ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని దరంగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 14 SEP 2025 4:01PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైఅస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారుకేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారుఅస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులుపార్లమెంటు సభ్యులుఎమ్మెల్యేలుఇతర ప్రజా ప్రతినిధులువర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.

రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో ఈ చరిత్రాత్మక రోజున దరంగ్ ప్రజలకు.. అస్సాం ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అభినందనలూ తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఆపరేషన్ సిందూర్ తర్వాత నేను నిన్ననే మొదటిసారి అస్సాంకు వచ్చానుమన కామాఖ్య దేవి ఆశీస్సులతో ఆపరేషన్ సిందూర్ అద్భుతమైన విజయాన్ని సాధించిందిఅందుకే ఈ రోజు మన కామాఖ్య దేవి కొలువైన పవిత్ర భూమికి రావడం చాలా దివ్యమైన అనుభవంగా అనిపిస్తుందిఈ ఆనందానికి తోడుగా ఇక్కడ ఈరోజునే జన్మాష్టమి పండుగనూ జరుపుకుంటున్నారుఈ పవిత్ర జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా మంగళ్‌దోయ్ ప్రాంతం సంస్కృతి.. ఘనమైన చరిత్ర.. భవిష్యత్తు పట్ల ఆశల పవిత్ర సంగమంఈ ప్రాంతం అస్సాం గుర్తింపు కోసం కేంద్ర బిందువు కూడానేను ఈ ప్రేరణలను గుర్తు చేసుకున్నాను.. శ్రీకృష్ణుడిని స్మరించాను.. భవిష్యత్ భద్రతా విధానంలో సుదర్శన చక్ర దార్శనికతనూ నేను ప్రజల ముందు ఉంచాను.

మిత్రులారా,

ధైర్యసాహసాలకు నెలవైన ఇక్కడి ప్రజలను కలిసే భాగ్యం నాకు లభించడం నా అదృష్టం.

సోదరీసోదరులారా..

కొద్ది రోజుల కిందటే మనం భారతరత్న సుధాకాంత భూపేన్ హజారికా గారి జయంతిని జరుపుకున్నాంనిన్న ఆయన గౌరవార్థం నిర్వహించిన ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశమూ నాకు లభించిందిఅస్సాంకు చెందిన ఎందరో మహనీయులుమన పూర్వీకులు కలలుగన్న దార్శనికత సాకారం కోసం నేడు బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోంది.

సోదరీసోదరులారా..

నేను నిన్న రాత్రి భూపేన్ దా గారి శతజయంతి కార్యక్రమంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో ఒక విషయం చెప్పారుఈ రోజు ఉదయమే ఆయన నాకు ఒక వీడియోనూ చూపించారుఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగిందికాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనను నాకు చూపించారుభరతమాత ముద్దుబిడ్డ.. అస్సాం రాష్ట్రానికి గర్వకారణం అయిన భూపేన్ దా హజారికా గారికి భారత ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసిన రోజునే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశారుఆ సమయంలో నేను దానిని గమనించలేదుఈ రోజే నేను దానిని చూశాను"మోదీ నృత్యకారులకు... గాయకులకూ భారతరత్న ఇస్తున్నారు." అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు.

మిత్రులారా,

1962లో చైనాతో యుద్ధం తరువాత పండిట్ నెహ్రూ మాట్లాడిన మాటలతో ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు ఇంకా మానలేదుప్రస్తుత తరం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ గాయాలపై ఉప్పు జల్లుతున్నారుసాధారణంగా నన్ను ఎంత తిట్టినా.. నేను శివ భక్తుడిని అయినందువల్ల ఆ విషాన్ని మింగేస్తున్నానుకానీ మరొకరు సిగ్గు లేకుండా అవమానిస్తూ ఉంటే.. నేను మౌనంగా ఉండలేనుభూపేన్ దా గారికి భారతరత్నను ప్రదానం చేయాలనే నా నిర్ణయం సరైనదా కాదా మీరే నాకు చెప్పండిమీ శక్తినంతా కలిపి బిగ్గరగా చెప్పండి.. అది సరైనదా కాదాభూపేన్ దాకు భారతరత్నను ప్రదానం చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేయడం సరైనదేనాఅస్సాం ముద్దుబిడ్డభారత్‌కు చెందిన ఒక మహనీయుడిని కాంగ్రెస్ ఈ విధంగా అవమానించడం ఎంతో బాధను కలిగిస్తోంది.

మిత్రులారా,

కాంగ్రెస్ మొత్తం వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ నా గురించి విమర్శలు చేస్తూ, "మోదీ మళ్ళీ ఏడుపు ప్రారంభించాడుఅని చెబుతుందని నాకు బాగా తెలుసుకానీ నా విషయంలో ప్రజలే నా దేవుళ్ళు.. మరి నా మనసులోని మాట నా దేవుని ముందు బయటకు రాకపోతేఅది మరెక్కడ నుంచి వస్తుందివారే నా యజమానులువారే నా పూజ్యులు.. వారే నన్ను నియంత్రించే రిమోట్ కంట్రోల్నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదుఈ దేశంలోని 140 కోట్ల మంది పౌరులే నన్ను నియంత్రించే రిమోట్ కంట్రోల్కానీ ఆ పార్టీ నేతలకు ఎంత అహంకారం అంటే.. "నామ్‌దార్" (రాజవంశంవ్యక్తి "కామ్‌దార్" (కార్మికుడు)ని కొట్టినప్పుడు ఆ "కామ్‌దార్బాధతో కేకలు వేస్తే వారు అతనిని మరింత హింసించారుపైగా "నీకు ఏడ్చే హక్కు లేదుఒక "కామ్‌దార్అయి ఉండి "నామ్‌దార్ముందు ఎలా ఏడుస్తావు?" అని బెదిరించారుఅలాంటి అహంకారం ప్రజా జీవితానికి సరిపోదుఅస్సాం ప్రజలుదేశ ప్రజలుసంగీత ప్రియులుకళా ప్రియులుభారత ఆత్మకు తమను తాము అంకితం చేసుకునే వారు.. ““మీరు భూపేన్ దాను ఎందుకు అవమానించారు?” అని కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి.

సోదరీసోదరులారా..

అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంసంరక్షించడంఅస్సాం మరింత వేగంగా అభివృద్ధి సాధించేలా కృషి చేయడం ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యంఒక సోదరుడు ఒక పెయింటింగ్ తీసుకువచ్చాడు.. నేను దానిని చూస్తున్నాను.. బహుశా అతను దానిని నాకు ఇవ్వాలనుకుంటున్నారుఎస్‌పీజీ సిబ్బంది దానిని తీసుకురావాలని నేను అభ్యర్థిస్తున్నానుఅతనికి నా అభ్యర్థన ఏమిటంటే.. దయచేసి మీ పేరుచిరునామాను దాని వెనక రాయండినేను కచ్చితంగా మీకు లేఖ రాస్తానుమీరు నా తల్లి చిత్రాన్ని చక్కగా గీశారుఅస్సాం నుంచి పొందిన ఈ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను'గమోసా'తో నిలబడిన యువకుడినీ నేను చూస్తున్నానుదయచేసి దానినీ తీసుకురండినాకు ఇది జన్మాష్టమి రోజున పవిత్రమైన ప్రసాదం లాంటిదిఅస్సాంకు చెందిన ఎవరో పేద తల్లి ఈ 'గమోసా'ను నేసి ఉండాలిసోదరా.. ఈ కానుక తెచ్చినందుకు చాలా ధన్యవాదాలునేను చాలా కృతజ్ఞుడనుదయచేసి దానిని వారికి ఇవ్వండినేను దానిని తీసుకుంటానుఅది కచ్చితంగా నాకు ఎంతో విలువైనదిమరొకటి కూడా ఉందిబహుశా అతను దానిని హిమంత (ముఖ్యమంత్రి)కి ఇవ్వాలనుకుంటున్నాడని అనుకుంటున్నానుదయచేసి దానిని కూడా తీసుకురండిఅది సరైన స్థలానికి చేరుకుంటుందిసోదరా.. ఈ ఆప్యాయతకు ధన్యవాదాలుచూడండీ.. చిన్న పిల్లలు కూడా వారు గీసిన బొమ్మలు తెచ్చారుదయచేసి వాటినీ తీసుకురండిప్రజలు చాలా ప్రేమను కురిపిస్తున్నారుఈ చిన్న పిల్లలు కూడాఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుందిధన్యవాదాలు,.. నా మిత్రులందరికీ ధన్యవాదాలుమీరిద్దరు అన్నదమ్ములాకాదాఓహో మీరిద్దరూ నల్ల టీ-షర్టులే ధరించారుమిత్రులారా.. చాలా ధన్యవాదాలు.

మిత్రులారా,

ఈ రోజు ప్రభుత్వంప్రజల ఉమ్మడి ప్రయత్నాలతో అస్సాం దేశవ్యాప్తంగాప్రపంచవ్యాప్తంగానూ సంచలనాలు సృష్టిస్తోందిఈ కూతురు కూడా నా కోసం ఏదో తెచ్చిందిదయచేసి దానినీ తీసుకురండిఎవరూ ఏ కూతురినీ నిరాశపరచకూడదుధన్యవాదాలుమీరు మీ పేరును దాని వెనక రాశారామీరు మీ పేరును దాని వెనక రాసి ఉంటేదయచేసి మీ చిరునామా కూడా రాయండినేను మీకు లేఖ రాస్తాను.

మిత్రులారా,

నేడు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండగా.. అస్సాం కూడా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారిందిఒకప్పుడు అస్సాం అభివృద్ధిలో వెనకబడిదేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానంగా ముందుకు సాగలేకపోయిందికానీ నేడు అస్సాం దాదాపు 13 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందిమిత్రమా చాలా ధన్యవాదాలు...

మిత్రులారా,

13 శాతం వృద్ధి రేటుఇది చాలా పెద్ద విజయంఇది మీ విజయంఈ రోజు మీరు సాధించిన ఈ విజయం కోసం చప్పట్లు కొట్టండిసాధారణంగా మీరు నా కోసం చాలా చప్పట్లు కొడతారు.. కానీ ఈ రోజు మీ కృషిశ్రమ కోసం నేను చప్పట్లు కొట్టాలనుకుంటున్నానుఈ విజయం అస్సాం ప్రజల అంకితభావం.. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఉమ్మడి కృషి ఫలితంఅస్సాం ప్రజలు ఈ భాగస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నానుఅందుకేహిమంత గారుఅతని బృందం ప్రతి ఎన్నికల్లోనూ అఖండ మద్దతును పొందుతూనే ఉన్నారుఇటీవలి పంచాయతీ ఎన్నికల్లోనూ అస్సాం మాకు చరిత్రాత్మక విజయాన్ని అందించిందిమీ ఆశీర్వాదం మాతో ఉంది.

మిత్రులారా,

భారత అభివృద్ధి ఇంజిన్‌గా అస్సాంను మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందినేటి కార్యక్రమం కూడా ఈ నిబద్ధతలో ఒక భాగంకొద్దిసేపటి కిందట దాదాపు 6,500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాంమా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంను అగ్రశ్రేణి కనెక్టివిటీ గల రాష్ట్రాల్లో ఒకటిగా.. అగ్రశ్రేణి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తోందిఈ ప్రాజెక్టులు ఆ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తాయిదరంగ్ వైద్య కళాశాలఆసుపత్రిహైవేలురింగ్ రోడ్…మీ కోసం మీ అందరికీ అభినందనలు.

మిత్రులారా,

నేడు దేశం మొత్తం ఐక్యంగా 'వికసిత్ భారత్సాధన దిశగా ముందుకు సాగుతోందిముఖ్యంగా యువ మిత్రులారా.. 'వికసిత్ భారత్ఒక కల... ఒక సంకల్పంఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందిమీ పట్లఈశాన్య ప్రాంతం పట్ల నాకు అభిమానంప్రేమగౌరవం ఉండడం వల్ల నేను ఇలా చెప్పడం లేదుదీని వెనక బలమైన కారణాలు ఉండడం వల్లే నేను ఇలా చెబుతున్నానుస్వాతంత్య్రం తర్వాత పశ్చిమదక్షిణ భారతంలో పెద్ద నగరాలుపెద్ద ఆర్థిక వ్యవస్థలుపెద్ద పరిశ్రమలు అన్నీ అభివృద్ధి చెందాయిఈ సమయంలో భారీ జనాభా కలిగిన తూర్పు భారతంలోని విస్తారమైన ప్రాంతం అభివృద్ధి రేసులో వెనకబడిందిఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తోందిఇప్పటికే 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు గడిచిపోయాయికాంగ్రెస్ యుగం నుంచి మనం వింటూనే ఉన్నాం.. "21వ శతాబ్దం వస్తోంది, 21వ శతాబ్దం వస్తోందిఅనిసరే ఈ శతాబ్దంలో నాల్గో వంతు సమయం ఇప్పటికే గడిచిపోయిందిఇప్పుడు ఈ 21వ శతాబ్దం తదుపరి దశ తూర్పుఈశాన్య రాష్ట్రాలదేఇప్పుడు మీ సమయం వచ్చిందిఇది అస్సాం సమయం.. ఈశాన్య ప్రాంత సమయంనా చిన్నారి మిత్రులారా.. ఇప్పుడు సమయం మీ చేతుల్లోనే ఉందిఓహో,, ఇదిగో మరొక పిల్లాడు ఏదో తీసుకువస్తున్నాడుసోదరా.. దయచేసి దాన్ని తీసుకోండిప్రజలకు నా బలహీనత తెలుసు… వారు నా తల్లి చిత్రాలను తీసుకువచ్చినప్పుడు నా హృదయం వాటిని వెంటనే తీసుకోవాలని కోరుకుంటుందివారు నాతో ఉండేవాళ్లే.. దానిని వారికి ఇవ్వండివెనక మీ పేరుచిరునామా రాయండినేను దానిని తీసుకుని మీకు లేఖ రాస్తానుదయచేసి దానిని అతని నుంచి తీసుకొని ఎస్‌పీజీ సిబ్బందికి అందించండి.

