ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంవత్సరి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి


క్షమాపణ, కరుణ, వినయంతో ఉండాలని కోరిన మోదీ

Posted On: 27 AUG 2025 6:20PM by PIB Hyderabad

సంవత్సరి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్షమ, కరుణ, నిజాయితీగల మానవ సంబంధాల కాలాతీత విలువల గురించి ప్రధానంగా చెప్పారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“క్షమించటంలో ఉన్న అందం, కరుణకు ఉన్న శక్తిని సంవత్సరి గుర్తు చేస్తోంది. ఇది నిజాయితీతో బంధాలను పెంపొందించుకోవడానికి ప్రజలకు ప్రేరణనిస్తుంది. ఈ పవిత్ర సందర్భాన్ని మనం గుర్తుచేసుకుంటున్నప్పుడు మన హృదయాలు వినయంతో నిండిపోవాలని, మన చేసే పనులు దయతో పాటు సద్భావనను ప్రతిబింబించాలని ఆశిస్తున్నాను. మిచ్చామి దుక్కడం!”


(Release ID: 2161349)