ప్రధాన మంత్రి కార్యాలయం
అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం అద్భుతం....
సరికొత్త అవకాశాల దిశగా యువతనీ, అంకుర సంస్థల్నీ ప్రోత్సహిస్తున్న సంస్కరణలు: ప్రధాన మంత్రి
Posted On:
23 AUG 2025 1:03PM by PIB Hyderabad
భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజల నైపుణ్యాలు, ప్రతిభతో అంతరిక్ష ప్రపంచంలో భారత్ విశేషమైన పురోగతిని సాధిస్తోందని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
తమ ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని ప్రధానమంత్రి తెలిపారు. ఇవి యువత, ప్రైవేటు రంగం, అంకుర సంస్థలు కొత్త అవకాశాలను అన్వేషించటానికి ఉపయోగపడ్డాయన్నారు. ఇవన్నీ భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి అర్థవంతంగా దోహదపడతాయని చెప్పారు.
రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగంలో దేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని, జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ అంతరిక్ష ప్రయాణాన్ని మరింత శక్తివంతం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
'ఎక్స్' వేదికగా చేసిన పోస్టుల్లో మైగవ్ ఇండియా చేసిన భారత అంతరిక్ష ప్రయాణం, భారతదేశ అంతరిక్ష అంకురల సంస్థల విజయాలపై శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా అన్నారు;
"140 కోట్ల భారతీయుల నైపుణ్యంతో, మన దేశం అంతరిక్ష ప్రపంచంలో విశేషమైన పురోగతిని సాధిస్తోంది. మనం మరింత అభివృద్ధిని సాధించబోతున్నాం!
#NationalSpaceDay"
"మన ప్రభుత్వం అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు చేపట్టింది. ఇవి యువత, ప్రైవేట్ రంగం, అంకుర సంస్థలు సరికొత్త అవకాశాలను అన్వేషించటానికి, భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి అర్థవంతంగా తోడ్పడతాయి.
#NationalSpaceDay”
(Release ID: 2160356)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam