ప్రధాన మంత్రి కార్యాలయం
ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులతోనూ, ఇతర వ్యాపారులతోనూ ప్రధానమంత్రి భేటీ
Posted On:
22 SEP 2025 3:39PM by PIB Hyderabad
ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులు, ఇతర వ్యాపారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ ఆకర్షణీయ ఉత్పాదనలను ప్రదర్శించారు. ‘‘జీఎస్టీ సంస్కరణల పట్ల వారు సంతోషాన్ని ప్రకటించారు. వారికి నేను ‘గర్వ్ సే కహో యే స్వదేశీ హై’ పోస్టర్లను అందజేశాను. వాటిని దుకాణాల్లో ప్రదర్శిస్తామని వారు ఉత్సాహంగా చెప్పారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.
ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘నేటి ఉషోదయంతో భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైంది.. జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలైంది.
ఇందుకు భారత్‌లో తొలిపొద్దు పొడిచే అరుణాచల్ ప్రదేశ్ కన్నా చక్కని ప్రాంతం ఇంకేం ఉంటుంది?
ఈటానగర్‌లో, అక్కడి వ్యాపారులతోనూ ఇతర చిన్నతరహా వ్యాపారులతోనూ నేను భేటీ అయ్యాను. వారు ఘుమఘుమలాడే తేనీరు, రుచికరమైన పచ్చళ్లు, పసుపు, బేకరీ ఉత్పాదనలు, హస్తకళలు, ఇంకా ఎన్నో వస్తువులను ప్రదర్శించారు.
జీఎస్టీ సంస్కరణలపై సంతోషాన్ని ప్రకటించారు. వారికి ‘గర్వ్ సే కహో యే స్వదేశీ హై’ పోస్టర్లను నేను అందించాను. వాటిని దుకాణాల్లో పెడతామని వారు ఉత్సాహంతో చెప్పారు.’’
***
MJPS/VJ
(Release ID: 2169699)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam

|
|