ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ
నాడు పోస్టు చేయడమైనది:
20 NOV 2024 11:27PM by PIB Hyderabad
‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) ఉద్యమంలో భాగంగా గయానాలోని జార్జ్‌టౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భూమిపై మానవజాతి మనుగడ దీర్ఘకాలంపాటు కొనసాగాలన్న తమ ఉమ్మడి నిబద్ధతను సూచిస్తోందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘మానవజాతి మనుగడ దిశగా ఉమ్మడి నిబద్ధత!
‘ఏక్ పేడ్ మా కే నామ్’ ఉద్యమంలో గయానా అధ్యక్షుడు, నా మిత్రుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ గౌరవ పురస్సరంగా పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఆయన తన అత్తగారినీ, మామ్మగారినీ వెంట తీసుకుని వచ్చి.. ఒక మొక్క నాటి నీరు పోశారు.
@DrMohamedIrfaa1 @presidentaligy”
(రిలీజ్ ఐడి: 2168786)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam