రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోల్ ప్లాజాల వద్ద ద్విచక్ర వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారనే నకిలీ వార్తలపై కేంద్రం స్పష్టీకరణ

Posted On: 21 AUG 2025 1:23PM by PIB Hyderabad

జాతీయ రహదారులపైనున్న టోల్ ప్లాజాల వద్ద ద్విచక్ర వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలపై కేంద్రం స్పందించింది.  ద్విచక్ర వాహనదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని జాతీయ రహదారుల అధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టం చేసింది. జాతీయ రహదారి రుసుము (ధరలు, వసూలు నిర్ణయం) నియమాలు-2008 చట్టం ప్రకారం జాతీయ రహదారులపై  వినియోగదారుల రుసుము వసూలు చేస్తారని తెలిపింది. అయితే ద్విచక్ర వాహనదారుల నుంచి  టోల్ రుసుము వసూలు చేసే ప్రతిపాదనేది లేదని పేర్కొంది.

నిబంధనల ప్రకారం, టోల్ ప్లాజాల మీదుగా వెళ్తున్న నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాల నుంచి మాత్రమే వినియోగదారు రుసుము వసూలు చేస్తారని తెలిపింది.  వీటిలో కారు, జీప్, వ్యాన్, తేలికపాటి మోటర్ వాహనాలు లేదా తక్కువ బరువు సరుకులను తీసుకెళ్లే వాహనాలు, మినీ బస్సు లేదా ట్రక్కు, నిర్మాణ పనుల కోసం ఉపయోగించే భారీ వాహనాలు, భూమిని తవ్వడం, తరలించడానికి ఉపయోగించే వాహనాలు, మూడు నుంచి ఆరు టైర్లు కలిగిన వాహనాలు, అతి భారీ వాహనాలు (ఏడు లేదా అంతకంటే ఎక్కువ టైర్లు) వంటివి ఉన్నాయి.

 

***


(Release ID: 2159139)