ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్


• ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం దిశగా ఇటీవలి ప్రయత్నాలపై

ఆలోచనలను పంచుకున్న నేతలు

• సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ మద్దతిస్తోందంటూ ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటన

• వాణిజ్యం, సాంకేతికతలతో పాటు స్థిరత్వం సహా కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైనా చర్చించిన నేతలు

Posted On: 27 AUG 2025 8:32PM by PIB Hyderabad

ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజున టెలిఫోన్లో మాట్లాడారు.

ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం అంశంపై యూరోప్, అమెరికాఉక్రెయిన్ నేతలు ఇటీవల నిర్వహించిన సమావేశాలపై అధ్యక్షుడు శ్రీ స్టబ్ తన ఆలోచనలను శ్రీ మోదీకి తెలిపారు.

ఈ సంఘర్షణకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే యత్నాలతో పాటు శాంతి, సుస్థిరత్వాలను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరించే విషయంలో భారత్ ఎప్పుడూ మద్దతునిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

భారత్-ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని కూడా నేతలు సమీక్షించారుక్వాంటమ్ టెక్నాలజీ, 6జీకృత్రిమ మేధ,  సైబర్ భద్రతలతో పాటు స్థిరత్వం సహా సరికొత్తగా తెర మీదకు వస్తున్న రంగాల్లో ఉభయ దేశాల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలన్న అంశంపై నిబద్ధతను ఇద్దరు నేతలూ పునరుద్ఘాటించారు.

ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా వీలయినంత త్వరలో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుదిరూపును ఇవ్వాలనీఈ అంశంలో ఫిన్లాండ్ మద్దతును అందిస్తుందని అధ్యక్షుడు శ్రీ  స్టబ్ పునరుద్ఘాటించారుభారత్ వచ్చే సంవత్సరంలో నిర్వహించనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ విజయవంతం కావడానికి తాము మద్దతిస్తామని కూడా శ్రీ స్టబ్ ఉద్ఘాటించారు.

వీలు చూసుకొని సాధ్యమైనంత త్వరలో భారత్‌లో పర్యటించేందుకు రావాల్సిందిగా అధ్యక్షుడు శ్రీ స్టబ్‌ను ప్రధానమంత్రి ఆహ్వానించారు. తరచూ సంప్రదింపులను కొనసాగించేందుకు ఇరువురు నేతలూ అంగీకరించారు. ‌

 

***


(Release ID: 2161417) Visitor Counter : 3