ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మోహన్‌లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం....అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 SEP 2025 7:42PM by PIB Hyderabad
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన సందర్భంగా శ్రీ మోహన్ లాల్ గారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ నటనలో, వైవిధ్యాన్ని చూపించటంలో శ్రీ మోహన్ లాల్ గారు శిఖర సమానుడని శ్రీ మోదీ పేర్కొన్నారు. దశాబ్దాల గొప్ప కృషితో ఆయన మలయాళ సినిమా ధృవతారగా వెలుగొందుతున్నారనీ, నాటకం, కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆయన అద్భుతాలు చేశారని అన్నారు. సినిమా, నాటకం... మాధ్యమం ఏదైనా ఆయన ప్రదర్శించిన నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘‘ఎక్స్’’ వేదికగా చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"నటనలోనూ, వైవిధ్యంలోనూ శ్రీ మోహన్ లాల్ శిఖర సమానం. అనేక దశాబ్దాలుగా కృషి చేస్తూ మళయాల సినిమా ధృవతారగా కొనసాగుతున్నారు. నాటకం, కేరళ సంస్కృతి అంటే ఎనలేని గౌరవం. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ ఆయన గొప్పగా నటించారు. సినిమా, నాటకం... మాధ్యమం ఏదైనా ఆయన ప్రదర్శించిన నటన ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు. ఆయన సాధించిన విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.''
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2169069)
आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam