ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్


· ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతంలో వివాదాల శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నాలపై చర్చ

· వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడానికి

భారత్ స్థిరమైన మద్దతును పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి మోదీ

· భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చ

Posted On: 21 AUG 2025 6:30PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈరోజు ఫోన్‌లో సంభాషించారు.

ఉక్రెయిన్పశ్చిమాసియా ప్రాంతంలో వివాదాల శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వారిద్దరూ చర్చించారు.

ఐరోపా, అమెరికా ఉక్రెయిన్ నాయకుల మధ్య ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన సమావేశాలపై తన అభిప్రాయాలను ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత ప్రధానమంత్రితో పంచుకున్నారుగాజా పరిస్థితిపైనా తన ధోరణిని తెలియజేశారు.

ఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంతోపాటు వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడానికి భారత్ పూర్తిగా మద్దతిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

 

వాణిజ్యం, రక్షణపౌర అణు సహకారంసాంకేతికతఇంధన రంగాలు సహా ద్వైపాక్షిక సహకార ఎజెండాలో పురోగతిపైనా నాయకులిద్దరూ సమీక్షించారుభారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు 2026ను ‘ఆవిష్కరణల సంవత్సరం’గా తగిన రీతిలో గుర్తించడంలో ఉమ్మడి నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు.

 

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసేందుకు కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మద్దతు తెలిపారు.

 

అన్ని అంశాలపైనా సంప్రదింపులను కొనసాగించడంపై నాయకులిద్దరూ అంగీకారం తెలిపారు.


(Release ID: 2159537)