ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్‌సారిలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

प्रविष्टि तिथि: 22 FEB 2024 8:32PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ప్రజల మన్ననలు పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులునా పార్లమెంటరీ సహచరుడుఈ ప్రాంత ప్రజా ప్రతినిధిభారతీయ జనతా పార్టీ గుజరాత్ అధ్యక్షుడు సి.ఆర్పాటిల్గౌరవ ఎంపీలుఎమ్మెల్యేలుప్రియమైన సోదరీ సోదరులారామీరంతా ఎలా ఉన్నారు?

గుజరాత్‌లో ఈ రోజు నేను పాల్గొంటున్న మూడో కార్యక్రమం ఇదిఈ ఉదయమే అహ్మదాబాద్‌లో పశుపోషణపాడి పరిశ్రమలో నిమగ్నులైన లక్షలాది మందిని కలిసి.. వారితో సంభాషించే అవకాశం నాకు లభించిందిఆ తర్వాత మెహసానాలోని వాలినాథ్ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం దక్కిందిఇప్పుడు నవ్‌సారిలో అభివృద్ధి వేడుకల్లో మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషాన్నిస్తోందిభూపేంద్ర భాయ్ చెప్పినట్టు.. ఇంత పెద్ద మొత్తంలో వ్యయంతో ఒకేసారి ఇంత విస్తృతమైన అభివృద్ధి పనులు చేపట్టడం స్వాతంత్ర్యానంతరం బహుశా ఇదే మొదటిసారేమోఈ అభివృద్ధి మహోత్సవాల స్ఫూర్తితో.. మీరంతా ఓసారి మొబైల్ ఫోన్లను బయటకు తీసిటార్చిలైట్ వెలిగించి వికాసోత్సవంలో భాగస్వాములు కావాలని కోరుతున్నానుభారత్ మాతా కీ జై... ఈ ఘట్టాన్ని ఉత్తేజకరంగా మార్చుకుందాంభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైశహభాష్ఈ రోజు నవ్‌సారి ఓ వజ్రంలా ప్రకాశిస్తోందిఇటీవలే వడోదరనవ్‌సారిభరూచ్సూరత్ తదితర ప్రాంతాల్లో వస్త్రాలువిద్యుత్పట్టణాభివృద్ధి వంటి వేల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాంమొత్తంగా వీటి విలువ రూ40 వేల కోట్లకు పైమాటేఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు.


మిత్రులారా,

పార్లమెంటులోనూవీధుల్లోనూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోందిఆ చర్చలన్నీ ‘మోదీ గ్యారంటీ’ చుట్టూనే తిరుగుతున్నాయిమోదీ ఏమి హామీ ఇచ్చినా నెరవేర్చి తీరుతాడని ప్రతి పౌరుడూ గుర్తిస్తున్నాడుదేశంలోని మిగతా ప్రాంతాలకు బహుశా ఇది కొత్త విషయమేమో... కానీ గుజరాత్ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా తెలుసుమోదీ మాటంటే హామీలను నెరవేర్చే బాండ్ వంటిదని వారికి తెలుసునేను గుజరాత్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ ‘అయిదు F’ల గురించి చెప్పేవాడిని గుర్తుందా? ‘ఉత్పత్తి నుంచి ఫైబర్ వరకు (ఫాం టు ఫైబర్), ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ దాకాఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్ దిశగాఫ్యాషన్‌తో అంతర్జాతీ స్థాయికి (ఫ్యాషన్ టు ఫారిన్)’ సాగిన ప్రస్థానాన్ని అవి వివరిస్తాయిఅంటే.. రైతు పత్తిని సాగు చేస్తాడుపత్తి ఫ్యాక్టరీకి వెళుతుందిఫ్యాక్టరీలో తయారైన దారాలతో వస్త్రాలు తయారు చేస్తారుఅవి విదేశాలకు ఎగుమతి అవుతాయి.

జౌళి రంగంలో సమగ్రమైన సరఫరా వ్యవస్థనుపూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను నెలకొల్పాలన్నది నా లక్ష్యంఅది కచ్చితంగా జరగాలిఅవును కదాఆత్మనిర్భర భారత్‌ను సాకారం చేసుకునేందుకు ఇలాంటి వ్యూహాలను నేడు మనం అమలు చేస్తున్నాంనవ్‌సారిలో ప్రారంభించిన పీఎం మిత్ర పార్కు ఈ లక్ష్యం దిశగా కీలక ముందడుగువస్త్ర రంగానికి సంబంధించి ఆ తరహాలో దేశంలో మొదటి ఏర్పాటు అదిఈ కార్యక్రమం జౌళి పరిశ్రమను బలోపేతం చేయడంతోపాటు.. ఎగుమతుల్లో భారత్ వాటాను పెంచుతుందిఒక్కసారి ఊహించండి.. సూరత్ వజ్రాలునవ్‌సారి వస్త్రాలు ప్రపంచ ఫ్యాషన్ మార్కెటులో గుజరాత్ ఘనతను చాటుతాయిగుజరాత్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడాన్ని మనం వినలేమా?

 

మిత్రులారా,

నిజానికి నేడు సూరత్ సిల్క్ సిటీ తన పరిధిని నవ్‌సారి వరకు విస్తరించుకుంటోందిఈ రంగంలో ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారులుఎగుమతిదారులతో ఇప్పుడు భారత్ పోటీ పడుతోందిఇందుకు గుజరాత్ వస్త్ర పరిశ్రమ విశేష సహకారాన్ని అందిస్తోందిఅనేక సంవత్సరాలుగా సూరత్ వస్త్ర పరిశ్రమ ఒక బలమైన గుర్తింపును ఏర్పరచుకుందిఇక్కడ పీఎం మిత్ర పార్కు పూర్తయితే.. ఈ మొత్తం ప్రాంత రూపురేఖలు గణనీయంగా మారిపోతాయిఒక్క ఈ పార్కు నిర్మాణం కోసమే రూ3000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాంఅన్ని వాణిజ్య కార్యకలాపాలకూ తగిన ఏర్పాట్లు ఇక్కడ సిద్ధమవుతాయివడకడంనేతపత్తి నుంచి గింజలు వేరు చేయడంవస్త్రోత్పత్తిజౌళి సాంకేతికత సంబంధిత పదార్థాలుయంత్రాలు మొదలైనవన్నీ ఇందులో భాగంగా ఉంటాయిఅంటే వేలాది హస్త కళాకారులుకార్మికులు ఇక్కడ పనిచేసే అవకాశాలు పొందుతారుఅంతే కాకుండా గృహనిర్మాణంలాజిస్టిక్స్ పార్కుగిడ్డంగి సౌకర్యాలుఆరోగ్య రక్షణ సేవలుకార్మికుల కోసం శిక్షణ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలూ ఉంటాయిచుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పార్కు ఉపాధిస్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

 

మిత్రులారా,

సూరత్ ప్రజల కోసం మరో ముఖ్యమైన ప్రాజెక్టును కూడా ఈ రోజు ప్రారంభించాంరూ800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న తాపి నది బ్యారేజీకి ఈ రోజు శంకుస్థాపన చేశాంతాపి నది బ్యారేజీ నిర్మాణం ద్వారా.. మున్ముందు చాలా ఏళ్ల పాటు సూరత్‌ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న నీటి సరఫరా సమస్యకు పరిష్కారం దొరుకుతుందివరదల వంటి ముప్పులను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.


మిత్రులారా,

సామాజిక జీవితంలోపారిశ్రామిక అభివృద్ధిలో విద్యుత్ ఎంత ముఖ్యమైనదో గుజరాత్‌కు బాగా తెలుసుఇరవైఇరవై అయిదేళ్ల కిందట గుజరాత్ దీర్ఘకాలిక విద్యుత్ కోతలను ఎదుర్కొన్నదిఇప్పుడు 25-30 ఏళ్ల వయస్సున్న వ్యక్తులకు మనం ఎదుర్కొన్న అంధకారం గురించి కనీసం తెలిసి కూడా ఉండకపోవచ్చునేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రజలు ముఖ్యంగా సాయంత్రం భోజన సమయాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ నా దగ్గరకు వచ్చేవారుఆ రోజులను తలచుకుంటే.. అలాంటి పరిస్థితులు ఉండేవని నమ్మడమూ కష్టమేఆ సమయంలో విద్యుదుత్పత్తిలో అనేక సవాళ్లుండేవిబొగ్గును సుదూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదిగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు కూడా దిగుమతులే ఆధారంగా ఉండేవినీటి నుంచి విద్యుదుత్పత్తి వ్యయ భారంతో  కూడుకుడి ఉండేదిఈ సంక్షోభాల నడుమ గుజరాత్ అభివృద్ధి అసంభవమేమో అనిపించేదిఅయితేఈ అడ్డంకులను అధిగమించాలని మోదీ దృఢంగా నిశ్చయించుకున్నాడుగుజరాత్‌లో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి మేం ప్రాధాన్యమిచ్చాంసౌరపవన విద్యుత్తులు మా వ్యూహానికి కేంద్ర బిందువులుగా మారాయినేడు గుజరాత్ సౌరపవన వనరుల నుంచి గణనీయమైన విద్యుత్తును పొందుతోంది.

 

మిత్రులారా,

21వ శతాబ్దపు భారత్‌కు తగిన విధంగా విద్యుత్తును సరఫరా చేయడంలో మన అణు విద్యుత్ ప్లాంట్ల పాత్ర మరింత విస్తరించనుందితాపిలోని కాక్రాపర్ అణు విద్యుత్ ప్లాంటులో రెండు కొత్త రియాక్టర్లను ఈ రోజు ప్రారంభించాం. ‘మేడిన్ ఇండియా’ సాంకేతికతతోనే ఈ రెండు రియాక్టర్లను నిర్మించుకున్నాంఈ స్వావలంబనను చాటేలా ఒకసారి గర్వంగా చేతులెత్తి భారత్ మాతా కీ జై అని నినదిద్దాం – భారత్ మాతా కీ జైప్రతి రంగంలోనూ ఆత్మనిర్భరత దిశగా భారత్ పయనాన్ని ఇది స్పష్టం చేస్తోందిఈ ప్లాంటు నుంచి గుజరాత్ మరింత ఎక్కువగా విద్యుత్ సరఫరాను పొందతుందిఅది దాని పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిస్తుంది.

 

మిత్రులారా,

నవ్‌సారీ కానివ్వండివల్సాద్ కానివ్వండి.. దక్షిణ గుజరాత్ ప్రాంతం ఇప్పుడు ‘నభూతో’ అన్న రీతిలో అభివృద్ధిలో దూసుకుపోతోందిఇక్కడి మౌలిక సదుపాయాల్లో ఎప్పటికప్పుడు ఆధునికీకరణ జరుగుతోందిఇక సౌర విద్యుత్తు గురించి మాట్లాడుకుందాంగుజరాత్‌నే తీసుకుందాం.. మన గుజరాతీలు ఆర్థిక విషయాలపై చాలా శ్రద్ధ చూపుతారుఅకౌంటింగ్‌లో వారు సిద్ధహస్తులుఇప్పుడు ఎంతో ప్రయోజనకరమైన మరో హామీతో మోదీ మీ ముందుకొచ్చాడు – అదే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకందాన్నే పీఎం సూర్య ఘర్ అంటున్నాంపీఎం సూర్య ఘర్ కింద 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నాందీంతో ఏసీలుఫ్యాన్లుఫ్రిజ్‌లువాషింగ్ మెషీన్ల వంటి ముఖ్యమైన గృహోపకరణాలు నడుస్తాయిఇది దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ అందుబాటులో ఉంటుందిఅంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలను అందించడం ద్వారా కూడా ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందిఅంతే కాదుమీరు 300 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసిమిగులును అమ్మదలచుకుంటే.. ప్రభుత్వం ఆ అదనపు విద్యుత్తును మీ నుంచి కొనుగోలు చేస్తుందిఅదనపు ఆదాయ వనరుగా అది ఉపయోగపడుతుందిఇది లాభదాయకం కాదాగుజరాత్‌లో సౌర విద్యుత్ సరఫరాసౌర శక్తి వినియోగంప్రతి ఇంటికి ఉచిత విద్యుత్తును అందించడం వంటి ప్రయత్నాలలో ప్రజలంతా భాగస్వాములు కండిఇది మోదీ హామీఅంతేకాకుండాముంబయిసూరత్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తూ.. దేశంలో మొదటి బుల్లెట్ రైలు ఈ ప్రాంతం గుండా వెళ్లనుంది.

