హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాల వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్) అధిపతుల 2వ జాతీయ సమావేశాన్ని ప్రారంభించనున్న కేంద్ర హోం మంత్రి


సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొననున్న

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్ అధిపతులు


మాదకద్రవ్య రహిత భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి నిబద్ధతను

బలోపేతం చేసేందుకు, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను

తయారు చేసేందుకు వ్యూహాత్మక వేదికగా ఉపయోగపడనున్న సమావేశం


"సంయుక్త సంకల్పం, ఉమ్మడి బాధ్యత" అనే ఇతివృత్తంతో

సమావేశాన్ని నిర్వహిస్తోన్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ)


మాదకద్రవ్యాల సరఫరా, డిమాండ్ తగ్గింపు, జాతీయ భద్రతా సమస్యలతో సహా

ముప్పును తగ్గించటంలో ఉన్న వివిధ కోణాలపై చర్చించనున్న రెండు రోజుల సదస్సు


చీకటి ప్రయోగశాలలు... పారిపోయిన నేరగాళ్లను పట్టుకోవడం, డార్క్ వెబ్ ద్వారా

అక్రమ మానవ రవాణా... ప్రభుత్వం ముందున్న ప్రధాన సమ్యలు ఇవే..

Posted On: 13 SEP 2025 6:03PM by PIB Hyderabad

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యాంటీ నార్కొటిక్ టాస్క్‌ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్అధిపతుల 2వ జాతీయ సమావేశాన్ని కేంద్ర హోంసహకార మంత్రి శ్రీ అమిత్ షా 2025 సెప్టెంబర్ 16 మంగళవారం నాడు ఢిల్లీలో ప్రారంభించనున్నారుమాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీవార్షిక నివేదిక- 2024ను కూడా ఆయన విడుదల చేస్తారుఆన్‌లైన్‌లో నిర్వహించనున్న మాదకద్రవ్య నిర్మూలన ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారుసెప్టెంబర్ 16, 17 లలో జరగనున్న ఈ సమావేశానికి 36 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ఏఎన్‌టీఎఫ్ అధిపతులుఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు కూడా హాజరవుతారు.

 

మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని తయారు చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిబద్ధతను బలోపేతం చేసేందుకుఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఒక వ్యూహాత్మక వేదికగా ఈ సమావేశం ఉపయోగపడనుంది. "సంయుక్త సంకల్పంఉమ్మడి బాధ్యతఅనే ఇతివృత్తంతో మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందిదేశంలో మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడంలో సంబంధిత అధికారులుఇతర భాగస్వాములు చేసిన సమష్టి కృషిని సమీక్షించటంతో పాటు ఆయా చర్యలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారుదీనితో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారుమాదకద్రవ్యాల సరఫరాడిమాండ్ తగ్గింపుమాదక ద్రవ్యాల ప్రతికూల ప్రభావం.. అవి జాతీయ భద్రతకు విసిరే సవాళ్లలో ఉన్న వివిధ కోణాలు.. మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టాల అమలును బలోపేతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం వివరణాత్మకంగా చర్చిస్తారుమాదకద్రవ్యాల ముప్పును పరిష్కరించేందుకు పూర్తి ప్రభుత్వం పనిచేసే విధానం అవసరంపై కూడా సమావేశం దృష్టి సారిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో ఆరు సాంకేతిక సమావేశాలు వరుసగా నిర్వహించనున్నారుఅవి:-

 

I. 2047 నాటికి మాదక ద్రవ్యాల రహిత భారత్ ఏకోన్ముఖ ప్రభుత్వంగా పనిచేయడం

 

II. అమూలాగ్ర నేర పరిశోధనపై నుండి కిందికికింది నుంచి పైకి నేర పరిశోధన.

 

III. తప్పించుకొని తిరుగుతున్న వారిని గుర్తించడంవిదేశీ నేరస్థుల విషయంలో వ్యూహాత్మక విధానాలు.

 

IV. మాదకద్రవ్యాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలుసింథటిక్ మాదకద్రవ్యాలుచీకటి ప్రయోగశాలలు.

 

V. డార్క్ వెబ్క్రిప్టో‌కు సంబంధించిన దర్యాప్తు

 

VI. ప్రపంచ వ్యాప్త మానవ అక్రమ రవాణాలో బహుముఖ వ్యూహాలు.

 

వివిధ భాగస్వాముల సామర్థ్యాలను ఆధారంగా తయారు చేసిన వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ చర్చలు కార్యాచరణను అందిస్తాయన్న అంచనా ఉందిమాదకద్రవ్యాల దుర్వినియోగంమానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సాంకేతికతనిఘాప్రజల భాగస్వామ్యాన్ని ఏకీకృతం చేస్తూ భవిష్యత్తుకు సన్నద్ధంగా ఉండే భాగస్వామ్యం ఏర్పడుతుందని ఎన్‌సీబీమాదకద్రవ్యాల నిరోధక టాస్క్‌ఫోర్స్‌ కి చెందిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల విభాగాలు భావిస్తున్నాయి.

 

మోదీ ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా క్షమకు ఆస్కారంలేని విధానాన్ని అవలంబిస్తోందికేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా 2021లో అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక మాదకద్రవ్యాల వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారుఏప్రిల్ 2023లో అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్‌టీఎఫ్ అధిపతుల మొదటి జాతీయ సమావేశం జరిగింది.

 

***


(Release ID: 2166439) Visitor Counter : 5