మంత్రిమండలి
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీ) వేలంలో పాల్గొనాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన క్యాబినెట్


సీడబ్ల్యూజీ-2030 బిడ్ ఆమోదం పొందితే, గుజరాత్ ప్రభుత్వానికి ఆతిథ్య సహకార ఒప్పందం, ఆర్థిక సహాయం మంజూరుపై సంతకం చేసేందుకు ఆమోదం తెలిపిన క్యాబినెట్


ప్రపంచ స్థాయి స్టేడియంలు, అత్యాధునిక శిక్షణ సదుపాయాలు,

మంచి క్రీడా సంస్కృతిని అందించే చక్కటి ఆతిథ్య నగరం అహ్మదాబాద్



2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా

ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం... నరేంద్ర మోదీ స్టేడియం

72 దేశాలు పెద్ద ఎత్తున పాల్గొననున్న కామన్వెల్త్ క్రీడలు



క్రీడలు మాత్రమే కాకుండా విభిన్న రంగాల్లో ఉద్యోగ కల్పన,

పర్యాటక అభివృద్ధి, వృత్తిపరమైన అవకాశాలను సృష్టించనున్న సీడబ్ల్యూజీ

Posted On: 27 AUG 2025 3:38PM by PIB Hyderabad

కామన్వెల్త్ క్రీడలు-2030 (సీడబ్ల్యూజీవేలంలో పాల్గొనేందుకు బిడ్ సమర్పించాలన్న యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఆమోదించిందిబిడ్ ఆమోదం పొందినట్లయితే.. సంబంధిత మంత్రిత్వ శాఖలువిభాగాలుఅధికారుల నుంచి అవసరమైన హామీలతో పాటు ఆతిథ్య సహకార ఒప్పందంపై (హెచ్‌సీఏహోస్ట్ కొలాబొరేషన్సంతకం చేయడానికి.. గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని (గ్రాంట్-ఇన్-ఎయిడ్‌మంజూరు చేసేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది

72 దేశాలకు చెందిన క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంటారుక్రీడాకారులుకోచ్‌లుక్రీడలను నియంత్రించే అధికారులుపర్యాటకులుక్రీడలకు సంబంధించిన మీడియా వ్యక్తులు వంటి వారు ఈ భారీ క్రీడా కార్యక్రమానికి హాజరవుతారుఇది స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుందివారి ఆదాయాలను పెంచుతుంది

ప్రపంచ స్థాయి స్టేడియంలుఅత్యాధునిక శిక్షణ సౌకర్యాలుమంచి క్రీడా సంస్కృతిని అందించే ఆహ్మదాబాద్ ఈ క్రీడల ఆతిథ్యానికి సరైన నగరంగా ఉంటుందిప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం.. 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇప్పటికే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది

భారతదేశంలో సీడబ్ల్యూజీని నిర్వహించటం వల్ల కేవలం క్రీడలకే కాకుండా పర్యాటకం వృద్ధి చెందడంఉద్యోగాలను సృష్టించడంతో పాటు లక్షలాది యువ క్రీడకారులకు స్ఫూర్తినిస్తుందిఅంతేకాకుండా స్పోర్ట్స్ సైన్స్కార్యక్రమాల నిర్వహణలాజిస్టిక్స్ట్రాన్స్‌పోర్ట్ కోఆర్డినేటర్లుప్రసారాలుమీడియాఐటీకమ్యూనికేషన్లుప్రజా సంబంధాలుకమ్యూనికేషన్లు తదితర రంగాల్లో కూడా పెద్ద సంఖ్యలో నిపుణులు అవకాశాలను పొందుతారు.

ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల దేశ గౌరవంఐక్యత భావన బలపడుతుందిభారీ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో దేశానికి అనుభవాన్ని అందిస్తుందిభారతదేశ మనోధైర్యాన్ని కూడా పెంచుతుందిఇది క్రీడలను తమ జీవితంగా ఎంచుకునేందుకు నవతరం క్రీడాకారులనకు స్ఫూర్తినిస్తుందిదీనితో పాటు అన్ని స్థాయీ క్రీడలలో ఎక్కువ భాగస్వామ్యం ఉండేలా ప్రోత్సహిస్తుంది

 

***


(Release ID: 2161276)