ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీవన, వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే తర్వాతి తరం సంస్కరణలపై ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని

प्रविष्टि तिथि: 18 AUG 2025 8:40PM by PIB Hyderabad

తర్వాతి తరం సంస్కరణలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అధ్యక్షత వహించారు. జీవన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే, సమ్మిళిత సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన, సమగ్రమైన సంస్కరణలను అందించడమే ఈ సమావేశ లక్ష్యం.


సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘తర్వాతి తరం సంస్కరణలను సిద్ధం చేసే ప్రణాళికను చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించారు. అన్ని రంగాల్లోనూ జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యాన్ని, సంక్షేమాన్ని పెంపొందించే వేగవంతమైన సంస్కరణలకు మేం కట్టుబడి ఉన్నాం.’’


(रिलीज़ आईडी: 2157734) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam