ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ మోహన్ భాగవత్ 75వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక వ్యాసాన్ని ప్రజలతో పంచుకొన్న ప్రధానమంత్రి
Posted On:
11 SEP 2025 8:57AM by PIB Hyderabad
శ్రీ మోహన్ భాగవత్ 75వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక వ్యాసాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకొన్నారు. ఈ వ్యాసంలో శ్రీ భాగవత్ స్ఫూర్తిదాయక జీవనంతో పాటు, దేశానికి సేవ చేయడంలో ఆయన కనబరిచే అచంచల నిబద్ధతను శ్రీ మోదీ వివరించారు. భరతమాతకు నిష్ఠగా సేవలను అందించడానికి శ్రీ మోహన్ జీ కి దీర్ఘాయుష్షుతో పాటు మంచి ఆరోగ్యం లభించాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమాజంలో మార్పు, సద్భావనతో పాటు సోదరి- సోదర భావాన్ని బలపరచడంలో శ్రీ భాగవత్ తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారంటూ శ్రీ మోదీ ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘వసుధైక కుటుంబ సిద్ధాంతాన్ని శ్రీ మోహన్ భాగవత్ స్ఫూర్తిగా తీసుకొని సామాజిక మార్పు, సద్భావనలతో పాటు సోదరీసోదర భావాన్ని బలపరచడానికి తన పూర్తి జీవనాన్ని అంకితం చేశారు.
ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా, మోహన్ గారితో పాటు వారి స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంపై కొన్ని ఆలోచనలకు నేను అక్షర రూపాన్ని ఇచ్చాను. భరతమాతకు సేవ చేయడానికి ఆయనకు దీర్ఘాయుష్షుతో పాటు ఆరోగ్యకరమైన జీవితం లభించాలని నేను కోరుకొంటున్నాను’’.
(Release ID: 2165572)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam