ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి

ఉక్రెయిన్‌ సంక్షోభంపై శాంతియుత పరిష్కారం దిశగా ఇటీవలి పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్న నేతలు

పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సానుకూల పరిణామాలను స్వాగతించిన ఇరువురు నేతలు

ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు అధ్యక్షుడు మాక్రాన్‌ను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి

Posted On: 06 SEP 2025 6:22PM by PIB Hyderabad

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్ ద్వారా సంభాషించారు.

ఆర్థికరక్షణసైన్స్టెక్నాలజీఅంతరిక్షం సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సానుకూల పరిణామాలను ఇరువురు నేతలు సమీక్షించి.. స్వాగతించారుహొరైజన్ 2047 రోడ్‌మ్యాప్ఇండో-పసిఫిక్ రోడ్‌మ్యాప్రక్షణరంగ పరిశ్రమల రోడ్‌మ్యాప్‌లకు అనుగుణంగా ఇరుదేశాల నేతలు భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఉక్రెయిన్‌ సంక్షోభం ముగింపు దిశగా ఇటీవలి ప్రయత్నాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారువివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకుసాధ్యమైనంత త్వరగా శాంతి-సుస్థిరతలను పునరుద్ధరించేందుకు భారత్ నిరంతర మద్దతు కొనసాగుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

2026 ఫిబ్రవరిలో భారత్ నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ఆహ్వానాన్ని అంగీకరించిన అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారుఅధ్యక్షుడు మాక్రాన్‌ను స్వాగతించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ శాంతిసుస్థిరతలను ప్రోత్సహించడం కోసం సంప్రదింపులను కొనసాగించడానికీకలిసి పనిచేయడానికీ ఇరువురు నేతలూ అంగీకారం తెలిపారు.

 

***


(Release ID: 2164424) Visitor Counter : 2