ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 12 SEP 2025 9:44PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారుసాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారువిద్యావేత్తలుసోదరీసోదరులారా!

 

భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్‌ భవన్‌ సాక్ష్యంగా నిలుస్తోంది. కొద్ది రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం ప్రకటన చేసినప్పటికీ.. స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సును మనం నిర్వహించుకోవడం నిజంగా అద్భుతమైన విషయంఅంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా మనం ప్రారంభించుకున్నాంఇది ప్రభుత్వ కార్యక్రమమో.. విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమమో కాదుభారతీయ సంస్కృతి-సాహిత్యంచైతన్య గళంగా ఈ జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందివేల తరాల ఆలోచనలుచింతనలుదేశంలోని గొప్ప రుషులుపండితుల జ్ఞానంపరిశోధనమన జ్ఞాన సంప్రదాయాలుమన శాస్త్రీయ వారసత్వం అన్నింటినీ జ్ఞాన భారతం మిషన్ ద్వారా డిజిటలైజ్ చేయబోతున్నాంఈ మిషన్ కోసం దేశవాసులందరికీ నా అభినందనలుజ్ఞాన భారతం బృందానికిసాంస్కృతిక మంత్రిత్వ శాఖకు కూడా నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఒక ప్రాచీన రాతప్రతిని పరిశీలించడమంటే గడిచిన కాలంలోకి ప్రయాణించడం వంటిదే. గతం-వర్తమానంలోని పరిస్థితుల మధ్య వ్యత్యాసం అపారంనేడు కీబోర్డులో ఉండే తొలగింపుదిద్దుబాటు వంటి సౌలభ్యాల ద్వారా విస్తృతంగా రాయగలంఒకే పేజీని ప్రింటర్ల సహాయంతో వేల కాపీలు కూడా తీయగలంఅదే శతాబ్దాల కిందటి ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండినాడు ఆధునిక భౌతిక సదుపాయాలు లేనందువల్ల మన పూర్వికులు మేధస్సు సంబంధిత వనరులపైనే ఆధారపడాల్సి వచ్చేదిప్రతి అక్షరాన్నీ అత్యంత శ్రద్ధతో రాయాల్సి ఉండేదిఆ లెక్కన ఒక గ్రంథం పూర్తి చేయాలంటే వారు ఎంత కఠినమైన శ్రమ చేసేవారో అర్థం చేసుకోవచ్చుఅయినప్పటికీ ప్రాచీన కాలంలోనూ భారతీయులు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా వెలుగొందిన గొప్ప గ్రంథాలయాలను నిర్మించారుప్రపంచంలో ఇప్పటికీ అత్యధిక రాతప్రతులు గల దేశం భారత్‌ మాత్రమేమన వద్ద నేడు దాదాపు కోటి రాతప్రతులు ఉన్నాయిఇది చిన్న సంఖ్య కాదు.

మిత్రులారా, 

క్రూరమైన చారిత్రక ఆటుపోట్ల ఫలితంగా లక్షలాది రాతప్రతులు నాశనం కావడంతోపాటు అదృశ్యమయ్యాయి. అయినప్పటికీ జ్ఞానం.. విజ్ఞానం.. అధ్యయనంపై మన పూర్వికుల అంకితభావానికి మన వద్ద మిగిలిన రాతప్రతులే తార్కాణాలుగ్రంథ రచనలో వాడిన భూర్జ పత్రాలుతాటి ఆకుల దుర్బలత్వంతోపాటు.. రాగి రేకులపై రాసినా లోహ క్షయం ముప్పు వంటివి పెనుసవాళ్లుగా ఉండేవిమన పూర్వికులు అక్షరాన్ని దైవంగా పరిగణించిగౌరవించారు. ‘అక్షర బ్రహ్మ భవ’ స్ఫూర్తితో ఆ సరస్వతీ మాతను ఆరాధారించారుఆ గ్రంథాల విలువను గుర్తించిన కుటుంబాలు తరతరాలుగా నాటి రాతప్రతులను జాగ్రత్తగా సంరక్షిస్తూ వస్తున్నాయిమనకు వారసత్వంగా సంక్రమించిన జ్ఞానంపై గల అపార గౌరవానికి ఇదే నిదర్శనంఈ స్ఫూర్తితో మన సామాజిక బాధ్యతను గుర్తించడంతోపాటు భావితరాలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందిదేశం పట్ల అంకితభావంలో నిబద్ధతకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరేదీ ఉండదు.

మిత్రులారా, 

భారత జ్ఞాన సంప్రదాయం ‘పరిరక్షణ, ఆవిష్కరణసంకలనంఅనుసరణ’ అనే నాలుగు మూలస్తంభాలు ఆధారంగా నేటికీ సుసంపన్నంగా విలసిల్లుతోంది.

మిత్రులారా, 

ఈ నాలుగు స్తంభాల్లో మొదటిదైన పరిరక్షణ గురించి చెప్పాలంటే.. అత్యంత ప్రాచీన గ్రంథాలైన మన వేదాలు భారతీయ సంస్కృతికి పునాదిగా ఉన్నాయివేదాలు అత్యున్నతమైనవిఆ కాలంలో వేదాలను ‘శ్రుతి’ ప్రాతిపదికన తదుపరి తరానికి అందించారుఆ విధంగా వేల ఏళ్ల నుంచీ సంపూర్ణ ప్రామాణికతతో దోషరహితంగా వేదాలను పరిరక్షించారుఇక రెండో స్తంభమైన ఆవిష్కరణ విషయానికొస్తే.. ఆయుర్వేదవాస్తుజ్యోతిషలోహ శాస్త్రాల్లో భారత్‌ నిరంతర ఆవిష్కరణలు చేస్తూనే ఉందిప్రతి తరం ఇలా మునుపటి తరంకన్నా మరింత ముందుకు సాగుతూ.. ప్రాచీన జ్ఞానాన్ని మరింత శాస్త్రీయంగా రూపుదిద్దింది. ‘సౌర సిద్ధాంతం’, ‘వరాహమిహిర సంహిత’ వంటి గ్రంథాలు పండితుల నిరంతర కృషికిసరికొత్త జ్ఞానాన్ని జోడించడానికి చక్కటి ఉదాహరణలుమూడో స్తంభమైన సంకలనం గురించి చూస్తే.. ప్రతి తరం పురాతన విజ్ఞాన పరిరక్షణ సహా కొత్త ఆలోచనా దృక్పథాన్ని జోడిస్తూ వచ్చిందివాల్మీకి రామాయణ రచనానంతరం అనేక మంది రామాయణ రచన చేయడమే దీనికి మంచి ఉదాహరణఈ సంప్రదాయం నుంచి ‘రామచరితమానస్’ వంటి గ్రంథాలు మనకు లభించాయిఅలాగే వేదాలుఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు వెలువడ్డాయిమరోవైపు భారత ఆధ్యాత్మిక ఆచార్యులు ద్వైతంఅద్వైతం వంటి బోధనలు మనకు అందించారు.

మిత్రులారా, 

ఇదేవిధంగా, నాలుగో మూలస్తంభం అనుసరణకాలక్రమంలో భారత్‌ ఆత్మపరిశీలన చేసుకుంటూ తన జ్ఞానానికి అవసరమైన మార్పుచేర్పులు చేసిందిమనం చర్చలకు ప్రాధాన్యమిస్తూశాస్త్రార్థ సంప్రదాయాన్ని కొనసాగించాంసమాజం కాలం చెల్లిన ఆలోచన దృక్పథానికి స్వస్తి చెప్పి కొత్త దృక్కోణాలను స్వీకరించిందిమధ్యయుగాల్లో వివిధ సామాజిక దురాచారాలు తలెత్తినపుడు సంఘసంస్కర్తలు ఉద్భవించి సమాజాన్ని చైతన్యం చేశారువారసత్వాన్ని పరిరక్షించారు.

మిత్రులారా, 

జాతీయతపై ఆధునిక భావనలకు భిన్నంగా భారతదేశానికి తనదైన విశిష్ట సాంస్కృతిక గుర్తింపు, చైతన్యంజవజీవాలున్నాయిమన దేశ చరిత్ర కేవలం రాజవంశాల గెలుపోటముల జాబితాకు పరిమితం కాలేదుకాలక్రమంలో రాజ్యాలురాచరికాల భౌగోళిక స్వరూపం మారినా భారతదేశం మాత్రం హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా చెక్కుచెదరకుండా నిలిచిందిభారత్‌ అంటేనేఆలోచనలుఆదర్శాలువిలువలతో కూడిన నిరంతర సజీవ స్రవంతిఈ నాగరకత నిరంతర పయనాన్ని భారత ప్రాచీన రాతప్రతులు ప్రతిబింబిస్తాయిభిన్నత్వంలో ఏకత్వాన్ని కూడా ఇవి స్పష్టం చేస్తాయిదేశవ్యాప్తంగా దాదాపు 80 భాషల్లో రాతప్రతులు ఉన్నాయిభారత విస్తృత జ్ఞాన సంద్రంలోని సంస్కృతప్రాకృతఅస్సామీబెంగాలీకన్నడకాశ్మీరీకొంకణిమైథిలిమలయాళంమరాఠీ వంటి పలు భాషల్లో అనేక పరిరక్షిత గ్రంథాలున్నాయిగిల్గిట్ రాతప్రతులు కాశ్మీర్‌పై ప్రామాణిక రీతిలో చారిత్రక అవగాహన కల్పిస్తాయికౌటిల్యుడి అర్థశాస్త్రం రాతప్రతి భారత రాజకీయ-ఆర్థిక శాస్త్రాలపై లోతైన అవలోకనానికి వీలు కల్పిస్తుందిఆచార్య భద్రబాహు రచించిన ‘కల్పసూత్ర’ రాతప్రతి జైనమత ప్రాచీన జ్ఞాన పరిరక్షణకు తోడ్పడిందిసారనాథ్ రాతప్రతులు బుద్ధుని ప్రబోధాలను వివరిస్తాయి. ‘రసమంజరిగీతా గోవిందం’ వంటి రాతప్రతులు భక్తిసౌందర్యంసాహిత్యం వంటి విభిన్న వన్నెల పరిరక్షణకు చిహ్నాలు.

మిత్రులారా, 

భారత రాతప్రతులు యావత్‌ మానవాళి ప్రగతి పయనానికి ప్రతిబింబాలు. ఇవి భారతీయ తత్త్వవిజ్ఞానశాస్త్ర భాండాగారాలువైద్యంఅధిభౌతిక శాస్త్రం సహా కళాఖగోళవాస్తు శిల్ప జ్ఞానాన్ని కూడా అవి పరిరక్షించాయిగణితం నుంచి ద్విసంఖ్యామానం ఆధారిత కంప్యూటర్ సైన్స్ వరకూ ఆధునిక శాస్త్ర పునాది సున్నా భావనపైనే ఆధారపడిందిఇందుకు అనేకానేక ఉదాహరణలున్నాయిసున్నా భారత ఆవిష్కరణేసున్నాతోపాటు ప్రాచీన గణిత సూత్ర వినియోగానికి బక్షాలి రాతప్రతుల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయిఇక యశోమిత్ర బోవర్ రాతప్రతులు శతాబ్దాల నాటి వైద్యశాస్త్రంపై అవగాహన కలిగిస్తాయిచరక సంహితశుశ్రుత సంహిత వంటి గ్రంథాల రాతప్రతులు ఆయుర్వేద విజ్ఞానాన్ని నేటికీ పరిరక్షిస్తున్నాయిశుల్వ లేదా శుల్బ సూత్రం పురాతన రేఖాగణిత జ్ఞానాన్ని అందించగాసంప్రదాయ వ్యవసాయ జ్ఞానం కృషి పరాశరం నుంచి మనకు సంక్రమించిందిమరోవైపు మానవ భావోద్వేగ పురోగమనాన్ని అర్థం చేసుకోవడంలో నాట్య శాస్త్ర రాతప్రతులు ఎంతగానో తోడ్పడతాయి.

మిత్రులారా, 

ప్రతి దేశం తమ చారిత్రక సంపదను వారి నాగరికత గొప్పదనానికి సంకేతంగా ప్రపంచానికి ప్రదర్శిస్తుంది. వారు కనీసం ఒక రాతప్రతిని లేదా కళాఖండాన్ని జాతీయ సంపదగా పరిగణించి భద్రపరుస్తారుమన దేశ రాతప్రతుల సంపద అపారమైనదిఇవి జాతీయ ప్రతిష్టకు నిదర్శనంకువైట్‌ పర్యటనలో నేను 4-6 మంది ప్రభావశీలురను కలవాలనుకున్నానుసమయం దొరికితే కొంత సమయం వారితో మాట్లాడాలని భావించానువారి ఆలోచనలను అర్థం చేసుకోవాలని అనుకున్నానుఅక్కడ నేను ఒక వ్యక్తిని కలిశానుభారత ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాలను వివరించే చారిత్రక పత్రాలను ఆయన పెద్ద సంఖ్యలో సేకరించి భద్రపరిచారుశతాబ్దాల కిందటే భారత సముద్ర వాణిజ్యం నిర్వహించిన తీరును వివరించే సరంజామాతో ఆయన సగర్వంగా నన్ను కలిశారుప్రపంచ దేశాలతో భారత్‌ ప్రగాఢ స్నేహ సంబంధాలనుసరిహద్దుల వెంబడి మన దేశానికి గల గౌరవాన్ని ఇలాంటి రాతప్రతులు ప్రతిబింబిస్తాయిచెల్లాచెదరుగాగల ఈ సంపదను విస్తృత జాతీయ కృషితో పరిరక్షించిసమగ్రం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందిఇటువంటి రికార్డులు ఎప్పుడు... ఎక్కడ దొరికినా కూడా భారత నాగరికత వారసత్వంలో భాగంగా వాటిని పరిరక్షించిడిజిటలీకరణ ద్వారా పదిలం చేసుకోవాలిభారత్‌ ప్రపంచ విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో మన దేశాన్ని స్వీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణగౌరవాన్ని పదిలం చేసుకోగల సముచిత ప్రదేశంగా అనేక దేశాలు పరిగణిస్తున్నాయిలోగడ అపహరణకు గురై తమ దేశాలకు చేరిన కొన్ని భారతీయ విగ్రహాలను మాత్రమే వారు తిరిగి ఇచ్చారుఇప్పుడు వందలాది ప్రాచీన విగ్రహాలను ఆయా దేశాలు మనకు తిరిగి ఇస్తున్నాయిఇదంతా ఏదో భావోద్వేగంతోనో.. సానుభూతితోనో కాకుండా విశ్వసనీయత ప్రాతిపదికన సాగుతోందిభారత్‌ తన సాంస్కృతిక విలువల సగౌరవ పరిరక్షణవిస్తృతికి కృషి చేస్తుందని అన్ని దేశాలూ నమ్ముతున్నాయిప్రపంచం దృష్టిలో భారత్‌ విశ్వసనీయ వారసత్వ పరిరక్షక దేశంగా నిలిచిందినేను మంగోలియా పర్యటన సమయంలో అక్కడి బౌద్ధ సన్యాసులతో మాట్లాడినప్పుడు వారు సేకరించిన గొప్ప రాతప్రతులను పరిశీలించానుఆ రాతప్రతులపై అధ్యయనం కోసం వారి అనుమతి కోరానుఅనంతరం వాటిని భారత్‌కు తెచ్చిడిజిటలీకరణ పూర్తి చేసి వాటి ప్రతులను సగౌరవంగా వారికి తిరిగి అందించాం. ఇప్పుడు అవి వారికి గొప్ప సంపదగా ఉన్నాయి.

