ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ కన్నడ రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 24 SEP 2025 3:44PM by PIB Hyderabad

ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మనస్సాక్షిని కదిలించిన, దేశ అంతరాత్మను తాకిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను అభివర్ణించారు.

 

భైరప్ప దేశ సాహిత్యానికి, ముఖ్యంగా కన్నడలో ఆయన చేసిన కృషి దేశ మేధో, సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. చరిత్ర, తత్వశాస్త్రం, సామాజిక అంశాలపై ఆయన చేసిన గొప్ప పరిశీలనలు.. అనేక తరాల వారి నుంచీ అనేక ప్రాంతాల వారి నుంచీ ప్రశంసలు పొందాయి.

 

‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా అన్నారు.

 

‘‘శ్రీ ఎస్ఎల్ భైరప్ప గారి మృతితో దేశ అంతరాత్మను తాకిన, మనస్సాక్షిని కదిలించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన సాహసి... గొప్ప రచయిత. ఆలోచనాత్మక రచనలతో కన్నడ సాహిత్యాన్ని శ్రీ భైరప్ప సుసంపన్నం చేశారు. ఆయన రచనలు తరాల వారీగా ప్రజలను ఆలోచించేందుకు, ప్రశ్నించేందుకు, సమాజంతో లోతుగా మమేకం కావడానికి ప్రేరణనిచ్చాయి.

 

మన చరిత్ర, సాంస్కృతికపై ఆయనకున్న అపార అభిమానం భావితరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.


(Release ID: 2170758) Visitor Counter : 4