మిత్రులారా,

ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే వేగవంతమైన కనెక్టివిటీ చాలా అవసరంఅందుకే మా ప్రభుత్వం ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీపై ప్రధానంగా దృష్టి సారించిందిరోడ్లురైల్వేలువాయుమార్గాల ద్వారా ప్రాంతాల వారీ కనెక్టివిటీనీ, 5జీ ఇంటర్నెట్బ్రాడ్‌బ్యాండ్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీని అభివృద్ధి చేసి మీ జీవితాలకు సౌలభ్యాన్ని అందిస్తూ.. మీ రోజువారీ జీవితాలనువ్యాపార నిర్వహణను సులభతరం చేసిందిఈ కనెక్టివిటీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసింది.. పర్యాటకాన్ని విస్తరించింది.. స్థానిక యువతకు కొత్త ఉద్యోగఉపాధి అవకాశాలను కల్పించింది.

మిత్రులారా,

ఈ భారీ కనెక్టివిటీ ప్రచారం వల్ల అస్సాం ఎంతో ప్రయోజనం పొందిందినేను మీకు ఒక ఉదాహరణ చెబుతానుస్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆరు దశాబ్దాలు ఢిల్లీలో కాంగ్రెస్ పాలనే ఉంది.. దశాబ్దాలుగా అస్సాంలోనూ కాంగ్రెస్ పాలనే ఉందికానీ కాంగ్రెస్ 60-65 సంవత్సరాల్లో బ్రహ్మపుత్రపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందిఆరు దశాబ్దాల్లో కేవలం మూడు వంతెనలుఅప్పుడు మీకు సేవ చేసే అవకాశం మీరు మాకు ఇచ్చారుకేవలం ఒక దశాబ్దంలోనే మా ప్రభుత్వం ఆరు ప్రధాన వంతెనలను నిర్మించిందిఆరు ప్రధాన వంతెనలుఇప్పుడు చెప్పండిఇంత పని పూర్తయినప్పుడు మీరు సంతోషంగా ఉండరామీరు మాకు మీ ఆశీస్సులు ఇవ్వరామీరు మీ ప్రేమను మాపై కురిపించరామీరు సంతోషంగా ఉన్నారాలేదానేను ఇంకా ఎక్కువ పని చేయాలనుకుంటున్నానుమీ ఆశీస్సులు అందిస్తూ ఉండండిఈ రోజుకురువా–నారెంగి వంతెనకు పునాది వేశాంఈ వంతెనతో గౌహతి-దరంగ్ మధ్య దూరం కొద్ది నిమిషాలకు తగ్గిపోతుందిఇది సాధారణ ప్రజల సమయాన్నిడబ్బునూ ఆదా చేస్తుంది.. రవాణాను చౌకగా చేస్తుంది.. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.. ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందిఫలితంగా వస్తువుల ధరలూ తగ్గుతాయి.

