రాష్ట్రపతి సచివాలయం
గణేశ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
Posted On:
26 AUG 2025 4:50PM by PIB Hyderabad
గణేశ చతుర్థి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఒక సందేశంలో రాష్ట్రపతి ఇలా పేర్కొన్నారు: -
‘‘గణేశ చతుర్థి శుభ సందర్భంగా, దేశ విదేశాల్లోని భారతీయులందరికీ మనస్ఫూర్తిగా నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటాం. భగవాన్ శ్రీ గణేశుని జ్ఞానాధిపతిగా, శ్రేయోనిధిగా ఆరాధిస్తాం. ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు ఆయన ఆశీర్వాదాలు కావాలని మనం కోరుకుంటాం. విఘ్నాలను తొలగించమంటూ ప్రార్థిస్తాం. ఈ పర్వదినం కొత్త లక్ష్యాలను సాధించడానికి, సానుకూల భావనతో ముందుకు పోయేందుకు మనకందరికీ ప్రేరణనిస్తుంది.
మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ, స్వచ్ఛ హరిత, సమృద్ధితో కళకళలాడే దేశాన్ని నిర్మించే మార్గంలో కలిసికట్టుగా ముందుకు సాగే ఉద్దేశంతో ఈ పండుగను జరుపుకొందాం రండి.’’
రాష్ట్రపతి సందేశాన్ని చూడడానికి ఈ కింది వాక్యాన్ని క్లిక్ చేయగలరు..
Click here to see the President's message
***
(Release ID: 2160910)