ఆర్థిక మంత్రిత్వ శాఖ
పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును 2025 డిసెంబరు 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
28 AUG 2025 8:48AM by PIB Hyderabad
దేశ జౌళి రంగానికి పత్తి అందుబాటును పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా.. ఈ నెల 19 మొదలు వచ్చే నెల (2025 సెప్టెంబరు) 30వ తేదీ వరకు.. మినహాయించింది. ఎగుమతిదారు సంస్థలకు మరింత ఊతాన్ని అందించే ఉద్దేశంతో, పత్తి (హెచ్ఎస్ 5201 రకం)పై దిగుమతి సుంకం మినహాయింపును సెప్టెంబరు నెలాఖరు నుంచి ఈ సంవత్సరం డిసెంబరు 31 వరకు పొడిగించాలని తాజాగా నిర్ణయించింది.
నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయనున్నారు.
(Release ID: 2161414)
Visitor Counter : 18