మిత్రులారా,

కొత్త రింగ్ రోడ్డు కూడా మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందిదీని నిర్మాణం పూర్తయితే ఎగువ అస్సాం వైపు వెళ్లే వాహనాలు ఇకపై నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదుఈ రింగ్ రోడ్డు జాతీయ రహదారులురాష్ట్ర రహదారులువిమానాశ్రయంరైల్వే స్టేషన్లు, 1 ఇన్‌ల్యాండ్ వాటర్ టెర్మినల్‌ను కలుపుతుందిమరో మాటలో చెప్పాలంటే.. అస్సాంలో మొదటిసారిగా ఎలాంటి ఇబ్బందిలేని బహుముఖ కనెక్టివిటీ కోసం పూర్తిస్థాయి నెట్‌వర్క్ ఏర్పాటు కానుందిఇది బీజేపీ డబుల్-ఇంజన్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా.

మిత్రులారా,

ఈ రోజు కోసం మాత్రమే కాకుండా.. రాబోయే 25-50 సంవత్సరాల అవసరాల కోసం మనం దేశాన్ని సిద్ధం చేస్తున్నాం. 2047లో భారత్ 100 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి మనం 'వికసిత్ భారత్'గా దేశాన్ని అభివృద్ధి చేయాలిమీ కోసంమీ పిల్లల కోసంమన యువత ఉజ్వల భవిత కోసం మనం దీన్ని చేయాలిఈ దిశగా పురోగమిస్తున్న క్రమంలో జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు ఉంటాయని నేను ఎర్రకోట నుంచి ప్రకటించానుఈ రోజు నేను ఈ శుభవార్తతో మీ మధ్యకు వచ్చానుసరిగ్గా నేటి నుంచి రోజుల తర్వాత.. నవరాత్రి మొదటి రోజునే జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గుతాయిఇది అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రయోజనం చేకూరుస్తుందిఅనేక రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా మారుతాయిమేం సిమెంటుపై పన్ను తగ్గించాం.. కాబట్టి ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ఖర్చు అవుతుందిక్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాల కోసం గల అనేక ఖరీదైన మందులు చౌకగా మారతాయిబీమా మరింత సరసమైనదిగా మారుతుందిమోటార్ సైకిళ్ళుకొత్త కార్లు కొనాలనుకునే యువత వాటిని తక్కువ ధరలకే పొందుతారుఈ రోజుల్లో మీరు 60,000 రూపాయలు80,000 రూపాయలులక్ష రూపాయల డిస్కౌంట్లతో ఆటోమొబైల్ కంపెనీల ప్రకటనలను చూస్తూ ఉంటారువారు దాదాపు ప్రతిరోజూ ప్రకటనలు చేస్తున్నారుదీని అర్థం ఈ నిర్ణయంతో మాతృమూర్తులుసోదరీమణులుయువతరైతులుదుకాణదారులూ అందరికీ ప్రయోజనం చేకూరుతుందిఈ నిర్ణయం మీ పండుగలకు మరింత సంతోషాన్ని జోడిస్తుంది.

మిత్రులారా,

కానీ ఈ పండుగల సమయంలో మీరంతా ఒక విషయం గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నానునేను చెప్పవచ్చానేను చెప్పాలామీరు వింటారామీరంతా చేతులు పైకెత్తి నాకు చెప్పండి.. నేను చెప్పాలామీరు దానిని పాటిస్తారాసోదరా దయచేసి కూర్చోండి.. ధన్యవాదాలుఅతన్ని ఇబ్బంది పెట్టవద్దుఅతను శారీరకంగా అనారోగ్యంతో ఉన్నాడని నేను అనుకుంటున్నానుదయచేసి అతన్ని నెట్టవద్దుమేం అతని నుంచి దానిని తీసుకుంటాంకెమెరామెన్.. దయచేసి అతని లేఖను తీసుకోండిసోదరా చింతించకుకూర్చోఅతన్ని అసౌకర్యానికి గురి చేయవద్దుసోదరా.. నేను మీకు నమస్కరిస్తున్నానుదయచేసి అతన్ని ఇబ్బంది పెట్టవద్దుఇది నాకు సరైనది కాదుమీరు ఇంత బాధలో కూడా ఇక్కడికి వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞుడను.

మిత్రులారా,

ఇప్పుడు మళ్ళీ మీ చేతులు పైకెత్తి నాకు చెప్పండి.. నేను చెప్పేది మీరు పాటిస్తారాఇలా కాదుఅందరి చేతులు పైకి ఉండాలిమీరు పాటిస్తారానాకు హామీ ఇవ్వండిమిత్రులారా దీనిని పాటించండిమన దేశం ముందుకు సాగుతుందినేను ఇది నా కోసం కాదు.. దేశం కోసం అడుగుతున్నానునేను మీ పిల్లల ఉజ్వల భవిత కోసం అడుగుతున్నానునేను మీకు చెబుతున్నాను.. ఇప్పటి నుంచి మీరు ఏ వస్తువు కొన్నా అది స్వదేశీ వస్తువై ఉంటుందని మీరు నాకు హామీ ఇవ్వండిమీరు స్వదేశీని కొంటారామీరు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కొంటారాస్వదేశీకి నేను ఇచ్చే నిర్వచనం చాలా సులభంకంపెనీ ఏ దేశం నుంచి వచ్చినా.. దానికి ఏ విదేశీ పేరు ఉన్నా.. అది భారత్‌లో తయారైతే అది స్వదేశీ అవుతుందిడబ్బు ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రావచ్చు.. కానీ నా దేశ యువత చెమట చిందించినదై ఉండాలిప్రతి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి భారత మట్టి సువాసనను కలిగి ఉండాలిమీరు అలాంటి వస్తువులను కొంటారామీ చేతులు పైకెత్తి స్వదేశీ ఉత్పత్తులనే కొంటామని చెప్పండిమీరు ఎవరికైనా కానుకలు ఇవ్వవలసి వస్తేఅది స్వదేశీ వస్తువై ఉంటుందాదుకాణదారులంతా దయచేసి మీ దుకాణంలో ఒక బోర్డు పెట్టాలని నేను అభ్యర్థిస్తున్నానుమీరు చేస్తారామీ గ్రామంలోని ప్రతి దుకాణంలో బోర్డు పెట్టండి.. "ఇది స్వదేశీ అని గర్వంగా చెప్పండి."

స్వదేశీ శక్తి ఏమిటో నేను మీకు చెప్తానుదాదాపు 50 సంవత్సరాల కిందట నేను కొంతకాలం కన్యాకుమారిలో ఉన్నానునేను ఎల్లప్పుడూ నాతో ఒక 'గమోసాఉంచుకుంటానునా బ్యాగులో ఎప్పుడూ మూడు లేదా నాలుగు 'గమోసా'లు ఉంటాయినేను కన్యాకుమారిలో నా భుజంపై 'గమోసా'తో తిరుగుతున్నానుకొంతమంది దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పలకరించారువారు "నువ్వు అస్సాం నుంచి వచ్చావా?" అని అడిగారు"లేదునేను గుజరాత్ నుంచి వచ్చానుఅని చెప్పాను"కానీ మేం 'గమోసా'ను చూశాంఅందుకే మీరు అస్సాం నుంచి వచ్చారని మేం అనుకున్నాం." అని వారు నాతో అన్నారుఅది నేలకున్న శక్తిస్వదేశీ శక్తినాకు అక్కడ గుర్తింపు లేదుకానీ ఆ రోజు నేను 'గమోసాధరించినందున అస్సాం ప్రజలు నాపై ప్రేమను చూపించారుమిత్రులారాఇది మన సంప్రదాయాల శక్తిఅందుకే నాకు వాగ్దానం చేయమని అడుగుతున్నానుమనం స్వదేశీనే కొనుగోలు చేద్దాంమనం స్థానికతకు అనుకూలంగా గళం వినిపిద్దాంస్థానిక ఉత్పత్తుల కోసం మన సమష్టి ప్రయత్నాలు మన దేశాన్ని బలోపేతం చేస్తాయి.

మిత్రులారా,

గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అపారమైన అభివృద్ధి జరిగిన మరో రంగం ఆరోగ్య సంరక్షణగతంలో ఆసుపత్రులు ప్రధానంగా పెద్ద నగరాల్లోనే ఉండేవి.. అక్కడ చికిత్స చాలా ఖరీదైనదిమన ప్రభుత్వం ఎయిమ్స్వైద్య కళాశాలల నెట్‌వర్క్‌ను దేశంలోని ప్రతి మూలకూ విస్తరించిందిదయచేసి కూర్చోండి సోదరా... నా ప్రసంగాన్ని కొనసాగిస్తానుదయచేసి కూర్చోండి... దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టకండికెమెరామెన్.. అతని నుంచి లేఖ తీసుకోండిమీరు నా దివ్యాంగులైన సోదరులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారుమిత్రమా.. ధన్యవాదాలుఇక్కడ అస్సాంలో క్యాన్సర్ ఆసుపత్రుల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారుగత 11 సంవత్సరాల్లో దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపయ్యిందిఅంటే స్వాతంత్య్రం తర్వాత 60-65 సంవత్సరాల్లో నిర్మించినన్ని వైద్య కళాశాలలు కేవలం 11 ఏళ్లలోనే మేం నిర్మించాంఒక్కసారి ఆలోచించండి.. వారికి 60-70 సంవత్సరాలు పట్టిందిమేం కేవలం 10-11 సంవత్సరాల్లో చేసాంనా మిత్రులారాఅస్సాంలో కూడా 2014కి ముందు కేవలం వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవిఇప్పుడు దరంగ్‌లోని కొత్త వైద్య కళాశాలతో.. 24 వైద్య కళాశాలలు ఉన్నాయిఒక వైద్య కళాశాల నిర్మించినప్పుడు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రావడమే కాకుండా.. అనేక మంది యువతకు వైద్యులయ్యే అవకాశం కూడా లభిస్తుందని మీ అందరికీ తెలుసుగతంలో మన యువత చాలా మంది వైద్య సీట్ల కొరత కారణంగా వైద్యులు కాలేకపోయారుగత 11 సంవత్సరాల్లోవైద్య సీట్ల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందిఇది మాత్రమే కాదు.. మేం మరో లక్ష్యాన్నీ నిర్దేశించుకున్నాంరాబోయే 4-5 సంవత్సరాల్లో లక్ష కొత్త వైద్య సీట్లను జోడించబోతున్నాంఅంటే లక్ష మంది కొత్త వైద్యులు తయారవుతారు.

మిత్రులారా,

మా పనితీరు ఇలా ఉంటుంది. 3 కోట్ల మందిని "లక్పతీ దీదీలు"గా మార్చడం కోసం కృషి చేస్తున్నట్లుగానే.. 1 లక్ష మంది కొత్త వైద్యులను తయారుచేసేందుకూ మేం కృషి చేస్తున్నాం.

మిత్రులారా,

అస్సాం దేశభక్తుల భూమివిదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించడంలో.. స్వాతంత్య్ర పోరాట త్యాగాల్లో అస్సాం పాత్ర కీలకంపత్రుఘాట్ రైతుల సత్యాగ్రహాన్ని ఎవరు మరచిపోగలరుఆ చరిత్రాత్మక ప్రదేశం ఇక్కడికి ఎంతో దూరంలో లేదుఈ రోజు నేను ఈ త్యాగాల పవిత్ర భూమిపై నిలబడి ఉన్నప్పుడు.. కాంగ్రెస్ మరో దుష్ప్రవర్తన గురించి చెప్పాల్సిన అవసరం ఉందితన స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ భారత వ్యతిరేక శక్తులకుఅలాంటి భావజాలాలకూ అండగా నిలుస్తుందిఆపరేషన్ సిందూర్ సమయంలో మనం దీనిని మరోసారి చూశాంకాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఉగ్రవాదం కారణంగా దేశమంతా రక్తపాతం ఉండేది.. అయినా కాంగ్రెస్ మౌనంగా చూస్తూనే ఉందినేడు మన సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తోంది.. పాకిస్తాన్‌లోని ప్రతి మూల నుంచి ఉగ్రవాద సూత్రధారులను నిర్మూలిస్తోందికానీ మన సైన్యంతో నిలబడటానికి బదులుగా.. కాంగ్రెస్ పాకిస్తాన్ సైన్యం వైపు ఉందిమన సైనికులకు మద్దతు ఇవ్వడానికి బదులుగా.. కాంగ్రెస్ నాయకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న వారి ఎజెండాను ప్రోత్సహిస్తున్నారుపాకిస్తాన్ అబద్ధాలు కాంగ్రెస్ ఎజెండాగా మారుతాయిఅందుకేమీరు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిత్రులారా,

తన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాంగ్రెస్‌కు అత్యంత ప్రాధాన్యంకాంగ్రెస్ ఎప్పుడూ జాతి ప్రయోజనాలను పట్టించుకోదునేడు కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకుచొరబాటుదారులకు పెద్ద రక్షకుడిగా మారిందికాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చొరబాట్లను ప్రోత్సహించిందినేడు ఆ చొరబాటుదారులు భారత్‌లో శాశ్వతంగా స్థిరపడి దేశ భవిష్యత్తును నిర్ణయించాలని కాంగ్రెస్ కోరుకుంటోందిఒకప్పుడుఅక్రమ చొరబాటుల నుంచి అస్సాం గుర్తింపును రక్షించడానికి మంగళ్‌దోయ్ ఒక భారీ ఉద్యమాన్ని నిర్వహించిందికానీ మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని కోసం మిమ్మల్ని శిక్షించిందివారు మీపై ప్రతీకారం తీర్చుకున్నారుకాంగ్రెస్ ఇక్కడి భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి అనుమతించిందిమన ప్రార్థనా స్థలాలనుమన రైతులగిరిజన ప్రజల భూములనూ లాక్కున్నారుబీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను సరిదిద్దుతోందిఅక్రమ ఆక్రమణలు తొలగిస్తున్నారుహిమంత గారి నాయకత్వంలో అస్సాంలోని లక్షలాది బిఘాల భూమిని చొరబాటుదారుల నుంచి విముక్తి చేశారుదరంగ్ జిల్లాలో అనేక భూములను ఆక్రమణల నుంచి తొలగించారుగరుఖుతి ప్రాంతంలో కూడా.. కాంగ్రెస్ హయాంలో ఆక్రమణలు జరిగాయిఆ భూమిని ఇప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుని రైతుల కోసం గరుఖుతి వ్యవసాయ ప్రాజెక్టు నిర్మిస్తున్నారుఅక్కడి యువత ఇప్పుడు "వ్యవసాయ సైనికులు"గా పనిచేస్తున్నారుఆవాలుమొక్కజొన్నమినుములునువ్వులుగుమ్మడికాయల నుంచి ప్రతి పంట అక్కడ సాగవుతోందిమరో మాటలో చెప్పాలంటే.. ఒకప్పుడు చొరబాటుదారుల నియంత్రణలో ఉన్న భూమి నేడు అస్సాంలో వ్యవసాయ అభివృద్ధికి నూతన కేంద్రంగా మారింది.

మిత్రులారా,

చొరబాటుదారులు దేశ వనరులను ఆక్రమించుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించదుభారత రైతులుయువతగిరిజన ప్రజల హక్కులను ఎవరూ లాక్కోలేరుఈ చొరబాటుదారులు మన తల్లులుసోదరీమణులుకుమార్తెలపై దారుణాలకు పాల్పడతారు.. దానినీ మేం అనుమతించంసరిహద్దు ప్రాంతాల జనాభాను మార్చడానికి చొరబాటుదారుల ద్వారా కుట్రలు జరుగుతున్నాయిఇది జాతీయ భద్రతకు పెను ముప్పుఅందుకే దేశంలో ఇప్పుడు జన గణన మిషన్ ప్రారంభిస్తున్నాంచొరబాటుదారుల నుంచి దేశాన్ని రక్షించడందేశానికి చొరబాటుదారుల నుంచి మిముక్తి కలిగించడం బీజేపీ లక్ష్యంఆ రాజకీయ నాయకులకు నేను చెప్పేదేమిటంటే.. మీరు సవాలు చేస్తూ రంగంలోకి దిగితేనేను ఆ సవాలును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానురాసిపెట్టుకోండి.. చొరబాటుదారులను రక్షించడానికి మీరు ఎంత శక్తిని ఉపయోగిస్తారోఆ చొరబాటుదారులను తిప్పి పంపేందుకు మేం ఎంతగా కృషి చేస్తామో చూద్దాంపోటీ జరగనివ్వండిచొరబాటుదారులను రక్షించడానికి వచ్చిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదునా మాటలను గమనించండి.. ఈ దేశం వారిని క్షమించదు.

మిత్రులారా,

అస్సాం వారసత్వాన్ని కాపాడటానికి.. అస్సాం అభివృద్ధిని వేగవంతం చేయడానికి మనం కలిసి పనిచేయాలిఅస్సాంఈశాన్య ప్రాంతాలను 'వికసిత్ భారత్ప్రయాణం కోసం వృద్ధి ఇంజిన్‌గా మార్చాలిఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభ సందర్భంగా మీ అందరికీ విజయం లభించాలని కోరుకుంటున్నానునాతో పాటు మీరంతా చెప్పండిభారత్ మాతా కీ జైరెండు చేతులూ పైకెత్తి.. పూర్తి శక్తితో మీ స్వరం వినిపించండి.. భారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైచాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 2166983) Visitor Counter : 2