 

ఈ గొప్ప కార్యక్రమాల్లో జ్ఞాన భారతం మిషన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో దేశంలోని అనేక సంస్థలు ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయికాశీ నగరి ప్రచారణి సభకోల్‌కతా ఆసియాటిక్ సొసైటీఉదయపూర్‌లోని 'ధరోహర్', గుజరాత్‌ రాష్ట్రం కోబాలోని ఆచార్య శ్రీ కైలాశసురి జ్ఞాన మందిర్హరిద్వార్‌లోని పతంజలిపుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయం వంటి వందలాది సంస్థల సహకారంతో ఇప్పటివరకు పది లక్షలకు పైగా రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయిదేశంలో చాలా మంది ముందుకొచ్చి తమ కుటుంబ వారసత్వ సంపదను దేశం కోసం అందుబాటులో ఉంచారుఇలాంటి అన్ని సంస్థలకువ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానునేను ఖచ్చితంగా ఒక అంశంపై దృష్టి సారించాలనుకుంటున్నానునేను ఇటీవల కొంతమంది జంతు ప్రేమికులను కలిశానుమీరు ఎందుకు నవ్వుతున్నారు... మన దేశంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారువిశేషం ఏంటంటే వారు ఆవును పశువుగా పరిగణించరువారితో మాట్లాడుతున్నప్పుడు నేను ‘మన దేశంలో పశువుల చికిత్స గురించి పురాతన గ్రంథాల్లో ఉందనిఇందుకు సంబంధించిన చాలా రాతప్రతులు ఉన్నాయని’ చెప్పానునేను గుజరాత్‌లో ఉన్నప్పుడుఅక్కడి ఆసియా సింహాలపై నాకు ఆసక్తి ఉండేదినేను వాటిపై చాలా మక్కువ చూపించేవాడినిఅవి ఎక్కువగా తిని ఇబ్బందుల్లో పడినపుడుఒక చెట్టు పండ్లను తినాలని వాటికి తెలుసుఅవి తినడం ద్వారా వాంతి అవుతుందిఇది ఆ జంతువుకు తెలుసని నేను అప్పుడు తెలుసుకున్నానుదీని అర్థం ఏంటంటే సింహాల స్థావరాలు ఉన్న చోట అటువంటి పండ్ల చెట్లు ఉండటం అవసరందీని గురించి మన గ్రంథాలలో ఉందిఈ విషయాలన్నీ పొందుపర్చిన అనేక రాతప్రతులు మన దగ్గర ఉన్నాయినేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. మనకు చాలా జ్ఞానం అందుబాటులో ఉందిఅది రాతపూర్వకంగా ఉందిమనం దానిని శోధించి అన్వేషించాలిప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మనం వాటిని అర్థం చేసుకోవాలి.

 

మిత్రులారా,

 

భారతదేశం ఎప్పుడూ తన జ్ఞానాన్ని ధనరూపంలో వెలకట్టలేదు. మన రుషులు కూడా ‘విద్యా దాన్ మనతః పరమ్’ అన్నారు. ‘అన్ని దానాలలోనూ జ్ఞానదానమే గొప్పది’ అని దీని అర్థంఅందుకే ప్రాచీన కాలంలో భారత ప్రజలు కూడా స్వేచ్ఛగా రాతప్రతులను దానం చేశారుచైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు తనతో పాటు ఆరు వందల యాభైకి పైగా రాతప్రతులను తీసుకెళ్లాడునేను జన్మించిన వాద్నగర్‌లో ఆయన చాలా కాలం పాటు ఉన్నారని చైనా అధ్యక్షుడు ఒకసారి నాతో చెప్పారుఇక్కడి నుంచి చైనాకు తిరిగి వెళ్లాక ఆయన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ జన్మించిన ప్రాంతంలో నివసించాడుఅధ్యక్షుడు నన్ను ఆయన గ్రామానికి తీసుకెళ్లాడునేను హుయెన్ త్సాంగ్ నివాస స్థలాన్ని చూసేందుకు ఆయనతో కలిసి వెళ్లానుఅధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నాకు రాతప్రతులను పూర్తి వివరంగా చూపించాడుదానిలో భారత్‌ గురించి వివరించే కొన్ని అంశాలున్నాయివాటిని అక్కడి వ్యాఖ్యాత నాకు వివరించాడుఇది నన్ను చాలా ఆకట్టుకుంటుందిప్రతి ఒక్క దానిని చూసి అందులో ఏ నిధి ఉందో ఆలోచించానుభారతదేశానికి చెందిన అనేక రాతప్రతులు ఇప్పటికే చైనా నుంచి జపాన్‌కు చేరుకున్నాయి. 7వ శతాబ్దంలో జపాన్‌లో వాటిని హోర్యుజి ఆశ్రమంలో జాతీయ సంపదగా భద్రపరిచారుభారతదేశ పురాతన రాతప్రతులు నేటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో భద్రంగా ఉన్నాయిజ్ఞాన భారతం మిషన్ కింద మానవాళికి సంబంధించి ఈ ఉమ్మడి వారసత్వాన్ని ఏకం చేయడానికి కూడా మేం కృషి చేస్తాం.

 

మిత్రులారా,

 

జీ-20 సాంస్కృతిక వేదికపై చర్చల సందర్భంగా ఈ కృషికి మేం శ్రీకారం చుట్టాంభారత్‌తో శతాబ్దాల నుంచి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నాయితిరిగి ముద్రించిన మంగోలియా ‘కంజుర్’ సంపుటాలను మంగోలియా రాయబారికి మేం బహుకరించాంఅలాగే 2022లో మంగోలియాతో పాటు రష్యాలోని బౌద్ధ ఆరామాలకు 108 సంపుటాలను అందజేశాంథాయిలాండ్వియత్నాంలలోని విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాంపాత రాతప్రతులను డిజిటలీకరించేందుకు మేం అక్కడి నిపుణులకు శిక్షణ ఇస్తున్నాంఈ కృషి ఫలితంగా పాళీలన్నాచామ్ భాషలలోని అనేక రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయిజ్ఞాన భారతం మిషన్ ద్వారా మేం ఈ కార్యక్రమాలను మేం మరింత విస్తృతం చేస్తాం.

 

మిత్రులారా,

 

జ్ఞాన భారతం మిషన్ ద్వారా మరో పెద్ద సమస్య కూడా పరిష్కారమౌతుంది. శతాబ్దాలుగా మనం ఉపయోగిస్తోన్న భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలోని ముఖ్యమైన అనేక అంశాలను సంబంధించిన సమాచారాన్ని ఇతరులు కాపీ చేసి పేటెంట్ చేశారుఈ రకమైన మేధోపరమైన చౌర్యాన్ని అరికట్టటం కూడా అవసరమేడిజిటల్ రాతప్రతుల ద్వారా ఈ పనులు మరింత ఊపందుకుంటాయిమేధో పైరసీని అరికట్టొచ్చుఅన్ని అంశాలపై ప్రామాణికతతో కూడిన అసలైన మూలాలను ప్రపంచ కూడా తెలుసుకుంటుంది.

 

మిత్రులారా,

 

జ్ఞాన భారతం మిషన్ మరో ముఖ్యమైన కోణాన్ని కలిగి ఉంది. దీని కోసం పరిశోధనఆవిష్కరణల విషయంలో కొత్త సామర్థ్యాల ద్వారాలను మేం తెరుస్తున్నాంనేడు ప్రపంచంలో దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల విలువైన సాంస్కృతికసృజనాత్మక పరిశ్రమ ఉందిడిజిటలీకరణైన రాతప్రతులు ఈ పరిశ్రమకు ఊతమిస్తాయిమిలియన్ల సంఖ్యలో ఉన్న రాతప్రతులువాటిలో దాగి ఉన్న పురాతన జ్ఞానం కూడా ఒక భారీ డేటాబేస్‌గా ఉపయోగపడుతుందిఇవి 'సమాచార ఆధారిత ఆవిష్కరణ'లకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తాయిఇది సాంకేతికత రంగంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందిరాతప్రతుల డిజిటలీకరణ అయినందున విద్యారంగ పరిశోధనకు కొత్త బాటలు పడుతాయి.

 

మిత్రులారా,

 

ఈ డిజిటలీకరణ పూర్తయిన రాతప్రతులను అధ్యయనం చేయడానికి మనం ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించటాన్ని పెంచాలి. ఇక్కడ ప్రజెంటేషన్‌లో చెప్పిన విధంగా ఏఐ మానవ ప్రతిభను లేదా మానవ వనరులను భర్తీ చేయలేదన్న అంశంతో నేను ఏకీభవిస్తున్నానుఈ విధమైన భర్తీ జరగకూడదని నేను కోరుకుంటున్నానుఅది జరిగితే మనం కొత్త బానిసత్వానికి బాధితులం అవుతాంఏఐ అనేది ఒక మద్దతు వ్యవస్థఇది మనల్ని బలపరుస్తుందిమన బలాన్ని పెంచుతుందిమన వేగాన్ని పెంచుతుందిఏఐ సహాయంతో ఈ పురాతన రాతప్రతులను లోతుగా అర్థం చేసుకోని విశ్లేషించొచ్చుఇప్పుడే చూడండి.. అన్ని వేద గణిత గ్రంథాలు అందుబాటులో లేవుమనం ఏఐని ఉపయోగించి పని చేస్తే అనేక కొత్త సూత్రాలను కనుగొనే అవకాశం ఉందిఈ రాతప్రతులలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు ఏఐని ఉపయోగించొచ్చుమరో సమస్య ఏంటంటే.. మన రాతప్రతులు చెల్లాచెదురుగా ఉన్నాయివివిధ కాలాలకు సంబంధించినవి వివిధ రకాలుగా ఉన్నాయిఏఐ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. వీటన్నింటినీ సేకరించవచ్చువాటి నుంచి అమృతాన్ని చిలికేందుకు మనం చాలా మంచి సాధనాన్ని ఉపయోగించొచ్చుఅంటే 10 చోట్ల పడి ఉన్న వాటిని ఏఐ సహాయంతో ఒకచోట చేర్చి వాటిపై అధ్యయనం చేయొచ్చుఒకే పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించొచ్చని ప్రారంభంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినట్లుగా మనం రాతప్రతులను పరిష్కరించిన తర్వాత ప్రశ్నలను 100కు తగ్గించొచ్చునేడు మనం లక్షలాది ప్రశ్నలతో చిక్కుకొని ఉన్నాంమనం వాటిని 100కి తీసుకొస్తాంమనం మానవ స్ఫూర్తితో అనుసంధానమైనప్పుడు అది ఫలితాలను తీసుకొస్తుందికానీ ఇబ్బందులు చాలా ఉన్నాయిఅయితే మార్గాలు కూడా ఉన్నాయి.

 

మిత్రులారా,

 

దేశంలోని యువత అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇందులో పాలు పంచుకున్న వారిలో 70 శాతం మంది యువతే అని మంత్రి గారు నాకు చెప్పారుఇది దీని విజయానికి అతిపెద్ద సంకేతం అని నేను భావిస్తున్నానుయువత దీనిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తే.. మనం చాలా త్వరగా విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలనుసాంకేతికత ద్వారా గతాన్ని ఎలా అన్వేషించగలంఈ జ్ఞానాన్ని ఆధారభూత పారామితులపై మానవాళికి ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చుఈ దిశగా మనం కృషి చేయాలిమన విశ్వవిద్యాలయాలువిద్యా సంస్థలు కూడా దీని కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టాలినేడు దేశం మొత్తం స్వదేశీ స్ఫూర్తితోస్వావలంబన భారతదేశం అనే సంకల్పంతో ముందుకు సాగుతోందిఈ కార్యక్రమం కూడా దానికి కొనసాగింపేమన వారసత్వాన్ని మన శక్తి సామర్థ్యాలకు పర్యాయపదంగా మార్చుకోవాలిజ్ఞాన భారతం మిషన్‌తో భవిష్యత్తుకు సంబంధించిన కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని నేను నమ్ముతున్నానుఇవి ఆకర్షణమెరుపులేని అంశాలు అని నాకు తెలుసుకానీ వీటికి చాలా శక్తి ఉంది కాబట్టే శతాబ్దాలుగా ఎవరూ కదిలించలేదుమనం ఈ శక్తితో అనుసంధానం కావాలిఇదే నమ్మకంతో.. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ఈ గొప్ప కార్యక్రమాల్లో జ్ఞాన భారతం మిషన్ ఒక ముఖ్యమైన భాగం. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో దేశంలోని అనేక సంస్థలు ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. కాశీ నగరి ప్రచారణి సభ, కోల్‌కతా ఆసియాటిక్ సొసైటీ, ఉదయపూర్‌లోని 'ధరోహర్', గుజరాత్‌ రాష్ట్రం కోబాలోని ఆచార్య శ్రీ కైలాశసురి జ్ఞాన మందిర్, హరిద్వార్‌లోని పతంజలి, పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తంజావూరులోని సరస్వతీ మహల్ గ్రంథాలయం వంటి వందలాది సంస్థల సహకారంతో ఇప్పటివరకు పది లక్షలకు పైగా రాతప్రతులు డిజిటలీకరణ అయ్యాయి. దేశంలో చాలా మంది ముందుకొచ్చి తమ కుటుంబ వారసత్వ సంపదను దేశం కోసం అందుబాటులో ఉంచారు. ఇలాంటి అన్ని సంస్థలకు, వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఒక అంశంపై దృష్టి సారించాలనుకుంటున్నాను. నేను ఇటీవల కొంతమంది జంతు ప్రేమికులను కలిశాను. మీరు ఎందుకు నవ్వుతున్నారు? మన దేశంలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. విశేషం ఏంటంటే వారు ఆవును జంతువుగా పరిగణించరు. వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ‘మన దేశంలో జంతు చికిత్స గురించి గ్రంథాలలో రాసిన జ్ఞానం చాలా ఉందని, చాలా రాతప్రతులు ఉన్నాయని’ చెప్పాను. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు, అక్కడి ఆసియా సింహాలపై నాకు ఆసక్తి ఉండేది. నేను వాటిపై చాలా మక్కువ చూపించేవాడిని. అవి ఎక్కువగా వేడాడి ఇబ్బందుల్లో ఉంటే ఒక చెట్టు పండ్లను తినాలని వాటికి తెలుసు. తద్వారా వాంతి అవుతుంది. ఇది ఆ జంతువుకు తెలుసని నేను అప్పుడు తెలుసుకున్నాను. దీని అర్థం ఏంటంటే సింహాల స్థావరాలు ఉన్న చోట అటువంటి పండ్ల చెట్లు ఉండటం అవసరం. దీని గురించి మన గ్రంథాలలో ఉంది. ఈ విషయాలన్నీ పొందుపర్చిన అనేక రాతప్రతులు మన దగ్గర ఉన్నాయి. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. మనకు చాలా జ్ఞానం అందుబాటులో ఉంది. అది రాతపూర్వకంగా ఉంది. మనం దానిని శోధించి అన్వేషించాలి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మనం వాటిని అర్థం చేసుకోవాలి.

మిత్రులారా, 

భారతదేశం ఎప్పుడూ తన జ్ఞానాన్ని ధనరూపంలో వెలకట్టలేదు. మన రుషులు కూడా ‘విద్యా దనమనతః పరమ్’ అన్నారు. ‘అన్ని దానాలలోనూ జ్ఞానదానమే గొప్పది’ అని దీని అర్థం. అందుకే ప్రాచీన కాలంలో భారత ప్రజలు కూడా స్వేచ్ఛగా రాతప్రతులను దానం చేశారు. చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశానికి వచ్చినప్పుడు తనతో పాటు ఆరు వందల యాభైకి పైగా రాతప్రతులను తీసుకెళ్లాడు. నేను జన్మించిన వాద్నగర్‌లో ఆయన చాలా కాలం పాటు ఉన్నారని చైనా అధ్యక్షుడు ఒకసారి నాతో చెప్పారు. ఇక్కడి నుంచి చైనాకు తిరిగి వెళ్లాక ఆయన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ జన్మించిన ప్రాంతంలో నివసించాడు. అధ్యక్షుడు నన్ను ఆయన గ్రామానికి తీసుకెళ్లాడు. నేను హుయెన్ త్సాంగ్ నివాస స్థలాన్ని చూసేందుకు ఆయనతో కలిసి వెళ్లాను. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాకు రాతప్రతులను పూర్తి వివరంగా చూపించాడు. దానిలో భారత్‌ గురించి వివరించే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని అక్కడి వ్యాఖ్యాత నాకు వివరించాడు. ఇది నన్ను చాలా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క దానిని చూసి అందులో ఏ నిధి ఉందో ఆలోచించాను. భారతదేశానికి చెందిన అనేక రాతప్రతులు ఇప్పటికే చైనా నుంచి జపాన్‌కు చేరుకున్నాయి. 7వ శతాబ్దంలో జపాన్‌లో వాటిని హోర్యుజి ఆశ్రమంలో జాతీయ సంపదగా భద్రపరిచారు. భారతదేశ పురాతన రాతప్రతులు నేటికీ ప్రపంచంలోని అనేక దేశాలలో భద్రంగా ఉన్నాయి. జ్ఞాన భారతం మిషన్ కింద మానవాళికి సంబంధించి ఈ ఉమ్మడి వారసత్వాన్ని ఏకం చేయడానికి కూడా మేం కృషి చేస్తాం. 

మిత్రులారా, 

జీ-20 సాంస్కృతిక వేదికపై చర్చల సందర్భంగా ఈ కృషికి మేం శ్రీకారం చుట్టాం. భారత్‌తో శతాబ్దాల నుంచి సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకున్నాయి. తిరిగి ముద్రించిన మంగోలియా ‘కంజుర్’ సంపుటాలను మంగోలియా రాయబారికి మేం బహుకరించాం. అలాగే 2022లో మంగోలియాతో పాటు రష్యాలోని బౌద్ధ మఠాలకు 108 సంపుటాలను అందజేశాం. థాయిలాండ్, వియత్నాంలలోని విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాం. పాత రాతప్రతులను డిజిటలీకరించేందుకు మేం అక్కడి నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ కృషి ఫలితంగా పాళీ, లన్నా, చామ్ భాషలలోని అనేక రాతప్రతులు డిజిటలటీకరణ అయ్యాయి. జ్ఞాన భారతం మిషన్ ద్వారా మేం ఈ కార్యక్రమాలను మేం మరింత విస్తృతం చేస్తాం. 

మిత్రులారా, 

జ్ఞాన భారతం మిషన్ ద్వారా మరో పెద్ద సమస్య కూడా పరిష్కారమౌతుంది. శతాబ్దాలుగా మనం ఉపయోగిస్తోన్న భారతదేశ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలోని ముఖ్యమైన అనేక అంశాలను సంబంధించిన సమాచారాన్ని ఇతరులు కాపీ చేసి పేటెంట్ చేశారు. ఈ రకమైన మేధోపరమైన చౌర్యాన్ని అరికట్టటం కూడా అవసరమే. డిజిటల్ రాతప్రతుల ద్వారా ఈ పనులు మరింత ఊపందుకుంటాయి. మేధో పైరసీని అరికట్టొచ్చు. అన్ని అంశాలపై ప్రామాణికతతో కూడిన అసలైన మూలాలను ప్రపంచ కూడా తెలుసుకుంటుంది. 

మిత్రులారా, 

జ్ఞాన భారతం మిషన్ మరో ముఖ్యమైన కోణాన్ని కలిగి ఉంది. దీని కోసం పరిశోధన, ఆవిష్కరణల విషయంలో కొత్త సామర్థ్యాల ద్వారాలను మేం తెరుస్తున్నాం. నేడు ప్రపంచంలో దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్ల విలువైన సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమ ఉంది. డిజిటలీకరణైన రాతప్రతుల ఈ పరిశ్రమ విలువ గొలుసులకు ఊతమిస్తాయి. మిలియన్ల సంఖ్యలో ఉన్న రాతప్రతులు, వాటిలో దాగి ఉన్న పురాతన జ్ఞానం కూడా ఒక భారీ డేటాబేస్‌గా ఉపయోగపడుతుంది. ఇవి 'సమాచార ఆధారిత ఆవిష్కరణ'లకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది సాంకేతికత రంగంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. రాతప్రతుల డిజిటలీకరణ అయినందున విద్యారంగ పరిశోధనకు కొత్త బాటలు పడుతాయి. 

మిత్రులారా, 

ఈ డిజిటలీకరణ పూర్తైన రాతప్రతులను అధ్యయనం చేయడానికి మనం ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించటాన్ని పెంచాలి. ఇక్కడ ప్రజెంటేషన్‌లో చెప్పిన విధంగా ఏఐ మానవ ప్రతిభను లేదా మానవ వనరులను భర్తీ చేయలేదన్న అంశంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విధమైన భర్తీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే మనం కొత్త బానిసత్వానికి బాధితులం అవుతాం. ఏఐ అనేది ఒక మద్దతు వ్యవస్థ. ఇది మనల్ని బలపరుస్తుంది. మన బలాన్ని పెంచుతుంది. మన వేగాన్ని పెంచుతుంది. ఏఐ సహాయంతో ఈ పురాతన రాతప్రతులను లోతుగా అర్థం చేసుకోని విశ్లేషించొచ్చు. ఇప్పుడే చూడండి.. అన్ని వేద గణిత గ్రంథాలు అందుబాటులో లేవు. మనం ఏఐని ఉపయోగించి పని చేస్తే అనేక కొత్త సూత్రాలను కనుగొనే అవకాశం ఉంది. ఈ రాతప్రతులలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు ఏఐని ఉపయోగించొచ్చు. మరో సమస్య ఏంటంటే.. మన రాతప్రతులు చెల్లాచెదురుగా ఉన్నాయి. వివిధ కాలాలకు సంబంధించినవి వివిధ రకాలుగా ఉన్నాయి. ఏఐ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే.. వీటన్నింటినీ సేకరించవచ్చు. వాటి నుంచి అమృతాన్ని చిలికేందుకు మనం చాలా మంచి సాధనాన్ని ఉపయోగించొచ్చు. అంటే 10 చోట్ల పడి ఉన్న వాటిని ఏఐ సహాయంతో ఒకచోట చేర్చి వాటిపై అధ్యయనం చేయొచ్చు. ఒకే పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించొచ్చని ప్రారంభంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినట్లుగా మనం రాతప్రతులను పరిష్కరించిన తర్వాత ప్రశ్నలను 100కు తగ్గించొచ్చు. నేడు మనం లక్షలాది ప్రశ్నలతో చిక్కుకొని ఉన్నాం. మనం వాటిని 100కి తీసుకొస్తాం. మనం మానవ స్ఫూర్తితో అనుసంధానమైనప్పుడు అది ఫలితాలను తీసుకొస్తుంది. కానీ ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయితే మార్గాలు కూడా ఉన్నాయి.

మిత్రులారా, 

దేశంలోని యువత అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇందులో పాలు పంచుకున్న వారిలో 70 శాతం మంది యువతే అని మంత్రి గారు నాకు చెప్పారు. ఇది దీని విజయానికి అతిపెద్ద సంకేతం అని నేను భావిస్తున్నాను. యువత దీనిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తే.. మనం చాలా త్వరగా విజయం సాధిస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. సాంకేతికత ద్వారా గతాన్ని ఎలా అన్వేషించగలం? ఈ జ్ఞానాన్ని ఆధారభూత పారామితులపై మానవాళికి ఎలా అందుబాటులోకి తీసుకురావచ్చు? ఈ దిశగా మనం కృషి చేయాలి. మన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కూడా దీని కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టాలి. నేడు దేశం మొత్తం స్వదేశీ స్ఫూర్తితో, స్వావలంబన భారతదేశం అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం కూడా దానికి కొనసాగింపే. మన వారసత్వాన్ని మన శక్తి సామర్థ్యాలకు పర్యాయపదంగా మార్చుకోవాలి. జ్ఞాన భారతం మిషన్‌తో భవిష్యత్తుకు సంబంధించిన కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని నేను నమ్ముతున్నాను. ఇవి ఆకర్షణ, మెరుపులేని అంశాలు అని నాకు తెలుసు. కానీ వీటికి చాలా శక్తి ఉంది కాబట్టే శతాబ్దాలుగా ఎవరూ కదిలించలేదు. మనం ఈ శక్తితో అనుసంధానం కావాలి. ఇదే నమ్మకంతో.. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

 

***


(Release ID: 2166347) Visitor Counter : 2