ప్రధాన మంత్రి కార్యాలయం
అఫ్గనిస్థాన్ భూకంపం మృతులకు ప్రధానమంత్రి సంతాపం
Posted On:
01 SEP 2025 2:16PM by PIB Hyderabad
ఆఫ్ఘనిస్థాన్ లో భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం తెలిపారు.
'ఎక్స్' వేదికగా చేసిన పోస్ట్ లో ప్రధానమంత్రి మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఆఫ్ఘనిస్థాన్ లో సంభవించిన భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఈ క్లిష్ట సమయంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భూకంపం ధాటికి ప్రభావితులైన వారికి భారత్ అన్ని విధాలుగా మానవతా సాయం, సహాయక చర్యలను అందించేందుకు సిద్ధంగా ఉంది."
(Release ID: 2162828)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada