ప్రధాన మంత్రి కార్యాలయం
సామాన్యులు, రైతులు, ఎంఎస్ ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
03 SEP 2025 11:00PM by PIB Hyderabad
సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఏకాభిప్రాయంతో ఆమోదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "విస్తృతమైన సంస్కరణలు మన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి. అందరికీ, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, వ్యాపారాలకు వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
"ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకురావాలనే మా ఉద్దేశం గురించి మాట్లాడాను. సాధారణ ప్రజల జీవన సౌలభ్యం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో జీఎస్టీ రేట్ల సవరణ, ప్రక్రియల సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు చెప్పాను. సామాన్యులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఈ ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ విస్తృత సంస్కరణలు మన ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయి. అందరికీ, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు, వ్యాపారాలకు వ్యాపార సౌలభ్యాన్ని అందిస్తాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్ ‘ లో పేర్కొన్నారు.
(Release ID: 2163567)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam