ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్
* ఈ రోజు సరికొత్త వ్యూహాత్మక ఈయూ-ఇండియా అజెండాను ఈయూ ఆమోదించడం పట్ల ప్రధాని హర్షం
* భారత్-ఈయూ ఎఫ్‌టీఏను త్వరితగతిన పూర్తి చేయడానికి, వీలైనంత త్వరగా భారత్‌లో ఇండియా-ఈయూ తదుపరి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించిన నాయకులు
Posted On:
17 SEP 2025 7:18PM by PIB Hyderabad
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు గౌరవ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఫోన్ చేశారు.
ప్రధానమంత్రి మోదీ 75వ జన్మదినం సందర్భంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ రోజు సరికొత్త వ్యూహాత్మక ఈయూ-ఇండియా అజెండాను ఈయూ ఆమోదించడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలుగా.. పరస్పరాభివృద్ధి దిశగా ఇండియా-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడానికి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి, నియమ ఆధారిత పద్ధతిని ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలను నాయకులు స్వాగతించారు.
ఈ ఏడాది చివరి నాటికి ఇండియా-ఈయూ ఎఫ్‌టీఏ సంప్రదింపులను పూర్తి చేయాలనే నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్గాటించారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉక్రెయిన్ సంఘర్షణను త్వరగా, శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ కట్టుబడి ఉంది.
వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే తదుపరి ఇండియా-ఈయూ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ప్రధానమంత్రి మోదీ మరోసారి ఆహ్వానించారు.
***
(Release ID: 2167876)
Visitor Counter : 2