 

మిత్రులారా,

నవ్‌సారి ఇప్పుడు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందిఅయితేనవ్‌సారి సహా మొత్తం దక్షిణ గుజరాత్ ప్రాంతం వ్యవసాయంలో కూడా గణనీయంగా అభివృద్ధి చెందిందిబీజేపీ ప్రభుత్వం ఇక్కడి రైతులకు సౌకర్యాలు కల్పించడం మొదలయ్యాక.. పండ్ల సాగు పద్ధతుల్లో విశేష వృద్ధి నమోదైందిఈ ప్రాంతంలోని హాపుస్ మామిడి పండ్లువల్సాద్ మామిడి పండ్లునవ్‌సారి చికూలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయినేను ఎక్కడికెళ్ళినా ప్రజలు వాటి గురించి నన్నడుగుతారుప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలుస్తోందిప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా నవ్‌సారి రైతులు రూ.350 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు.

 

మిత్రులారా,

దేశవ్యాప్తంగా పేదలురైతులుయువతమహిళలను సాధికారులను చేస్తామని మోదీ ప్రతిజ్ఞ చేశాడుఇది కేవలం పథకాలను రూపొందించడానికి మాత్రమే పరిమితం కాదుఅర్హులకు ఈ కార్యక్రమాల పూర్తి ప్రయోజనాలను అందించడం కూడా ఇందులో భాగందేశంలోని ప్రతి ఇంటి నుంచి లేమినిపేదరికాన్ని నిర్మూలించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందిప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరిస్తూ లబ్ధిదారులను చేరుకునివారిని గుర్తిస్తోందిసంబంధిత పథకాలతో వారిని అనుసంధానిస్తోంది.

 

మిత్రులారా,

అనేక ఏళ్లుగా కేంద్రంలోనూ గుజరాత్‌లోనూ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలనుతీరప్రాంత గ్రామాలను నిర్లక్ష్యం చేశాయిఅయితే ఇక్కడ గుజరాత్‌లో ఉమర్గామ్ నుంచి అంబాజీ వరకు మొత్తం గిరిజన ప్రాంతంలో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందికానీ దేశవ్యాప్తంగా అలా జరగలేదు2014 వరకు దేశవ్యాప్తంగా 100కు పైగా జిల్లాలు అభివృద్ధికి దూరమై కుంగిపోయాయివాటిపై పెద్దగా శ్రద్ధ చూపలేదుఈ జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉండేవారుగత దశాబ్ద కాలంలో ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం ద్వారా.. గతంలో నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఈ ప్రాంతాలు అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించాయి.

 

సోదరీ సోదరులారా,

ఇతరుల వాగ్దానాలు విఫలమైన చోట మోదీ హామీ మొదలవుతుందిమోదీ హామీ వల్లే దేశంలోని అత్యంత పేద వర్గాలకు మొదటిసారి పక్కా ఇంటిపై భరోసా దక్కిందివారు ఆకలితో పడుకోవాల్సిన అవసరం లేదనిబాధలను భరించాల్సిన పనిలేదని మోదీ హామీ ఇచ్చారుమోదీ హామీ కారణంగా.. మారుమూల గ్రామాల్లో నివసించే అక్కాచెల్లెళ్లు కూడా తమ ఇళ్లకు విద్యుత్తుకుళాయి నీరు లభిస్తాయని నమ్మకంగా ఉన్నారుబీమాపింఛను పథకాలు తమకు అనుకూలంగా ఉంటాయని పేదలురైతులుదుకాణదారులుకార్మికులు ఎప్పుడూ ఊహించనుకూడాలేదుకానీ మోదీ హామీ వల్ల అది నేడు వాస్తవరూపం దాల్చిందిఓసారి రెండు చేతులూ పైకెత్తి దీనికి అంగీకారం తెలపండి ఇదంతా మోదీ హామీ వల్లే.

 

మిత్రులారా,

గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా కీలక సవాలుగా మారిందినేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలను అమలు చేశాంఅయితే ఈ వ్యాధిని సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశవ్యాప్త ప్రయత్నాలు తప్పనిసరిఅందుకే సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కోసం ఓ జాతీయ మిషన్‌ను మేం ప్రారంభించాంఇందులో భాగంగా దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహిస్తున్నారువికసిత భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా లక్షలాది వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారుఅంతేకాకుండాఈ ప్రాంతంలో ఓ వైద్య కళాశాలనూ నిర్మిస్తున్నాంగతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైద్య కళాశాలను స్థాపించడం దాదాపు అసంభవంగా ఉండేదినేడు అనేక గిరిజన జిల్లాల్లో వైద్య కళాశాలలను నెలకొల్పాం.

 

మిత్రులారా,

పేదవారైనామధ్యతరగతి వారైనా.. గ్రామాల్లో ఉంటున్నానగరాల్లో ఉంటున్నా... ప్రతి పౌరుడి జీవన ప్రమాణాలను పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందిదశాబ్దాల కాంగ్రెస్ పాలనలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానానికే భారత్ పరిమితమైందిఆర్థికాభివృద్ధిలో వెనుకబడి ఉంటే దేశంలో వనరులు పరిమితమై.. గ్రామాలుచిన్న పట్టణాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందిఅయితే బీజేపీ ప్రభుత్వ నేతృత్వంలో.. దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగిందిభారతీయుల్లో వ్యయార్హ ఆదాయం మెరుగుపడిందనితద్వారా వినియోగ వ్యయం పెరిగిందని దీన్ని బట్టి తెలుస్తోందిపర్యవసానంగా దేశవ్యాప్తంగా చిన్న నగరాల్లోనూ బలమైన అనుసంధాన మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతున్నాయిచిన్న నగరాల నుంచి విమాన ప్రయాణాన్ని ఒకప్పుడు కనీసం ఊహించలేదుకానీ అదిప్పుడు నిజమైందిఅంతేకాదుకాంగ్రెస్ పాలనలో నగరాల్లో మురికివాడలు పెరగగావాటి స్థానంలో మా ప్రభుత్వం పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తోందిగత దశాబ్ద కాలంలో మేం పేదల కోసం కోట్లకు పైగా పక్కా ఇళ్ళు నిర్మించాం – ఒక్కసారి ఊహించండి.. కోట్ల ఇళ్ళు!

 

మిత్రులారా,

నేడు ‘డిజిటల్ ఇండియా’ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందిఒకప్పుడు కాంగ్రెస్ దాన్ని ఎగతాళి చేసిందికొత్త అంకుర సంస్థల ఆవిర్భావాన్నిక్రీడల్లో యువత ప్రాతినిధ్యాన్ని పెంపొందిస్తూ.. ‘డిజిటల్ ఇండియా’ చిన్న నగరాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందిగుజరాత్‌లోని చిన్న పట్టణాల ఎదుగుదలను మనం చూస్తున్నాంతద్వారా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే దిశగా ఒక కొత్త మధ్యతరగతి ఆవిర్భవిస్తోంది.

 

సోదరీ సోదరులారా,

బీజేపీ ప్రభుత్వం అభివృద్ధికి ఎంత ప్రాధాన్యమిస్తుందో మన వారసత్వాన్నీ అలాగే గౌరవిస్తుందిమన దేశ చరిత్రలో ఈ ప్రాంతానికి గణనీయమైన చారిత్రకసాంస్కృతిక ప్రాధాన్యముందిస్వాతంత్ర్య పోరాటమైనాదేశ నిర్మాణమైనా.. ఈ ప్రాంతం ఎనలేని సహకారాన్ని అందించిందిబంధుప్రీతిసంతుష్టీకరణఅవినీతి రాజకీయాలను కమ్మేస్తే.. మన వారసత్వం నిర్లక్ష్యానికి గురవుతుందిదురదృష్టవశాత్తు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అన్యాయాన్ని కొనసాగిస్తూ వచ్చిందినేడు భారత ఘన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందిమీరు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా.. భారత్‌ను సందర్శించిదాని గురించి తెలుసుకోవాలనుకునే ప్రజలు కనిపిస్తారుకానీకాంగ్రెస్ దశాబ్దాలుగా దేశ నిజమైన వారసత్వం గురించి ప్రపంచానికి తెలియకుండా చేసిందిస్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మాగాంధీ ఉప్పునుఖాదీని స్వేచ్ఛకు చిహ్నాలుగా మలిచారుకానీ కాంగ్రెస్ ఖాదీని నిర్లక్ష్యం చేసిందిఉప్పు సత్యాగ్రహ వారసత్వాన్ని విస్మరించిందిఅయితేదండి వద్ద ఉప్పు సత్యాగ్రహం జరిగిన ప్రదేశంలో దండి స్మారక చిహ్నాన్ని మా ప్రభుత్వం నిర్మించిందిఅలాగే సర్దార్ పటేల్ సేవలకు చిహ్నంగా ‘ఏకతా విగ్రహా’న్ని నిర్మించే భాగ్యమూ మా ప్రభుత్వానికి లభించిందిఅయినాఒక్క కాంగ్రెస్ అగ్ర నాయకుడు కూడా ఈ ప్రదేశాల్లో నివాళి ఘటించలేదుగుజరాత్ పట్ల ఈ ఉపేక్షా భావాన్ని ఏ గుజరాతీ మర్చిపోలేడు.

 

మిత్రులారా,

మోదీని కుల ప్రాతిపదికన అవమానించే స్థితికి కాంగ్రెస్ సభ్యులు ఎలా దిగజారిపోయారో మీరు చూశారుఅయితే400 సీట్ల మార్కును అధిగమించాలన్న మా దృఢ సంకల్పం వారి వైఖరి వల్ల మరింత బలపడుతుందని వారు గ్రహించలేకపోతున్నారువాళ్ళు ఎంతగా బురద జల్లితే.. అంత అద్భుతంగా 370 శక్తిమంతమైన కమలాలు వికసిస్తాయి.

 

సోదరీ సోదరులారా,

నేడు కాంగ్రెస్ పార్టీకి దేశ భవితను దృష్టిలో ఉంచుకునే ఎజెండా లేదుదానికి బదులు మోదీపై నిరంతర విమర్శలకు దిగుతోందిఒక పార్టీ వారసత్వ రాజకీయాలకు లోబడి ఉంటే.. విస్తృత ప్రజా శ్రేయస్సు కన్నా కుటుంబానికే ప్రాధాన్యమిస్తుందనేందుకు ఇది నిదర్శనంఇలాంటి కుటుంబ కేంద్రీకృత ధోరణి యువతలో ఆవిష్కరణలుప్రతిభఆకాంక్షలను అణచివేస్తుందిఅలాంటి పార్టీల దృష్టి మొత్తం అదే స్థితిని కొనసాగిస్తూకుటుంబ ప్రయోజనాలను కాపాడుకోవడంపైనే ఉంటుందిఇదీ నేడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న దుస్థితిఅయితేబీజేపీ మాత్రం దీనికి భిన్నంగా.. రాబోయే 25 ఏళ్లలో దేశ వికాస దార్శనికతతో ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించిందిఈ 25 ఏళ్ల కాలంలో అభివృద్ధి చెందిన గుజరాత్అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.

 

మిత్రులారా,

తల్లులూ అక్కాచెల్లెల్లతోపాటు అశేషంగా నేడు ఇక్కడికి తరలివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుఆశీస్సులను అందించిమద్దతును ప్రకటించిన మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలుఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మరోసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలునాతో కలిసి గొంతెత్తండి -


‘‘భారత్ మాతా కీ జై!’’


రెండు చేతులు పైకెత్తి ఉత్సాహంగా నినదించండి 


‘‘భారత్ మాతా కీ జై!’’

‘‘భారత్ మాతా కీ జై!’’

‘‘భారత్ మాతా కీ జై!’’


ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదంమౌలిక ప్రసంగం హిందీలో ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2169369) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam