సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మీడియా, ఎంటర్ టైన్ మెంట్, ఏపీజీసీ-ఎక్స్ ఆర్ రంగాల్లోని అంకుర సంస్థలకు మద్దతుగా ఏడు కొత్త ఇంక్యుబేషన్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వేవ్ఎక్స్
ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించేందుకు
ఐఐఎంసీ(ఢిల్లీ, జమ్మూ, డెంకనాల్, కొట్టాయం, అమరావతి), ఎఫ్ టీఐఐ పూణే, ఎస్ఆర్ఎఫ్ టీఐ
కోల్ కతాలో నూతన కేంద్రాలు
ఐఐసీటీ, ఎఫ్ టీఐఐ, ఎస్ఆర్ఎఫ్ టీఐ, ఇతర భాగస్వామ్య ఇంక్యుబేటర్ల ద్వారా
ఫిలిం ప్రొడక్షన్, గేమ్ డెవలప్ మెంట్, ఎడిటింగ్, టెస్టింగ్ కోసం అంకురాలకు అధునాతన సౌకర్యాలు
Posted On:
24 SEP 2025 9:39AM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వేవ్స్ కార్యక్రమం కింద పనిచేసే స్టార్టప్ యాక్సిలరేటర్- వేవ్ ఎక్స్ ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)లోని కేంద్రానికి అదనంగా, దేశవ్యాప్తంగా ఏడు కొత్త ఇంక్యుబేషన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్). ఎక్స్ఆర్ (ఎక్స్ టెండెడ్ రియాలిటీ) రంగాల్లోని అంకుర సంస్థల కోసం ప్రత్యేకంగా యాక్సిలరేటర్-కమ్-ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టటం ఇదే తొలిసారి.
ఏడు కొత్త కేంద్రాలు:
కొత్తగా ప్రకటించిన కేంద్రాలు ఈ కింది సంస్థల్లో ఏర్పాటు చేస్తారు:
1. ఇండియన్ మాస్ కమ్యూనికేషన్ ఇనిస్టిట్యూట్ (ఐఐఎంసీ), ఢిల్లీ
2. ఐఐఎంసీ, జమ్మూ
3. ఐఐఎంసీ, డెంకనాల్, ఒడిశా
4. ఐఐఎంసీ, కొట్టాయం, కేరళ
5. ఐఐఎంసీ, అమరావతి, మహారాష్ట్ర
6. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్ టీఐఐ), పూణె, మహారాష్ట్ర
7. సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్ టీఐ), కోల్ కతా, పశ్చిమ బెంగాల్
ఈ ఇంక్యుబేషన్ కేంద్రాల ప్రారంభంతో ఐఐసీటీ, ఎఫ్ టీఐఐ, ఎస్ఆర్ఎఫ్ టీఐ, ఇతర భాగస్వామ్య ఇంక్యుబేటర్ల ద్వారా ఫిలిం ప్రొడక్షన్, గేమ్ డెవలప్ మెంట్, ఎడిటింగ్, టెస్టింగ్ కోసం అంకుర సంస్థలు అధునాతన సదుపాయాలను పొందవచ్చు. ముంబయిలోని ఐఐసీటీ ఇంక్యుబేటర్ లో 8కే రెడ్ రాప్టర్ విస్టా విజన్ కెమెరా, డాల్బీ అట్మాస్ తో 4కే హెచ్ డీఆర్ ప్రివ్యూ థియేటర్, అత్యుత్తమంగా పనిచేసే ఏలియన్ వేర్ వర్క్ స్టేషన్లు, ఎల్ఈడీ వాల్స్ తో ఉన్న అత్యాధునిక వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్, ఫొటోగ్రామెట్రీ సిస్టమ్స్, ప్రొఫెషనల్ సౌండ్, కలర్ మిక్సింగ్ థియేటర్లు, 4కే హెచ్ డీఆర్ ఎడిట్ సూట్లు, వీఆర్ టెస్టింగ్ కిట్లు, సరికొత్త గేమింగ్ కన్సోల్స్ వంటి ఉండే ప్రపంచస్థాయి సదుపాయాలుంటాయి.
ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఫిలిం, గేమింగ్, ప్రత్యేక అనుభూతిని కలిగించే మీడియా కంటెంట్ ను రూపొందించటానికి, అభివృద్ధి చేయటానికి, దాన్ని ధ్రువీకరించేందుకు ఈ సౌకర్యాలు అంకురసంస్థలకు అవకాశం కల్పిస్తాయి. వేవ్ ఎక్స్ కింద స్టార్టప్ లు ఈ వనరులను క్షేత్రస్థాయిలో, డిజిటల్ వేదికల ద్వారా ఉపయోగించుకోవచ్చు. వైవా టెక్(పారిస్), గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (యూఎస్ఏ) వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో పాల్గొనే అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను పొందవచ్చు.
సదుపాయాలు, సహకారం:
ఎంపికైన అంకుర సంస్థలకు ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించటం, పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధాలు, నిధుల సహకారం, విక్రయాలు, మార్కెటింగ్ మెలకులు నేర్పిస్తారు. ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) మాదిరిగానే కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలు, ఇంక్యుబేషన్ సౌకర్యాలను కల్పించటం ద్వారా అన్ని అంకురసంస్థలకు అత్యుత్తమ ఇంక్యుబేషన్, మౌలిక సదుపాయాలు, మెంటార్ షిప్ ఒకే విధంగా ఉంటాయి.
ప్రతి ఇంక్యుబేషన్ సెంటర్ లో పాల్గొనే స్టార్టప్ లకు ఈ సేవలు అందిస్తారు:
1. ఉమ్మడి కార్యాలయాలు, ఏవీ/డిజిటల్ ల్యాబ్స్, స్టూడియోలు (గ్రీన్ రూమ్స్, ఫొటో/వీడియో ప్రొడక్షన్ సౌకర్యాలు)
2. హై-స్పీడ్ ఎల్ఏఎన్/వై-ఫై, హోస్టింగ్ సర్వర్లు, క్లౌడ్ క్రెడిట్లు (ఏడబ్ల్యూఎస్/గూగుల్), ఇండియా ఏఐ కంప్యూట్ సేవలు
3. ఓటీటీ, వీఎఫ్ఎక్స్, వీఆర్, గేమింగ్, యానిమేషన్, పబ్లిషింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో శాండ్ బాక్స్ టెస్టింగ్ అవకాశాలు
4. అంతర్జాతీయ, పారిశ్రామిక రంగ నిపుణులతో సలహాలు, సూచనలు అందిటం
5. మాస్టర్ క్లాసులు, బూట్ క్యాంపుల నిర్వహణ, పాలసీ క్లినిక్కులు, పెట్టుబడిదారులతో అనుసంధానించే కార్యక్రమాల నిర్వహణ
ఐఐటీలు, టీ-హబ్, ఇతర ఇంక్యుబేటర్ల భాగస్వామ్యంతో నేర్చుకునే అవకాశాన్ని, ఆవిష్కరణ వ్యవస్థలను విస్తృతం చేయవచ్చు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేసే దూరదర్శన్, ఆలిండియా రేడియో, ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పబ్లికేషన్స్ డివిజన్, న్యూ మీడియా వింగ్, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ వంటి మీడియా సంస్థలతో పని చేసేందుకు వేవ్ ఎక్స్ ఇంక్యూబేషన్ కింద స్టార్టప్ లకు అవకాశం ఉంటుంది. ఎంపికైన స్టార్టప్ లకు ప్రాజెక్టుల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు చేసే విధానం
త్వరలో ఏర్పాటు కానున్న ఇంక్యుబేషన్ కేంద్రాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల అంకుర సంస్థలు wavex.wavesbazaar.com ను సందర్శించి, డాష్ బోర్డులో అప్లై ఇంక్యుబేషన్ ను ఎంపిక చేసుకుని, నచ్చిన ఇంక్యుబేషన్ సెంటర్ పేరు నమోదు చేసి, దరఖాస్తు చేసుకోవచ్చు.
1. స్టార్టప్ ల సంఖ్య: ప్రతిచోట మొదటి బ్యాచ్ కు 15 స్టార్టప్ లను ఎంపిక చేస్తారు.
2. నెలవారి రుసుం: ఒక్కో స్టార్టప్ కు రూ.8,500 + జీఎస్టీ
3. అర్హత: మీడియా-ఎంటర్ టైన్ మెంట్, ఏవీజీసీ-ఎక్స్ ఆర్ రంగాలకు సంబంధించిన స్టార్టప్ లకు ప్రాధాన్యత.
వేవ్ ఎక్స్ గురించి
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వేవ్స్ కార్యక్రమం కింద పనిచేసే స్టార్టప్ యాక్సిలరేటర్- వేవ్ ఎక్స్ ను మీడియా, ఎంటర్ టైన్ మెంట్, క్రియేటివ్ టెక్నాలజీస్ లో సృజనాత్మక ఆవిష్కరణల కోసం రూపొందించారు. వేవ్ ఎక్స్ ఇంక్యుబేటర్ల వ్యవస్థ ద్వారా, భారత్ లోని భవిష్యత్ సృష్టికర్తలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలు, మెంటర్ షిప్, ప్రపంచ మార్కెట్ లోకి ప్రవేశించే విధానాలను తెలియజేస్తుంది.
రెండు విధాలుగా వేవ్ ఎక్స్ ఇంక్యుబేషన్ మోడల్ పనిచేస్తుంది:
ప్రత్యక్ష విధానం: వ్యాపార నమూనా తయారీ, ఉత్పత్తుల అభివృద్ధి, బ్రాండింగ్, నిధుల సేకరణ, మీడియా నిబంధనల్లో సహకారం.
పరోక్ష విధానం: వేవ్స్ బజార్, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారు/పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రపంచ అవకాశాలను తెలియజేస్తూ మెంటార్ షిప్.
వినూత్న మీడియా ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న వ్యవస్థను ఏర్పాటు చేయాలని వేవ్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సంప్రదాయ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లకు భిన్నంగా ఉంటుంది. ఇది ప్రస్తుత ఉత్పత్తుల ఆధారంగా కాకుండా అవాస్తవిక దశలో ఉన్న ఏవీజీసీ ఉత్పత్తుల భవిష్యత్ సామర్థ్యం ఆధారంగా ప్రారంభ దశలో ఉన్నవాటికి మద్దతిస్తుంది. గేమింగ్, ఓటీటీ, ఏఐ ఆధారిత కంటెంట్ సృష్టించటం, వాస్తవ అనుభూతిని కలిగించే సాంకేతికత (ఏఆర్/వీఆర్/ ఎక్స్ఆర్) రంగాల్లో భవిష్యత్ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం, నిధుల లభ్యత, అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించేందుకు వేవ్ ఎక్స్ ను రూపొందించారు.
(Release ID: 2170713)
Visitor Counter : 3