8:08PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదాన వేడుక కరతాళధ్వనుల మధ్య ఉత్సాహంగాఅట్టహాసంగా సాగిందిభారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందించారుదేశ ప్రజల హృదయాలు ఉప్పొంగేలా చేసిన కథనాల్లో లీనమై.. ఒక్కచోట చేరిన కళాకారులుప్రముఖులుఅభిమానులంతా భావోద్వేగభరితులయ్యారు.

దిగ్గజ నటుడు శ్రీ మోహన్‌లాల్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందిస్తూ.. ఆయన తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండావిస్తృత కృషితో దేశ సాంస్కృతిక విలువలను కూడా నిలబెట్టారని రాష్ట్రపతి అన్నారునాటకం నుంచి సినిమా వరకు ఆయన అద్భుత పయనాన్నీ.. మహాభారతంపై సంస్కృత ఏకపాత్రాభినయం కర్ణభారం నుంచి వానప్రస్థంలో పురస్కారాన్ని పొందే ప్రదర్శన వరకు.. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ఆయన అద్భుతంగా చిత్రీకరించిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించిన రాష్ట్రపతి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎందరో గౌరవాభిమానాలను ఆయన సొంతం చేసుకున్నారనివివిధ తరాల ప్రేక్షకుల హృదయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారని ఆమె అన్నారు.

భారత్‌లో సినిమా ప్రజాస్వామ్య విలువలనుదేశంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. అనేక భారతీయ భాషల్లో సాహిత్యం వికసించినట్టుగానే.. సినిమా కూడా దేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రభావవంతంగా వ్యక్తీకరించే సాధనంగా మారిందన్నారు. సినిమాలు వినోదాన్ని అందించడమే కాకుండా సమాజ జాగృతికిసునిశితత్వాన్ని పెంపొందించడానికియువతలో అవగాహనను నింపడానికి మాధ్యమంగానూ ఉపయోగపడతాయని ఆమె వ్యాఖ్యానించారు.

సినిమాల్లో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రస్తావిస్తూ.. సమానావకాశాలు కల్పిస్తే వారు అన్నింటా రాణిస్తూ అసాధారణ విజయాన్ని సాధించగలరని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. నటనతోపాటు సినిమాకు సంబంధించి ఇతర రంగాల్లోనూ మహిళలకు అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలన్నారు.

బాలనటులతోపాటు యువవర్ధమాన కళాకారుల కృషిని శ్రీమతి ముర్ము అభినందించారుసినీ పరిశ్రమలో సృజననూఆవిష్కరణలనూ వారు ముందుకు తీసుకెళ్తున్నారుసత్కారం పొందిన ఆరుగురు బాల కళాకారులకు ఆమె అభినందనలు తెలిపారుసినిమాల్లో పర్యావరణ అంశాలు ప్రతిబింబించేలా అవగాహన పెరగడాన్ని స్వాగతించారు.

శ్రీ మోహన్ లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం.. సినీ సమాజానికి అంకితం

మోహన్ లాల్‌కు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించిన వేళ... అది విస్తృతమైన భారతీయ సినీ కథనంలో కీలక సన్నివేశాన్ని తలపించిందికొంటె కాలేజీ కుర్రాడిగాకష్ట నష్టాలు ఎదుర్కొంటున్న సగటు సామాన్యుడిగాగౌరవాదరాలను పొందే సైనికుడిగాపొరపాట్లు చేసే హీరోగామరపురాని స్నేహితుడిగా... అనేక జీవితకథలను తెరపై ఆవిష్కరించిన నటుడు ఆయన. 360 చలనచిత్రాలతో.. భారతీయమలయా సినిమాకు సొబగులద్ది ప్రపంచానికి పరిచయం చేశారుప్రేక్షకులను నవ్వించారుఏడిపించారు.. అన్ని రకాల జీవితానుభవాలనూ పండించారు.

ఇప్పటికే పద్మభూషణ్పద్మశ్రీలతోపాటు అయిదు జాతీయ పురస్కారాలకు ఆయన వన్నెతెచ్చిన ఆయనకుఇప్పుడీ అవార్డు ఏదో ప్రశంస కోసం కాదు.. దేశం ఆయనకిస్తున్న గౌరవమిదిసుదీర్ఘమైన కరతాళ ధ్వనులతో విజ్ఞాన్ భవన్‌ మార్మోగుతుండగా.. అదే వినయాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులకుసహచరులకు మోహన్ లాల్ అభివాదం చేశారుఆ క్షణంలో ఆ హర్షధ్వానాలు కేవలం ఓ నటుడికి మాత్రమే కాదు.. కథలుజ్ఞాపకాలుభారతీయ సినిమా మిగిల్చిన ఉమ్మడి భావోద్వేగానికి లభించిన ప్రశంస అది.

ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ.. తన సినీ ప్రస్థానాన్ని తీర్చిదిద్దిన వారందరికీ శ్రీ మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలిపారుతాను పనిచేసిన ప్రతి సినిమా తననెంతగానో ప్రభావితం చేసిందనిఓ మాధ్యమంగా సినిమా శక్తిని అవన్నీ తనకు తెలియజెప్పాయని ఆయన అన్నారుఈ పురస్కారాన్ని ‘ఉన్నతమైనదిపవిత్రమైనది’గా ఆయన అభివర్ణించారుమలయా సినీ పరిశ్రమ దిగ్గజాలకు ఈ అవార్డును అంకితం చేశారుఈ పురస్కారం మొత్తం సినీ సమాజానికి దక్కుతుందన్నారుసినిమా తన గుండెచప్పుడన్నారుమరింత నిబద్ధతతో కళాసేవను కొనసాగించాలన్న తన సంకల్పాన్ని ఈ పురస్కారం మరింత బలపరుస్తుందన్నారు.

శ్రీ మోహన్ లాల్ దిగ్గజ నటుడని కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కొనియాడారుప్రపంచ సినీకంటెంట్ సృజన రంగాల్లో భారత్‌ను ముందంజలో నిలిపే ప్రామాణిక కార్యక్రమం ‘వేవ్స్-2025ని ప్రభుత్వం వైభవంగా నిర్వహించి మాట నిలబెట్టుకుందని గుర్తు చేశారునేడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్న ఆయన.. భారతీయ సృజనకారులకు విస్తృత స్థాయి మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేలా వేవ్స్ బజార్  వంటి కార్యక్రమాలు అవకాశాన్నిస్తాయన్నారు.

ముంబయిలోని ఎన్ఎఫ్‌డీసీ ప్రాంగణంలో దేశంలో మొదటి అంతర్జాతీయ చలనచిత్రసాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ప్రారంభమైందని మంత్రి తెలిపారుమెటాఎన్విడియామైక్రోసాఫ్ట్గూగుల్ సహా ప్రముఖ అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో ఇప్పటికే 17 కోర్సులను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారుఅంతర్జాతీయ కంటెంట్ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న ప్రధానమంత్రి సంకల్పం మేరకు.. దేశీయంగా చలనచిత్ర పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు లైవ్ కన్సర్ట్ ఆర్థిక వ్యవస్థల బలోపేతం దిశగా విధానాల రూపకల్పన లక్ష్యాన్ని మంత్రి వివరించారు. రాష్ట్ర సినిమా నియంత్రణ నియమాల ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారుసృజనాధార ఆర్థిక వ్యవస్థ ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

సినిమా అంటే కథలుకలలుఅనుభవాలు పంచుకోవటమని సమాచారప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అన్నారుఈ సంవత్సరాన్ని పురాణాలుఎన్నో తొలి ప్రయత్నాల సంవత్సరంగా అభివర్ణిస్తూ.. జ్యూరీ సభ్యులైన శ్రీ అశుతోష్ గోవారికర్శ్రీ పి.శేషాద్రిశ్రీ గోపాల్ కృష్ణపైలకు కృతజ్ఞతలు తెలిపారుసినిమాసంగీతంగేమింగ్సాంకేతికత... అన్నింటినీ వేవ్స్ సదస్సులో విజయవంతంగా ఒకచోట చేర్చిన విషయాన్ని గుర్తుచేశారుఉత్తేజకరమైన భారత సృజనాత్మకతను ప్రతిబింబించేలా ‘ఒక దేశంవేల కథలుఉమ్మడి ఆకాంక్ష’ స్ఫూర్తిని చాటారు.

ప్రతిభకు పట్టంనటనకథలుసినిమా రంగంలో ఆవిష్కరణలను జాతీయ చలనచిత్ర పురస్కారాలతో సత్కరించారుజవాన్ చిత్రానికి గానూ షారుఖ్ ఖాన్ ను ఉత్తమ నటుడిగా ప్రకటించగానేచప్పట్లతో మారుమోగిపోయిందిఆయన హుందాతనంఆకర్షణభావోద్వేగంతో కలగలిసిన అద్భుతమైన నటనకు ఇది నిదర్శనంప్రేక్షకులను ఆకట్టుకునే ప్రదర్శనతో సున్నితమైన భావ వ్యక్తీకరణ అవసరమైన పాత్రలో ఆయన ఆ చిత్రాన్ని అద్భుతంగా నడిపించారుఆయన ఉన్న ప్రతి సన్నివేశం చిరస్మరణీయంగాహృదయాన్ని హత్తుకునేలా ఉందిట్వెల్త్ ఫెయిల్‌ సినిమాకుగాను విక్రాంత్ మాస్సే పురస్కారాన్ని పొందారుఎదురుదెబ్బలతో పోరాడుతున్న ఓ యువకుడు.. దృఢ సంకల్పంతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చేలా ఎదిగిన తీరును ఆయన పాత్రలో సజీవంగా చిత్రించారుజీవితగాథలనూమానవ చేతననూ ఆవిష్కరించిన భారతీయ సినిమా సమగ్ర స్ఫూర్తిని ఈ పురస్కారాలు చాటాయి.

మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణీ ముఖర్జీ ఉత్తమ నటి పురస్కారం కార్యక్రమానికి మరింత శోభనిచ్చిందిఓ తల్లి వేదనశక్తి మూర్తీభవించిన ఆమె పాత్ర.. కళకుజీవితానుభవానికి నడుమ ఉన్న ఓ సన్నని రేఖను  చెరిపేసిందిహాల్‌లోని ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో సహానుభూతి చెందారు.

సినిమాలకు ఆత్మగా ఉండే సహాయక పాత్రలకూ సమాన గౌరవం లభించిందిఉత్తమ సహాయ నటులుగా విజయరాఘవన్ముత్తుపెట్టై సోము భాస్కర్‌ల పురస్కారం పొందారుచిన్న పాత్రలు కూడా మొత్తం కథా భారాన్ని ఎలా మోయగలవో వారు తమ నైపుణ్యంతో నిరూపించారుప్రామాణికతఆర్ధ్రతలను మేళవించిన తమ ప్రదర్శనలకు గాను ఊర్వశిజానకి బోడివాలా ఉత్తమ సహాయ నటి పురస్కారాలను పొందారువారు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులు మరపురాని భావోద్వేగాల్లో లీనమయ్యేలా చేశారు.

ప్రదర్శనలకే పరిమితం కాకుండా.. ఆకాంక్షలుపోరాటాలుభావుకతనూ ఈ సినిమాలు చాటాయిఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ‘ట్వల్త్ ఫెయిల్’ గుర్తింపు పొందిందిదృఢ సంకల్పాన్ని చాటేలా సాగే ఈ కథ ఎందరో జీవితాలకు అద్దం పడుతుందిఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్‌గా ఫ్లవరింగ్ మ్యాన్ఉత్తమ డాక్యుమెంటరీగా గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ ఎంపికయ్యాయిచిత్రణప్రశ్నించడంవిస్మృత సత్యాల ఆవిష్కరణల్లో సినిమా సామర్థ్యాన్ని ఈ చిత్రాలు చాటాయి.

కొత్త రంగాలకు సంబంధించి.. ఏవీజీసీ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్)లో ఉత్తమ చిత్రంగా హను-మాన్ ఎంపికైందిదృశ్యాత్మక కథనంలో పెరుగుతున్న భారత శక్తికి లభించిన గుర్తింపు ఇదిఉత్తమ లఘుచిత్రంగా ‘గిద్ది స్కావెంజర్’ అవార్డుకు ఎంపికైంది.

ఈ పురస్కారాలు కేవలం విజయాల జాబితాలు మాత్రమే కాదు.. స్వరాలుతారలుకొత్త నటులుప్రధాన స్రవంతిప్రయోగాత్మక కథనాల చిత్రణలుభారతీయ సినిమా.. దేశ కలలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు భవితను తీర్చిదిద్దగలదని మరోసారి నిరూపించాయి.

పురస్కారాల పూర్తి జాబితాను కింది లింకులో చూడొచ్చు:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2151537

 

***


(Release ID: 2171975) Visitor Counter : 8