ప్రధాన మంత్రి కార్యాలయం
శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి
Posted On:
18 AUG 2025 8:09PM by PIB Hyderabad
దేశాన్ని గర్వపడేలా చేసిన వ్యోమగామి శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ముచ్చటించారు. ఈ సమావేశంలో భాగంగా అంతరిక్షంలో శుక్లాకు ఎదురైన అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలు, దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర - గగన్‌యాన్‌తో సహా విస్తృత అంశాలపై చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
“శుభాంశు శుక్లాతో నా సమావేశం గొప్పగా సాగింది. అంతరిక్షంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతి, భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌తో సహా విస్తృతమైన అంశాలపై చర్చించాం. ఆయన సాధించిన ఘనతకు భారత్ గర్వపడుతోంది.
@gagan_shux”
(Release ID: 2157761)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam