ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాకుంభ్ ముగిసిన తర్వాత గుజరాత్ లోని సోమనాథ్ మందిరాన్ని ప్రత్యేకంగా సందర్శించిన పీఎం

Posted On: 02 MAR 2025 8:32PM by PIB Hyderabad

 ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ్ ముగిసిన అనంతరం ఇవాళ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని సోమనాథ్ మందిరాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ ఆలయం మన సంస్కృతి, వారసత్వ పరాక్రమాలను సూచిస్తుందని అన్నారు.

"ఎక్స్" లో వివిధ పోస్టుల్లో ఇలా పేర్కొన్నారు:

 ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ్ ముగిసిన తర్వాత ద్వాదశ jజ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ వెళ్లాలని నిర్ణయించుకున్నా.

ఇవాళ, సోమనాథ్ ఆలయంలో ప్రార్థించే అవకాశం దొరకటం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ప్రతి భారతీయుడి ఆయురారోగ్యాలు,శ్రేయస్సు కోసం ప్రార్థించాను. ఈ ఆలయం మన సంస్కృతి, వారసత్వ పరాక్రమాలను ప్రతిబింబిస్తుంది.

"ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఐక్యతా మహా కుంభమేళా కోట్లాది మంది దేశ ప్రజల సహకారంతో విజయవంతంగా పూర్తయింది. ఒక సేవకుడిగా, మహా కుంభమేళా తర్వాత, పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిదైన  శ్రీ సోమనాథ ఆలయాన్ని  సందర్శించాలని నిశ్చయించుకున్నాను.

"ఈ రోజు, సోమనాథుని ఆశీస్సులతో ఆ సంకల్పం నెరవేరింది. దేశవాసులందరి తరపున, ఐక్యతా మహా కుంభమేళా విజయవంతంగా పూర్తవటాన్ని శ్రీ సోమనాథ భగవంతుని పాదపద్మాలకు సమర్పించాను. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో తులతూగాలని కూడా ప్రార్థించాను"

 

***


(Release ID: 2158926) Visitor Counter : 6