ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ - అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని స్పష్టం చేసిన ప్రధాని
Posted On:
10 SEP 2025 7:52AM by PIB Hyderabad
భారత్ - అమెరికా మధ్య బలమైన సత్సంబంధాలున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించడం లక్ష్యంగా ఇరుదేశాలూ కలిసి పనిచేస్తాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ పోస్టుకు ప్రతిస్పందిస్తూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“భారత్, అమెరికా సన్నిహిత మిత్రదేశాలు, సహజ భాగస్వాములు. భారత్-అమెరికా భాగస్వామ్యంతో అపరిమిత అవకాశాలను ఆవిష్కరించే దిశగా మన వాణిజ్య చర్చలు మార్గాన్ని సుగమం చేస్తాయని విశ్వసిస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ చర్చలను ఓ కొలిక్కి తెచ్చేలా మన బృందాలు కృషి చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల ప్రజలకు ఉజ్వలమైన, మరింత సుసంపన్నమైన భవితను అందించే దిశగా కలిసి పనిచేస్తాం.
@realDonaldTrump
@POTUS”
(Release ID: 2165198)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam