ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శుభాన్షు శుక్లాతో ప్రధాని సంభాషణ

Posted On: 19 AUG 2025 11:56AM by PIB Hyderabad

ప్రధానమంత్రి – ఓ అత్యద్భుత ప్రయాణం చేసొచ్చారు మీరంతా...

శుభాన్షు శుక్లా – అవును సర్.

ప్రధానమంత్రి – తప్పకుండా మీకో భిన్నమైన అనుభవమే కదా ఇదిమీ అనుభూతులను తెలుసుకోవాలనుకుంటున్నాను.

శుభాన్షు శుక్లా – సర్మేమక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణంపరిసరాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయిగురుత్వాకర్షణ శక్తి లేదు.

ప్రధానమంత్రి – సీటింగ్ సదుపాయం విషయానికొస్తేఅది అలాగే ఉంటుందా?

శుభాన్షు శుక్లా – అవును సర్అలాగే ఉంటుంది.

ప్రధానమంత్రి – మీరు మొత్తం 23-24 గంటలు అదే స్థలంలో గడపాలా?

శుభాన్షు శుక్లా – అవును సర్కానీ ఒకసారి అంతరిక్షానికి చేరుకున్నాకకొక్కీని తీసేసి సీటు నుంచి పైకి లేవొచ్చుక్యాప్సూల్ లోపల తేలుతూకదులుతూ పనులు చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి – లోపల అంత స్థలం ఉంటుందా?

శుభాన్షు శుక్లా – మరీ ఎక్కువ కాదు సర్కొద్దిగా ఉంటుంది.

ప్రధానమంత్రి – అంటేమీ ఫైటర్ జెట్‌లోని కాక్ పిట్ కన్నా పెద్ద స్థలమేనా?

శుభాన్షు శుక్లా – అంతకన్నా నయమే సర్కానీ అక్కడికి చేరుకున్నాక చాలా మార్పులొస్తాయిఉదాహరణకుగుండె కొట్టుకోవడం నెమ్మదిస్తుందిచాలా మార్పులు చోటు చేసుకుంటాయికానీనాలుగైదు రోజుల్లో శరీరం దానికి అలవాటుపడిపోయిఅక్కడ సాధారణ స్థితికి చేరుకుంటాంతిరిగొచ్చాకా అవే మార్పులుంటాయిఎంత ఆరోగ్యంగా ఉన్నా.. తిరిగొచ్చిన వెంటనే నడవలేంనా వరకైతే నాకు అనారోగ్యంగా అనిపించలేదునేను బాగానే ఉన్నానుఅయినానేను మొదటి అడుగు వేసినప్పుడు పడిపోబోయానుఅక్కడున్నవారు నన్ను పట్టుకోవాల్సి వచ్చిందితర్వాత రెండోమూడో అడుగులు... నడవాలని మనసుకు తెలిసినాఇప్పుడిది కొత్త వాతావరణమని మెదడుకు అర్థమయ్యేందుకు సమయం పడుతుంది.

ప్రధానమంత్రి – అయితే ఇది కేవలం శరీరానికిచ్చే శిక్షణ మాత్రమే కాదుఅంతకు మించిన మానసిక శిక్షణ.. అవునా?

శుభాన్షు శుక్లా – అవును సర్ఇది మనసుకు ఇచ్చే శిక్షణశరీరానికి బలముందికండరాలకు శక్తి ఉందికానీమెదడును మళ్లీ సిద్ధపరచుకోవాలిఇది కొత్త వాతావరణమనిఇక్కడ నడవాలంటే ఇంత శ్రమ లేదా బలం అవసరమని మెదడు మళ్ళీ అర్థం చేసుకోవాలిదాన్ని మళ్లీ నేర్చుకోవాలి సర్.

ప్రధానమంత్రి – అందరికన్నా ఎక్కువ కాలం అక్కడ ఎవరున్నారుఎంతకాలం ఉన్నారు?

శుభాన్షు శుక్లా – సర్ప్రస్తుతానికి.. ఈ మిషన్ మొదలైనప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలలుగా కొంతమంది అక్కడే ఉన్నారు.

ప్రధానమంత్రి – వారినేనా మీరక్కడ కలిసింది...

శుభాన్షు శుక్లా – అవునువారిలో కొందరు డిసెంబరులో తిరిగొస్తున్నారు.

ప్రధానమంత్రి – పెసలుమెంతి ప్రాధాన్యం ఏమిటి?

శుభాన్షు శుక్లా – అది చాలా ముఖ్యమైంది సర్ఈ విషయాల గురించి వారికి తెలియకపోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచిందిఅంతరిక్ష కేంద్రంలో ఆహారం ఓ పెద్ద సవాలుఅక్కడ స్థలం చాలా పరిమితంసరుకులెంతో విలువైనవిచిన్న స్థలంలోనే గరిష్ఠంగా కేలరీలుపోషకాలను సర్దేలా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారక్కడఅన్ని రకాల ప్రయోగాలూ జరుగుతున్నాయి సర్వీటిని పెంచడం చాలా సులభంఅంతరిక్ష కేంద్రంలో వారికి ఎక్కువ వనరులేమీ అవసరం లేదుఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి వాటిని వదిలేస్తే.. ఎనిమిది రోజుల్లో మొలకలు మంచిగా కనిపించడం మొదలవుతుంది సర్స్టేషన్‌లోనే అవి పెరగడం చూశానుఇవే మన దేశ రహస్యాలని నేనంటాను సర్మైక్రో గ్రావిటీపై పరిశోధన చేసే అవకాశం మనకు లభించగానేఇవీ అక్కడికి వచ్చేశాయిఎవరికి తెలుసు... ఇది మన ఆహార భద్రత సమస్యను పరిష్కరించొచ్చుఇది వ్యోమగాములకు స్టేషన్‌లో ఉపయోగకరంగా ఉంటుందిఅక్కడ పరిష్కారం దొరికితేభూమిపై కూడా ఆహార భద్రత సవాళ్లను పరిష్కరించడంలో అది మనకు సహాయపడుతుంది సర్.

ప్రధానమంత్రి – ఇప్పుడు ఓ భారతీయుడు అక్కడికెళ్లాడువివిధ దేశాల నుంచి వచ్చిన వారు అక్కడొక భారతీయుడిని చూసి ఆ సమయంలో ఏమనుకున్నారువాళ్లు ఏమడిగారుదేని గురించి మాట్లాడారు?

శుభాన్షు శుక్లా – అవును సర్గత సంవత్సర కాలంగా నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే.. నేను ఎక్కడికి వెళ్ళినాఎవరిని కలిసినా.. వారంతా నన్ను సంతోషంగా కలుస్తూమాట్లాడడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారుమనమేం చేస్తున్నామోఎలా చేస్తున్నామో అడిగి తెలుసుకుంటున్నారుఅన్నిటికంటే ముఖ్యంగా.. అంతరిక్ష రంగంలో భారత్ పురోగతి గురించి అందరికీ తెలుసుగగన్‌యాన్ గురించి చాలా మంది నాకన్నా కూడా ఉత్సాహంగా ఉన్నారు సర్మన మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతుందని వాళ్లు నన్ను అడిగారునా సహచర సిబ్బంది అయితే.. గగన్ యాన్ ఎప్పుడు ప్రారంభమయినా తమను ఆహ్వానించాలనిత్వరలోనే మన వాహనంలో కూర్చోవాలనుకుంటున్నామని నోట్ రాసినాతో సంతకం కూడా చేయించుకున్నారుబ్రహ్మాండమైన ఉత్సాహం నాకక్కడ కనిపించింది.

ప్రధానమంత్రి – వాళ్ళు మిమ్మల్ని టెక్ జీనియస్ అని పిలిచేవారుకారణమేంటి?

శుభాన్షు శుక్లా – లేదు సర్అలా అనడం వారి గొప్పతనంకానీ సర్.. వైమానిక దళంలోఅనంతరం టెస్ట్ పైలట్‌గా నేను కఠోర శిక్షణ పొందానుఇక పెద్దగా చదవాల్సిన అవసరం లేదని వైమానిక దళంలో చేరిన సమయంలో నేననుకున్నానుకానీ తర్వాత నేను చాలా చదవాల్సి వచ్చిందిటెస్ట్ పైలట్ అయిన తర్వాత.. అది అప్లయిడ్ ఇంజినీరింగ్ విభాగం వంటిదిమాకు మరింత శిక్షణ కూడా ఇచ్చారుమన శాస్త్రవేత్తలు రెండుమూడునాలుగేళ్ల వరకు కూడా మాకు నేర్పించారుఅందుకే సర్.. మనం ఈ మిషన్ కోసం వెళ్లే నాటికి సంసిద్ధులపై ఉన్నామని నేననుకుంటున్నాను.

ప్రధానమంత్రి – నేనిచ్చిన హోంవర్క్‌లో నువ్వు ఎంతవరకు పురోగతి సాధించావు?

శుభాన్షు శుక్లా – చాలా మంచి పురోగతి ఉంది సర్ఆ తర్వాత జనాలు నన్ను చూసి చాలా నవ్వారుఆ మీటింగ్ తర్వాత.. మీ ప్రధానమంత్రి మీకు హోంవర్క్ ఇచ్చారు” అని వాళ్ళు నన్ను ఆటపట్టించారు కూడాఅవునునిజమే అని నేనన్నానుఇది మనం తెలుసుకోవడం చాలా అవసరమని నాకనిపించింది.. అందుకే వెళ్లానుమిషన్ విజయవంతమైంది సర్మేం తిరిగొచ్చాంఇది ముగింపు కాదుఆరంభం.

ప్రధానమంత్రి – ఆ రోజు నేను కూడా అదే చెప్పాను.

శుభాన్షు శుక్లా – అవును సర్ఆ రోజు మీరు చెప్పారు...

ప్రధానమంత్రి – ఇదే మన తొలి అడుగు.

శుభాన్షు శుక్లా – నిజమే సర్మొదటి అడుగుమనం ఎంత నేర్చుకోవచ్చుఎంత మనవెంట తీసుకురావచ్చన్నదే ఈ తొలి అడుగు ముఖ్య ఉద్దేశం.

ప్రధానమంత్రి – చూడుమనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటంటే.. పెద్ద సంఖ్యలో వ్యోమగాములు మనకుండాలిమన దగ్గర 40-50 మంది సిద్ధంగా ఉండాలిఇప్పటి వరకు, ‘‘నేనిది చేయాలి’’ అనుకునే పిల్లలు కూడా బహుశా చాలా తక్కువ మందే ఉండి ఉంటారుకానీ మీ ప్రయాణం తర్వాత బహుశా వారిలో నమ్మకం బలపడుతుందిదాని పట్ల ఆకర్షణ కూడా బాగా పెరుగుతుంది.

శుభాన్షు శుక్లా – సర్నా చిన్నతనంలో 1984లో రాకేశ్ శర్మ సర్ అంతరిక్షంలోకి వెళ్ళారుకానీ వ్యోమగామి కావాలనే ఆలోచన నా మనసులోకి ఎప్పుడూ రాలేదుఎందుకంటే మనకు అలాంటి ఏర్పాట్లు లేవుఏమీ లేదుకానీ ఈసారి నేను స్టేషన్‌లో ఉన్నప్పుడు పిల్లలతో మూడుసార్లు మాట్లాడాను.. ఒకసారి ఓ కార్యక్రమంలో నేరుగారెండుసార్లు రేడియో ద్వారా వారితో సంభాషించానుఈ మూడు సార్లూవారిలో కనీసం ఒక్కరైనా సర్నేను వ్యోమగామిని కావాలంటే ఏం చేయాలి?” అని అడిగేవారుఇది మన దేశం సాధించిన గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను సర్నేడు భారత్‌లో పిల్లలు కేవలం కలలు కనడానికే పరిమితం కాబోరుఅది సాధ్యమవుతుందనిఆ అవకాశం ఉందనికలను సాకారం చేసుకోగలమని వారికి తెలుసుసర్మీరు చెప్పినట్టు.. ఇదిప్పుడు నా బాధ్యతనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానుఇప్పుడు వీలైనంత ఎక్కువ మంది ఈ స్థాయికి చేరుకునేలా సహాయపడడం నా కర్తవ్యం.

ప్రధానమంత్రి – ఇప్పుడిక అంతరిక్ష కేంద్రంగగన్‌యాన్...

శుభాన్షు శుక్లా – సర్!  

ప్రధానమంత్రి – ఈ రెండూ మన ప్రధాన లక్ష్యాలు...

శుభాన్షు శుక్లా – సర్!

ప్రధానమంత్రి –ఈ విషయంలో మీ అనుభవం చాలా విలువైంది.

శుభాన్షు శుక్లా – నాకూ నమ్మకముంది సర్ముఖ్యంగా మీ నాయకత్వంలో మన ప్రభుత్వం అంతరిక్ష కార్యక్రమం పట్ల చూపిన నిబద్ధత అలాంటిదివైఫల్యాలు ఎదురైనప్పటికీఏటా స్థిరంగా బడ్జెటును కేటాయిస్తున్నారుఉదాహరణకుచంద్రయాన్-విజయవంతం కాలేదుఅయినా మేము ముందుకు సాగుతామని చెప్పాంచంద్రయాన్-విజయవంతమైందివైఫల్యాల తర్వాత కూడా అలాంటి మద్దతు లభిస్తే సర్.. నేడు ప్రపంచమంతా చూస్తోంది. కచ్చితంగా ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగే సామర్థ్యంస్థాయి రెండూ మనకున్నాయిభారత్ నేతృత్వంలో అంతరిక్ష కేంద్రం ఉండిఇతర దేశాల భాగస్వామ్యం కూడా ఉంటే.. అది చాలా శక్తిమంతమైన సాధనం కావచ్చుఅంతరిక్ష సంబం తయారీలో ఆత్మనిర్భరత గురించి మీరు చెప్పిన మాటలు కూడా నేను విన్నాను సర్ఈ విషయాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయిమీరు మాకిచ్చిన లక్ష్యాలు గగన్‌యాన్బీఏఎస్ఆపై చంద్రునిపైకి వెళ్లడం... నిజంగా చాలా గొప్ప స్వప్నాలు సర్.

ప్రధానమంత్రి –స్వావలంబనతోనే మనం దీన్ని సాధిస్తే చాలా మంచిది.

శుభాన్షు శుక్లా – కచ్చితంగా సర్.

శుభాన్షు శుక్లా – అంతరిక్షం నుంచి భారత్ ఛాయా చిత్రాలను తీయడానికి కూడా నేను ప్రయత్నించాను సర్ఇక్కడే భారత్ ప్రారంభమవుతుందిఈ త్రికోణాకృతి బెంగళూరు సర్ఇది హైదరాబాద్సర్ఈ మెరుపు చూడండి.. ఇది వెలుగుతోందిఈ ప్రాంతమంతా పర్వతాలున్నాయిమేం దాటిన ఈ చీకటి ప్రాంతం హిమాలయాలుపైన ఉన్నవన్నీ నక్షత్రాలు సర్మేము దాటుతుండగావెనుక నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు సర్.

 

***


(Release ID: 2158190)