వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవ్వు తగ్గడం, కూల్‌ స్కల్ప్టింగ్ అంటూ బూటకపు ప్రకటనలు చేసిన వీఎల్‌సీసీ కంపెనీకి రూ.3 లక్షల జరిమానా


విధించిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(సీసీపీఏ)

భవిష్యత్తులో ప్రకటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీసీపీఏ ఆదేశం

Posted On: 23 AUG 2025 12:43PM by PIB Hyderabad

యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన కూల్‌ స్కల్ప్టింగ్ ప్రక్రియ/యంత్రాన్ని ఉపయోగించి కొవ్వు తగ్గించడంబరువు తగ్గించే చికిత్సలకు సంబంధించి బూటకపు వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన వీఎల్‌సీసీ కంపెనీకి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) రూ.3 లక్షల జరిమానా విధించింది.

గతంలోకూల్‌ స్కల్ప్టింగ్ చికిత్సలకు సంబంధించి బూటకపు ప్రకటనలు ప్రచురించినందుకు కాయా అనే కంపెనీకి కూడా సీసీపీఏ రూ.3 లక్షల జరిమానా విధించింది. "కాయా నాన్-సర్జికల్ ఫ్యాట్ రిడక్షన్", "కూల్‌స్కల్ప్టింగ్ ద్వారా కాయా సులభంగా బరువు తగ్గిస్తుందిఅని సంస్థ వాణిజ్య ప్రకటనల్లో పేర్కొందిశరీరంలో గణనీయమైన కొవ్వు తగ్గుదలను సూచించే 'ముందు-తర్వాత చిత్రాలను కూడా ప్రచురించిందిఇవన్నీ యూఎస్-ఎఫ్‌డీఏ ఇచ్చిన ఆమోదాన్ని మించి బరువు తగ్గించే చికిత్సగా చూపించాయిసీసీపీఏ ఆదేశానుసారం..కాయా కంపెనీ కూడా జరిమానా చెల్లించింది.

ఒక ఫిర్యాదుస్లిమ్మింగ్బ్యూటీ రంగాల ప్రకటనల పర్యవేక్షణ ద్వారా వీఎల్‌సీసీ లిమిటెడ్ చేసిన తప్పిదం గురించి సీసీపీఏకి తెలిసిందిపరిశీలనలోవీఎల్‌సీసీ ఒకే సిట్టింగ్‌లో భారీగా బరువు తగ్గించటంఇంచు వరకు కొవ్వు తగ్గించటం వంటివి చేస్తున్నట్లు తేలిందిఇవి కూల్‌స్కల్ప్టింగ్ యంత్రానికి ఇచ్చిన అసలు ఆమోదాన్ని దాటివినియోగదారులను తప్పుదోవ పట్టించాయి.

కూల్‌స్కల్ప్టింగ్సంబంధిత చికిత్సల ద్వారా బరువుపరిమాణం తగ్గించుకునే శాశ్వత పరిష్కారాలుగా వీఎల్‌సీసీ ప్రకటనలు తప్పుదారి పట్టిస్తున్నట్లు తదుపరి దర్యాప్తులో తేలింది.  

వాటిలో కొన్ని వాదనలు ఈ విధంగా ఉన్నాయి:

  • "ఒకే సిట్టింగ్‌లో 600 గ్రాములు, 7 సెం.మీవరకు బరువు తగ్గండి"

  • "ఒకే సిట్టింగ్‌లో శాశ్వతంగా ఒక సైజు తగ్గండి"

  • "ఒకే గంటలో ఒక సైజు తగ్గండి"

  • "కొవ్వు తగ్గించే అద్భుత చికిత్సను వీఎల్‌సీసీ మీ ముందుకు తెస్తుంది"

  • "లైపోలేజర్‌తో ఒకే సిట్టింగ్‌లో సెం.మీ., 400 గ్రాములు తగ్గండి"

కూల్‌స్కల్ప్టింగ్ ప్రకటనలుశాశ్వతంగాగణనీయంగా బరువు తగ్గిస్తాయనే తప్పుడు అభిప్రాయాన్ని వినియోగదారుల్లో కలిగించాయివాస్తవానికిఈ ప్రక్రియ శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే కొవ్వు తగ్గించటానికిబీఎంఐ 30 లేదా అంతకంటే తక్కువ ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన కూల్‌స్కల్ప్టింగ్ యంత్రానికి సంబంధించి సీసీపీఏ పరిశీలన ఇలా ఉంది:

  • కూల్‌స్కల్ప్టింగ్ యంత్రాన్ని జెల్టిక్ ఈస్థెటిక్స్ అనే సంస్థ తయారు చేస్తుందిదీని ద్వారా కేవలం కొన్ని ప్రాంతాల్లో ఉండిపోయిన కొవ్వును తగ్గించడానికి మాత్రమే యూస్-ఎఫ్‌డీఏ ఆమోదం ఉందిఅవిపైచేయిరొమ్ము భాగంలోని కొవ్వువీపు కొవ్వుబనానా రోల్సబ్‌మెంటల్ ప్రాంతంతొడపొట్టపక్క భాగాల్లోని కొవ్వు.

  • ఇది బరువు తగ్గించే చికిత్స కాదు.

  • యూఎస్-ఎఫ్‌డీఏకు సమర్పించిన క్లినికల్ ట్రయల్స్‌లో కేవలం 57 మంది పాల్గొన్నట్లు ఉందివీరంతా కాకేసియన్హిస్పానిక్ఆఫ్రికన్-అమెరికన్ జాతులకు చెందినవారుఇందులో భారతీయ లేదా ఆసియన్ జాతికి చెందినవారు ఒక్కరు కూడా లేరు.

  • భారతదేశంలో కూల్‌స్కల్ప్టింగ్‌ను ఉపయోగించడానికి యూఎస్-ఎఫ్‌డీఏ నిర్దిష్ట ఆమోదం తెలపలేదు.

కీలక నిజాలని దాచిపెట్టి వీఎల్‌సీసీ వినియోగదారులను తప్పుదోవ పట్టించిందిదీంతో వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 ఉల్లంఘించినట్లు అయింది.

వీఎల్‌సీసీకి రూ.3 లక్షల జరిమానా విధించటంతో పాటుభవిష్యత్తులో ప్రచురించే అన్ని ప్రకటనల్లో కింది నిబంధనలను కఠినంగా పాటించాలని సీసీపీఏ ఆదేశించింది:

అన్ని భవిష్యత్తు ప్రకటనలు/నిరాకరణల్లో ఈ కింది విషయాలు స్పష్టంగా ఉండేలా చూపించాలి:

  • ఏ శరీర భాగాలు లక్ష్యంగా కొవ్వు తగ్గిస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలి.

  • ఈ ప్రక్రియ బీఎంఐ 30 లేదా అంతకంటే తక్కువ ఉన్న వ్యక్తులకు మాత్రమే పనిచేస్తుందని తెలియజేయాలి.

  • యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం ప్రకారం ఉన్న అన్ని చేరికలుమినహాయింపులను పొందుపరచాలి.

  • ఈ యంత్రం ఏ ప్రాంతాల ప్రజలపై పరీక్షించారనే వివరాలను తెలియజేయాలి.

బిప్రకటనలుసమ్మతి పత్రాలు రెండింటిలోనూ, "కూల్‌స్కల్ప్టింగ్ ప్రక్రియ శరీరంలోని కొవ్వును తగ్గించటానికి ఉపయోగపడుతుంది కానీ బరువు తగ్గించటానికి కాదుఅని స్పష్టంగాసులభంగా చదవగలిగేలా తెలపాలి.

సియూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదించిన వాటికి మాత్రమే పరిమితం కావాలని సీసీపీఏ ఆదేశించింది.

డిఈ సేవను పొందే ముందుభారతీయులపై ఈ చికిత్సను పరీక్షించలేదనిఅలాగే భారత్ కోసం యూఎస్-ఎఫ్‌డీఏ దీనికి ఆమోదం తెలపలేదని వినియోగదారులకు తెలియజేయాలి.

ప్రకటనలకు సంబంధించి చట్టబద్ధమైన బాధ్యతజవాబుదారీతనం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే అన్యాయమైనపక్షపాతపూరిత ఒప్పంద నిబంధనలను నిలిపివేయాలి.

భారతదేశంలో కూల్‌ స్కల్ప్టింగ్ యంత్రాలను ఉపయోగించే అన్ని బ్యూటీ క్లినిక్‌లువెల్‌నెస్ సెంటర్లుసర్వీస్ ప్రొవైడర్లు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సీసీపీఏ హెచ్చరించిందిఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద జరిమానాలు విధించటంతప్పుదోవ పట్టించే ప్రకటనలను నిలిపివేయటంతోపాటు చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపింది.

ఈ ఆదేశాలు ఆరోగ్యంవెల్‌నెస్అందానికి సంబంధించిన ప్రకటనల్లో బూటకంతప్పుదోవ పట్టించేలేనిది ఉన్నట్లుగా చూపించే వాణిజ్య ప్రకటనల నుంచి వినియోగదారులను రక్షించాలనే సీసీపీఏ నిబద్ధతను బలోపేతం చేస్తాయి.

కూల్‌స్కల్ప్టింగ్ ద్వారా తక్షణమే బరువు తగ్గటం లేదా శాశ్వతంగా సైజు తగ్గించుకోవచ్చంటూ హామీలిచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దనివినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సీసీపీఏ సూచించింది.

 

***


(Release ID: 2160352)