ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచిన మీనాక్షిని అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
14 SEP 2025 7:39PM by PIB Hyderabad
లివర్ పూల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో అద్భుతమైన విజయం సాధించిన భారత బాక్సర్ మీనాక్షిని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
'ఎక్స్' లో పోస్టు చేసిన సందేశంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"లివర్ పూల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో మీనాక్షి కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గర్వంగా ఉంది! 48 కిలోల విభాగంలో దేశానికి ఆమె స్వర్ణాన్ని తీసుకువచ్చింది. ఆమె విజయం, దృఢ సంకల్పం భారత అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను".
(Release ID: 2166901)
Read this release in:
Tamil
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam