ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి 8-10 తేదీల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ప్రధాని పర్యటన


కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించనున్న ప్రధానమంత్రి

ఇటానగర్‌లో ‘వికసిత భారత్ వికసిత ఈశాన్యం’ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాన మంత్రి

మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో రూ. 55,600 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం మరియు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ మల్టీపర్పస్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

సెల టన్నెల్‌ను దేశానికి అంకితం చేయనున్న ప్ర‌ధాన మంత్రి; టన్నెల్ తవాంగ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీని అందిస్తుంది; టన్నెల్‌కు 2019 ఫిబ్రవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు

ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేసేందుకు, సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఉన్నతి పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

సబ్రూమ్ ల్యాండ్ పోర్ట్‌ను ప్రారంభించనున్న పీఎం; ఇది భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ప్రయాణీకుల, సరుకు రవాణాను సులభతరం చేస్తుంది; ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన కూడా మార్చి 2021లో ప్రధాని చేతులమీదుగా జరిగింది

రైలు, రోడ్డు, ఆరోగ్యం, హౌసింగ్, విద్య, ఐటీ,

Posted On: 08 MAR 2024 3:18PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  2024 మార్చి 8-10 తేదీల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో  పర్యటించనున్నారు. మార్చి 8వ తేదీన ప్రధాని అస్సాంలో పర్యటన అనంతరం, 9వ తేదీ ఉదయం 5:45 గంటలకు, కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శిస్తారు. ఉదయం 10:30 గంటలకు, ఇటానగర్‌లో ఆయన ‘వికసిత భారత్ వికసిత ఈశాన్యం’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ సెల టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ఉన్నతి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో దాదాపు రూ. 55,600 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత, ప్రధాని మధ్యాహ్నం 12:15 గంటలకు జోర్హాట్ చేరుకుంటారు. ప్రఖ్యాత అహోమ్ జనరల్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అస్సాంలో రూ. 17,500 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, అంకితం చేసి, పునాది రాయి వేస్తారు.

ఆ తర్వాత, ప్రధాని పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి వెళ్లి మధ్యాహ్నం 3:45 గంటలకు బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 7 గంటలకు ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంటారు. వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, ప్రధానమంత్రి ఒక బహిరంగ సభలో పాల్గొంటారు,  ఉత్తరప్రదేశ్‌లో రూ.42,000 కోట్ల విలువైన ప్రోజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు, ప్రధానమంత్రి వారణాసికి చేరుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో మహతారి వందన యోజన కింద మొదటి విడత సహాయాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేస్తారు.

అస్సాంలో ప్రధాన మంత్రి 

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన కాజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌ను సందర్శిస్తారు. కాజిరంగా నేషనల్ పార్క్ ఒంటి  కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. ఏనుగులు, అడవి నీటి గేదెలు, చిత్తడి జింకలు, పులులు కూడా పార్కులో కనిపిస్తాయి. మొఘలులను ఓడించిన అస్సాంలోని అహోం రాజ్యానికి చెందిన రాయల్ ఆర్మీకి చెందిన ప్రముఖ జనరల్ లచిత్ బోర్ఫుకాన్ 84 అడుగుల ఎత్తైన అద్భుతమైన విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. ప్రాజెక్ట్‌లో లచిత్, తాయ్-అహోమ్ మ్యూజియం, 500 సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం నిర్మాణం కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లచిత్ బోర్ఫుకాన్ శౌర్యాన్ని, అతని గురించి అవగాహన పెంచడానికి చేసిన ప్రయత్నం. ఇది పర్యాటకాన్ని కూడా వృద్ధి చేస్తుంది. ఉపాధి అవకాశాల కల్పనకు దారి తీస్తుంది. జోర్హాట్‌లో జరిగే జనసభలో, ప్రధాన మంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్, రైలు మరియు గృహ రంగాలను బలోపేతం చేసే బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (పీఎం-డిఈవిఐఎన్ఈ) పథకం కింద శివసాగర్‌లోని మెడికల్ కాలేజ్, హాస్పిటల్, గౌహతిలో హెమటో-లింఫాయిడ్ సెంటర్‌తో సహా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. డిగ్‌బోయ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 0.65 నుండి 1 ఎంఎంటిపిఏకి (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) విస్తరణతో సహా చమురు, గ్యాస్ రంగానికి చెందిన ముఖ్యమైన ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు; గువాహటి రిఫైనరీ విస్తరణ (1.0 నుండి 1.2 ఎంఎంటిపిఏ)తో పాటు ఉత్ప్రేరక సంస్కరణ యూనిట్ (సిఆర్యూ); బెట్‌కుచ్చి (గౌహతి) టెర్మినల్‌లో సౌకర్యాల పెంపుదల: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇతర వాటితో పాటు. టిన్సుకియాలోని కొత్త మెడికల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా ప్రధాని దేశానికి అంకితం చేస్తారు; 718 కి.మీ పొడవు బరౌని - గౌహతి పైప్‌లైన్ (ప్రధాని మంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్‌లో భాగం) సుమారు రూ. 3,992 కోట్లతో నిర్మించబడింది. మొత్తం రూ.8,450 కోట్లతో నిర్మించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జి) కింద దాదాపు 5.5 లక్షల గృహాలను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు;

ధూప్‌ధార-ఛాయ్‌గావ్ సెక్షన్ (న్యూ బొంగైగావ్ - గౌహతి వయా గోల్‌పారా డబ్లింగ్ ప్రాజెక్ట్‌లో భాగం),  న్యూ బొంగైగావ్ - సోర్బోగ్ సెక్షన్ (న్యూ బొంగైగావ్ - అగ్థోరి  డబ్లింగ్ ప్రాజెక్ట్‌లో భాగం) సహా అస్సాంలో రూ. 1300 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని దేశానికి అంకితం చేస్తారు. )

అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని

మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లలో రహదారి, ఆరోగ్యం, గృహనిర్మాణం, విద్య, సరిహద్దు మౌలిక సదుపాయాలు, ఐటీ, పవర్, ఆయిల్ మరియు గ్యాస్ , రైలు వంటి రంగాలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల లో  పాల్గొంటారు.  ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఈశాన్య ప్రాంతాలకు కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ప్రారంభిస్తారు, ఉన్నతి (ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం) ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుంది, కొత్త తయారీ, సేవల యూనిట్లను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉపాధికి ఊతం ఇస్తుంది. ఈ పథకం విలువ రూ. 10,000 కోట్లు, పూర్తిగా భారత ప్రభుత్వంచే నిధులు సమకూరుస్తుంది. మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఈ పథకం మూలధన పెట్టుబడికి ప్రోత్సాహకాలను అందిస్తుంది. 

దాదాపు రూ.825 కోట్లతో నిర్మించిన సెల టన్నెల్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతం. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని బలిపర -చరిదువార్-తవాంగ్ రోడ్‌లోని సెలా పాస్ మీదుగా తవాంగ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీని అందిస్తుంది. ఇది కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ పద్ధతిని ఉపయోగించి నిర్మించారు. అత్యున్నత ప్రమాణాల భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో వేగవంతమైన, మరింత సమర్థవంతమైన రవాణా మార్గాన్ని అందించడమే కాకుండా దేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో సెలా టన్నెల్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 41,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి అంకితం చేసి శంకుస్థాపన చేస్తారు. దిబాంగ్ బహుళార్ధసాధక జలవిద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో రూ.31,875 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు  దేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్ నిర్మాణం కానుంది. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది, వరదల నియంత్రణలో సహాయపడుతుంది. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, సామాజిక ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుంది.

శంకుస్థాపన చేయబోయే ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులలో 'వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్' కింద అనేక రహదారి, పర్యావరణం, పర్యాటక ప్రాజెక్టులు ఉన్నాయి; పాఠశాలలను 50 గోల్డెన్ జూబ్లీ పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం, ఇందులో అత్యాధునిక మౌలిక సదుపాయాల ద్వారా సంపూర్ణ విద్య అందించబడుతుంది; డోనీ-పోలో విమానాశ్రయం నుండి నహర్లాగన్ రైల్వే స్టేషన్ వరకు కనెక్టివిటీని అందించడానికి డబుల్ లేన్ రోడ్డు ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేస్తారు. 

ప్రధాన మంత్రి అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక రహదారి ప్రాజెక్టులతో సహా పలు ముఖ్యమైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు; జల్ జీవన్ మిషన్ సుమారు 1100 ప్రాజెక్ట్‌లు,  యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్ఓఎఫ్) కింద 170 టెలికాం టవర్లు 300 పైగా గ్రామాలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ మరియు గ్రామీణ రెండూ) కింద లబ్ధిదారులకు రూ.450 కోట్లు వ్యయంతో నిర్మించిన 35,000కు పైగా గృహాలను కూడా ప్రధాన మంత్రి అందజేయనున్నారు.

మణిపూర్‌లో రూ. 3400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసే  ముఖ్యమైన ప్రాజెక్టులలో నీలకుతిలో యూనిటీ మాల్ నిర్మాణం; మంత్రిపుఖ్రీ వద్ద మణిపూర్ ఐటీ సెజ్ ప్రాసెసింగ్ జోన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి; ప్రత్యేక మానసిక చికిత్సను అందించడానికి లాంప్‌జెల్‌పట్‌లో 60 పడకల రాష్ట్ర ఆసుపత్రి నిర్మాణం; మణిపూర్ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఇంఫాల్ పశ్చిమ జిల్లా కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి. ప్రధాన మంత్రి మణిపూర్‌లో వివిధ రోడ్డు ప్రాజెక్టులు, అనేక నీటి సరఫరా పథకాలు, ఇతర ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు.

మేఘాలయలో రూ. 290 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసే  ముఖ్యమైన ప్రాజెక్టులలో తురా వద్ద ఐటీ పార్క్ నిర్మాణం; న్యూ షిల్లాంగ్ టౌన్‌షిప్‌లో కొత్త నాలుగు-లేన్ రహదారి నిర్మాణం, ఇప్పటికే ఉన్న రెండు-లేన్‌లను నాలుగు-లేన్‌లుగా మార్చడం. ఎగువ షిల్లాంగ్‌లో రైతుల హాస్టల్-కమ్-ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

సిక్కింలో రూ. 450 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయబోయే ముఖ్యమైన ప్రాజెక్టులలో రంగ్‌పో రైల్వే స్టేషన్‌ను పున: అభివృద్ధి చేయడం, అనేక రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. సిక్కింలోని తార్పు మరియు దారందిన్‌లను కలుపుతూ కొత్త రహదారిని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి 

సిలిగురిలో వికసిత భారత్ వికసిత పశ్చిమ బెంగాల్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోరూ. 4500 కోట్లకు పైగా విలువైన రైలు, రోడ్డు రంగానికి చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, దేశానికి అంకితం చేస్తారు. ఉత్తర బెంగాల్, సమీప ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చే రైలు మార్గాల విద్యుదీకరణ బహుళ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి దేశానికి అంకితం చేస్తారు. ప్రాజెక్టులలో ఏకలఖి - బాలూర్‌ఘాట్ సెక్షన్; బర్సోయ్ - రాధికాపూర్ విభాగం; రాణినగర్ జల్పాయిగురి - హల్దీబారి విభాగం; సిలిగురి - బాగ్‌డోగ్రా మరియు సిలిగురి మీదుగా అలుబారి సెక్షన్ - సివోక్ - అలీపుర్‌దువార్ జంక్షన్ - సముక్తలా (అలిపుర్‌దువార్ జంక్షన్ - న్యూ కూచ్ బెహార్‌తో సహా) విభాగం ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్‌లో రూ.3,100 కోట్ల విలువ చేసే రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు.  ప్రాజెక్టులలో ఎన్హ్ హెచ్ 27 నాలుగు-లేన్ ఘోస్పుకుర్ - ధుప్గురి సెక్షన్, ఎన్హెచ్ 27లో నాలుగు-లేన్ ఇస్లాంపూర్ బైపాస్ ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి

ప్రధాన మంత్రి 42,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, అంకితం, శంకుస్థాపన చేస్తారు. పౌర విమానయాన రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తూ, ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా  9800 కోట్లకు పైగా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. పూణే, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఢిల్లీ, లక్నో, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తి, అడంపూర్ విమానాశ్రయాల్లో 12 కొత్త టెర్మినల్ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. కడప, హుబ్బళ్లి, బెలగావి విమానాశ్రయాల మూడు కొత్త టెర్మినల్ భవనాలకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో 19,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అనేక రహదారి ప్రాజెక్టులకు ప్రధాని జాతికి అంకితం చేస్తారు.  దేశానికి అంకితం చేసే ప్రాజెక్టులలో నాలుగు లేన్ల మూడు ప్యాకేజీలు లక్నో రింగ్ రోడ్, చకేరీ నుండి అలహాబాద్ సెక్షన్ నుండి ఎన్హెచ్-2 వరకు ఆరు లేనింగ్ ఉన్నాయి. ప్రధానమంత్రి రాంపూర్ - రుద్రపూర్ పశ్చిమ వైపు నాలుగు వరుసల కు కూడా శంకుస్థాపన చేస్తారు; 

ఇంకా, ప్రయాగ్‌రాజ్, జౌన్‌పూర్,ఇటావాలో అనేక మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు కొన్నిటిని  అంకితం చేస్తారు.

మహతారీ వందన యోజన

ఛత్తీస్‌గఢ్‌లో మహిళా సాధికారతకు పెద్దపీఠ వేస్తూ, ప్రధానమంత్రి మహతరి వందన యోజన కింద మొదటి విడతను పంపిణీ చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో అర్హులైన వివాహిత మహిళలకు నెలవారీ డీబీటీగా నెలకు రూ.1000 ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారత, వారికి ఆర్థిక భద్రత కల్పించడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడం, కుటుంబంలో మహిళల నిర్ణయాత్మక పాత్రను బలోపేతం చేయడం వంటి అంశాలను ఇది నిర్ధారిస్తుంది.

 

జనవరి 1, 2024 నాటికి 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రాష్ట్రంలోని అర్హులైన వివాహిత మహిళలందరికీ ఈ పథకం ప్రయోజనాలను అందిస్తుంది. వితంతువులు, విడాకులు తీసుకున్న, విడిచిపెట్టిన మహిళలు కూడా ఈ పథకానికి అర్హులు. దాదాపు 70 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

 

***


(Release ID: 2168789)