ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘సెమీకాన్ ఇండియా 2025’ను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్‌ను ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.. భారత్‌పై ప్రపంచానికి నమ్మకముంది..


భారత్‌తో కలిసి సెమీకండక్టర్ రంగ భవితను తీర్చిదిద్దడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది
‘చిప్స్ అంటే అవి డిజిటల్ వజ్రాలు’
‘కాగితాలతో చేసే పని ఎంత తగ్గితే, వేఫర్ల పనిని అంత త్వరగా మొదలు పెట్టొచ్చు’

‘భారత్‌లో తయారు చేసే అత్యంత చిన్న చిప్ త్వరలోనే ప్రపంచంలో అత్యంత పెద్ద మార్పునకు దిశా నిర్దేశం చేస్తుంది’

‘‘భారత్‌లో రూపురేఖలు తీర్చింది.. భారత్‌లో తయారు చేసింది... ప్రపంచం నమ్మేది’’ అని

ప్రపంచం చెప్పుకొనే రోజు ఎంతో దూరంలో లేదు: ప్రధానమంత్రి

Posted On: 02 SEP 2025 11:58AM by PIB Hyderabad

సెమీకాన్ ఇండియా- 2025’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమిలో ఈ  రోజు ప్రారంభించారుఈ కార్యక్రమాన్ని దేశ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఉత్ప్రేరకంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారుఆహూతులను ఉద్దేశించి ప్రధానమంత్రి  ప్రసంగిస్తూ... దేశ విదేశాల నుంచి సెమీకండక్టర్ పరిశ్రమల ముఖ్య కార్యనిర్వహణాధికారులువారి సహచరులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞత‌లు తెలిపారువివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ అతిథులుఅంకుర సంస్థలతో అనుబంధం ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ విద్యార్థులకు కూడా ఆయన స్వాగతం పలికారు.

జపాన్చైనాల్లో తన పర్యటన ముగించుకొని నిన్న రాత్రి భారత్‌కు వచ్చినట్లు శ్రీ మోదీ తెలిపారుఈ రోజు యశోభూమిలో ఆహూతుల మధ్యకు వచ్చానన్నారుఈ హాలు ఆకాంక్షలతోఆత్మవిశ్వాసంతో కిక్కిరిసిపోయిందని ఆయన అభివర్ణించారుసాంకేతికత అంటే తనకున్న మక్కువ ఎల్లప్పుడూ సహజమైందీఅందరికీ తెలిసిందేనని ఆయన అన్నారుఇటీవల తాను జపాన్లో పర్యటించిన సందర్భంలో ఆ దేశ ప్రధానిశ్రీ షిగేరు ఇషిబాతో పాటు టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీకి వెళ్లినట్లు తెలిపారుఆ  కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఇవాళ మీ అందరి మధ్యా ఉన్నారని శ్రీ మోదీ వెల్లడించారుసాంకేతికత పట్ల ఉన్న అభిరుచే ఇలాంటి సమావేశాలకు తనను తరచూ హాజరయ్యేట్లు చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఈ రోజు ఆహూతుల మధ్యకు రావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు.  
 

ప్రపంచం నలు మూలల నుంచి 40-50 దేశాలకు చెందిన సెమీకండక్టర్ రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు  తెలిపిన శ్రీ మోదీ.. భారత్‌కు చెందిన నవకల్పనయువ శక్తి కూడా ఈ సభాస్థలికి తరలివచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారుఈ అద్వితీయ కలయిక ఒక సూటి సందేశాన్ని అందిస్తోందని, ‘‘భారత్‌ను ప్రపంచం నమ్ముతోందిభారత్‌పై ప్రపంచానికి భరోసా ఉందిభారత్‌తో కలిసి సెమీకండక్టర్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రపంచం తయారుగా ఉందనేదే’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘సెమీకాన్ ఇండియా‌’కు హాజరవుతున్న ప్రముఖ అతిథులందరికీ ఆయన స్వాగతం పలుకుతూవారంతా అభివృద్ధి చెందిన స్వయంసమృద్ధ దేశాన్ని ఆవిష్కరించే దిశగా ఇండియా చేస్తున్న ప్రయాణంలో ముఖ్య భాగస్వాములేనన్నారు.    
 

ఇటీవలే ప్రకటించిన ఈ ఏడాది మొదటి మూడు నెలల జీడీపీ (స్థూల దేశీయోత్పత్తిఅంకెల గురించి ప్రధానమంత్రి సూచనప్రాయంగా ప్రస్తావిస్తూ, ‘‘మరోసారిభారత్ ప్రతి ఒక్క ఆశనీప్రతి ఒక్క అంచనాతో పాటు ప్రతి  జోస్యాన్ని కూడా తోసిరాజంది’’ అన్నారుఆర్థిక స్వప్రయోజనాలు ఆలంబనగా ఉంటున్న ఆందోళనలతోనుసవాళ్లతోను ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు సతమతం అవుతుంటేభారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని తెలిపారుఈ అభివృద్ధి .. తయారీసేవలువ్యవసాయంతో పాటు నిర్మాణం.. ఇలా అన్ని రంగాల్లోను కనిపిస్తోందనిప్రతి చోటా ఉత్సాహం ఉరకలేస్తోందని ఆయన ఉద్ఘాటించారుభారత్ వృద్ధి జోరు వివిధ పరిశ్రమల్లోనుదేశంలో ప్రతి ఒక్కరిలోను సరికొత్త శక్తిని నింపుతోందని ఆయన కితాబిచ్చారుఈ వృద్ధి వేగం భారత్‌ను త్వరలోనే ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే బాటలో మరింత వేగంగా ముందుకు తీసుకువెళుతున్నదని ఆయన అన్నారు.

సెమీకండక్టర్ల జగతిలో తరచూ ఓ మాట వినిపిస్తుందిఅది..‘చమురు నల్ల బంగారం అయితేచిప్స్... డిజిటల్ యుగపు వజ్రాలు’ అనేదేనని ప్రధానమంత్రి తెలిపారుచమురు ఇది వరకటి శతాబ్దానికి రూపురేఖలను కల్పించిందిమరి అప్పట్లో ప్రపంచ భాగ్యాన్ని చమురు బావులే నిర్ధారించాయన్నారుఈ  బావుల నుంచి ఎంత పెట్రోలియాన్ని వెలికి తీశారన్న  అంశంపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎత్తుపల్లాలు ఆధారపడ్డాయన్నారుఏమైనా, 21వ శతాబ్దంలో శక్తి అంతా కూడా చిన్న చిప్‌లో కేంద్రీకృతం అయిందని స్పష్టం చేశారుఆకారంలో చిన్నదే అయినప్పటికీ ఈ చిప్‌లలో ప్రపంచ ప్రగతిని వేగవంతం చేసే శక్తి దాగి ఉందని ఆయన అన్నారుప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్టు ఇప్పటికే 600 బిలియన్ డాలర్ స్థాయికి ఎగబాకిందని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ... రాబోయే సంవత్సరాల్లో ఇది ఒక ట్రిలియన్ డాలర్ స్థాయిని అందుకొంటుందన్న అంచనా ఉందన్నారుసెమీకండక్టర్ రంగంలో భారత్ ముందుకు దూసుకుపోతున్న తీరును చూస్తుంటేఈ ఒక ట్రిలియన్ డాలర్ మార్కెట్టులో ఇండియా ఒక ప్రధాన వాటాను చేజిక్కించుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.    
 

భారత్ వేగవంతంగా ముందంజ వేస్తున్న తీరును చెప్పాలని ఉందంటూ సెమీకాన్ ఇండియా కార్యక్రమాన్ని 2021లో మొదలుపెట్టిన సంగతిని గుర్తుకు తెచ్చారు. 2023 కల్లా భారత్‌లో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంటుకు ఆమోదం తెలిపారని, 2024లో మరిన్ని ప్లాంట్లకు అనుమతులు ఇచ్చారనిఈ ఏడాది అదనంగా అయిదు ప్రాజెక్టులకు మార్గం సుగమం చేశారని వివరించారుమొత్తం పది సెమీకండక్టర్ ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం పురోగమిస్తున్నాయనివీటిలో మొత్తం 18 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సొమ్ము.. అంటే రూ.1.5 లక్షల కోట్లకు మించి..  పెట్టుబడి పెట్టినట్లు ఆయన వెల్లడించారుఇది భారత్ పట్ల ప్రపంచంలో అంతకంతకు పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సెమీకండక్టర్ రంగంలో వేగానికే అగ్రతాంబూలం అని శ్రీ మోదీ చెబుతూ, ‘‘ఫైల్ దశ నుంచి ఫ్యాక్టరీ దశకు చేరుకోవడానికి పట్టే సమయంతో పాటు కాగితాలకు సంబంధించిన పనులు ఎంత తక్కువగా ఉంటేవేఫర్ పనులను అంత త్వరగా మొదలుపెట్టొచ్చు’’ అని వ్యాఖ్యానించారుఇదే దృష్టికోణంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారుఅన్ని అనుమతులను ఒకేసారి ఇచ్చేందుకు జాతీయ వ్యవస్థ (నేషనల్ సింగిల్ విండో సిస్టమ్)ను అమల్లోకి తీసుకువచ్చారుదీంతో కేంద్రరాష్ట్రాల ఆమోదాలన్నింటినీ ఒకే వేదికను ఉపయోగించి ఇవ్వడానికి వీలుంటుందనీఫలితంగాపెట్టుబడిదారులకు దొంతర్లకు దొంతర్లుగా ఉండే పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదని కూడా ఆయన తెలిపారుదేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్కులను ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాల నమూనాలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారనీఇది భూమివిద్యుత్తు సరఫరాఓడరేవువిమానాశ్రయ సంధానంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల సదుపాయాలను అందిస్తుందని ఆయన వివరించారుఈ రకమైన మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహకాలు జతకూడితేఅప్పుడు పారిశ్రామిక వృద్ధి తప్పక చోటు చేసుకొంటుందని వ్యాఖ్యానించారుపీఎల్ఐ ప్రోత్సాహకాల ద్వారా గానిలేదా డిజైన్‌తో ముడిపెట్టిన గ్రాంట్ల ద్వారా గానీ భారత్ తొలి నుంచి చివరి వరకూ సామర్థ్యాలను అందిస్తోందనీఈ కారణంగానే పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆయన స్పష్టం చేశారుభారత్ పరోక్ష కార్యకలాపాలను నిర్వహించడానికి మించి ముందుకెళుతూ ఫుల్ స్టాక్ సెమీకండక్టర్ దేశంగా మారే దిశగా దూసుకుపోతోందని శ్రీ మోదీ అన్నారుభారతదేశ అత్యంత చిన్న చిప్.. ప్రపంచంలో అత్యంత పెద్దదైన మార్పునకు చోదకశక్తి అయ్యే రోజు ఇంతో దూరంలో లేదని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘మా ప్రయాణం ఆలస్యంగా మొదలైంది.. అయితే మమ్మల్నిక ఏదీ ఆపజాలదు’’ అని ప్రధానమంత్రి ప్రకటించారుసీజీ పవర్ పైలట్ ప్లాంటు కార్యకలాపాలు 4-5 రోజుల కిందటే.. ఆగస్టు 28.. ఆరంభమయ్యాయని తెలిపారుకేన్స్ లో పైలట్ ప్లాంటు కూడా మొదలవడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారుమైక్రోన్టాటా సంస్థలు  నిర్మించే టెస్ట్ చిప్స్ ఉత్పాదన కూడా మొదలైందన్నారువాణిజ్య సరళి చిప్స్ ఉత్పత్తి ఈ సంవత్సరంలో మొదలవుతుందని ప్రధానమంత్రి అంటూఇది సెమీకండక్టర్ రంగంలో భారత్ సత్వర ప్రగతిని చాటిచెబుతోందన్నారు.  
 

సెమీకండక్టర్ రంగంలో భారత్ విజయగాథ ఏ ఒక్క విభాగానికో లేదా ఏ ఒక్క టెక్నాలజీకో పరిమితం కాదని శ్రీ మోదీ స్పష్టం చేశారుదేశం ఒక సంపూర్ణ అనుబంధ విస్తారిత వ్యవస్థను నిర్మిస్తోందని ఆయన అన్నారుఈ అనుబంధ విస్తారిత వ్యవస్థలో దేశంలోని రూపకల్పనతయారీప్యాకేజింగుతో పాటు ఉన్నత సాంకేతికతతో కూడిన ఉపకరణాలు.. ఇవన్నీ కలిసి ఉన్నాయని ఆయన తెలిపారుసెమీకండక్టర్ మిషన్ కేవలం ఒక ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయడానికో లేదా ఒక చిప్‌ను ఉత్పత్తి చేయడానికో పరిమితం కాదుదీనికి బదులు ఒక పటిష్ఠ సెమీకండక్టర్ అనుబంధ విస్తారిత వ్యవస్థనే భారత్ రూపొందిస్తోంది... ఇది దేశాన్ని స్వావలంబన దిశగాప్రపంచవ్యాప్తంగా పోటీపడేదిగా తీర్చిదిద్దనుందని ప్రధానమంత్రి  వివరించారు.   

భారత సెమీకండక్టర్ మిషన్‌లో మరో కీలకమైన అంశాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూఈ రంగంలో ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు భారత్ దూసుకెళ్తుందని అన్నారుస్వదేశంలో తయారైన చిప్‌ల ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సాధికారత కల్పించడంపై భారత్ దృష్టి సారించిందని పేర్కొన్నారునోయిడాబెంగళూరులో అభివృద్ధి చేస్తున్న డిజైన్ సెంటర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన చిప్‌ల తయారీపై పని చేస్తున్నాయనిఅవి బిలియన్ల కొద్దీ ట్రాన్సిస్టర్లను నిల్వ చేయగల సామర్థ్యం కలవని ప్రధానమంత్రి వెల్లడించారుఈ చిప్స్ 21వ శతాబ్దంలోని కొత్త సాంకేతికతకు శక్తినిస్తాయని స్పష్టం చేశారుప్రపంచ సెమీకండక్టర్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడుతూ.. వాటిని అధిగమించడానికి భారత్ మెరుగ్గా పనిచేస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారునగరాల్లో ఎత్తయిన భవనాలుఆకట్టుకునే అద్భుతమైన సదుపాయాలు ఉన్నావాటి పునాది బలం ఉక్కు మీద ఆధారపడి ఉంటుందనీఅదేవిధంగాభారత డిజిటల్ వసతుల పునాది ముఖ్యమైన ఖనిజాలపై ఆధారపడి ఉంటుందనీ అన్నారుజాతీయ కీలక ఖనిజ మిషన్‌పై భారత్ పనిచేస్తోందనిదేశీయంగా అరుదైన ఖనిజాల అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీ మోదీ తెలిపారు.

సెమీకండక్టర్ రంగం అభివృద్ధిలో అంకుర సంస్థలుఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోందనిప్రపంచంలోని సెమీకండక్టర్ డిజైన్లలో 20 శాతం ప్రతిభ భారతదేశానిదేననిఈ రంగానికి అవసరమైన అతిపెద్ద మానవ వనరుల కేంద్రంగా దేశ యువత నిలుస్తున్నదనీ చెప్పారుయువ పారిశ్రామికవేత్తలుఆవిష్కర్తలుఅంకురసంస్థలు ఈ క్రతువులో భాగమయ్యేందుకు ముందుకు రావాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారుప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారుడిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్చిప్స్-టు-స్టార్టప్ ప్రోగ్రామ్ ప్రత్యేకించి వారికోసమే రూపొందించినట్లు చెప్పారుడిజైన్ ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని సమర్థంగా లక్ష్యాలను చేరుకునేందుకు పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారుఈ రంగంలో భారతీయ మేధో సంపత్తి (ఐపీ)ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఇటీవల ప్రారంభించిన జాతీయ పరిశోధనా నిధి కూడా వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ఈ ప్రయత్నానికి తోడ్పడుతుందని వెల్లడించారుఅనేక రాష్ట్రాలు సెమీకండక్టర్ క్రతువులో చురుగ్గా పాల్గొంటున్నాయనివాటిలో చాలా రాష్ట్రాలు ఈ రంగానికి ప్రత్యేక విధానాలు రూపొందించాయని తెలిపారుఈ రాష్ట్రాలు ప్రత్యేక మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారుఅన్ని రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతూసెమీకండక్టర్ విస్తారిత వ్యవస్థను అభివృద్ధి చేయాలనిపెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని పిలుపునిచ్చారు.

"సంస్కరణసాధనమార్పులను అనుసరించి భారత్ ఈ స్థాయికి చేరుకుందిత్వరలో భావితరానికి కొత్త తరహా సంస్కరణలను తీసుకొస్తాంఅని ప్రధానమంత్రి తెలిపారుభారత సెమీ కండక్టర్ మిషన్ తదుపరి దశపై ప్రస్తుతం పని జరుగుతోందని చెప్పారుపెట్టుబడిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని మనస్ఫూర్తిగా స్వాగతించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. "డిజైన్ పూర్తయిందిమాస్క్ సిద్ధంగా ఉందిపెద్ద ఎత్తున ఖచ్చితత్వంతో అమలుపంపిణీ చేయాల్సిన సమయం వచ్చేసిందిఅని అన్నారుభారత్ చేపడుతున్న విధానాలు తాత్కాలికం కాదుదీర్ఘకాలిక నిబద్ధతతో కూడినవనిఅవి ప్రతి పెట్టుబడిదారుడి అవసరాలు తీరుస్తాయని హామీ ఇచ్చారు.‘‘డిజైన్డ్ ఇన్ ఇండియామేడ్ ఇన్ ఇండియాట్రస్టెడ్ బై ద వరల్డ్ అని ప్రపంచం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదుఅని ప్రధానమంత్రి అన్నారుభారత్ చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలనిప్రతి ప్రయత్నం ఆవిష్కరణలతో కూడినదై ఉండాలనిఈ ప్రయాణం ఎటువంటి లోపాలు లేకుండాఅత్యుత్తమ పనితీరుతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు శ్రీ అశ్వినీ వైష్ణవ్శ్రీ జితిన్ ప్రసాదఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తాఒడిశా సీఎం శ్రీ మోహన్ చరణ్ మాఝీఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

సెమీకాన్ ఇండియా-2025 సెప్టెంబర్ నుంచి 4వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుందిఇది దేశంలో బలమైనప్రతికూలతలను అధిగమించే సామర్థ్యం గలసుస్థిరమైన సెమీకండక్టర్ విస్తారిత వ్యవస్థపై దృష్టి సారిస్తుందిసెమీకాన్ ఇండియా ప్రోగ్రాం పురోగతిసెమీకండక్టర్ ఫ్యాబ్అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులుమౌలిక సదుపాయాలను సిద్ధం చేయటంస్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ఆర్ అండ్ డిఏఐ రంగాల్లో నూతన ఆవిష్కరణలుపెట్టుబడులకు అవకాశాలురాష్ట్ర విధాన అమలు తదితర అంశాలపై సమావేశాలను నిర్వహిస్తుందిఅదనంగాఈ కార్యక్రమంలో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (డీఎల్ఐపథకం కింద ఉన్న కార్యక్రమాలుస్టార్టప్ వృద్ధిఅంతర్జాతీయ సహకారంసెమీకండక్టర్ రంగంలో భారత భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలను హైలైట్ చేస్తుంది.

20,750 మందికి పైగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో 48కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా అంతర్జాతీయ నేతలు సహా 150 మందికి పైగా వక్తలు, 350 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారుఇందులో దేశాల రౌండ్ టేబుల్ చర్చలుదేశాల పెవిలియన్లుమానవ వనరుల అభివృద్ధిస్టార్టప్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్లు కూడా ఉంటాయి.

 

 

***

MJPS/SR


(Release ID: 2163167) Visitor Counter : 4